చైనాలో గత కొన్ని రోజులుగా మళ్లీ వైరస్ విజృంభిస్తోందని వార్తలు వెలువడుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే అక్కడ రికార్డు స్థాయిలో 1300 లకు పైగా కేసులు నమోదయ్యాయని అధికార వర్గాల సమాచారం . చైనా ఈశాన్య నగరమైన చాంగ్‌చున్‌లో లాక్ డౌన్ కూడా విధించారు. వైరస్ ఉద్ధృతి ఈ నగరంలో ఎక్కువగా ఉందని అంటున్నారు.
90లక్షల జనాభా ఉన్న ఈ చాంగ్‌చున్ నగరంలో వ్యాపారాలన్నీ మూసివేశారు. ప్రజా రవాణాను నిలిపివేశారు. పర్యాటక కేంద్రాలను క్లోజ్ చేశారు. ప్రజలంతా తప్పనిసరిగా ఇంట్లోనే ఉండాలని ఆంక్షలు విధించారు. వైరస్ కట్టడిలో భాగంగా చాంగ్‌చున్ నగరం లో పరీక్షలు చేయడం మొదలు పెట్టారు. షాంఘై, ఇతర నగరాల్లోనూ లాక్‌డౌన్ తరహా ఆంక్షలు విధించబోతున్నారు.
రోజువారీ వెయ్యికి పైనే కేసులు నమోదు కావడం గత రెండేళ్లలో ఇదే ప్రధమం. మూడు వారాల క్రితం వరకు రోజుకి 100 కంటే తక్కువ కేసులు అయ్యాయి. కొద్దీ రోజులుగా కేసుల సంఖ్య కొద్ది రోజులుగా మెల్లగా పెరిగాయి. దీంతో ఆంక్షలు అమలు చేస్తున్నారు.కరోనా కట్టడికి జీరో కొవిడ్ వ్యూహాన్ని చైనా అమలు చేస్తోంది.
ఒక్క కేసు నమోదైనా లక్షల కొద్దీ పరీక్షలు చేస్తున్నారు. తాజాగా వెయ్యికి పైగా కేసులు బయటపడటంతో టెస్టులను మరింత ఉధృతం చేసింది. షాంఘైలోని కొన్ని ప్రాంతాల్లో విద్యాసంస్థలను లాక్ చేసి మరీ విద్యార్థులు, టీచర్లకు పరీక్షలు చేస్తున్నట్టు కొన్నివార్తలు ప్రచారంలో కొచ్చాయి. ఇక రెస్టారంట్లు, మాల్స్‌లో కూడా ఇదే తరహా పరీక్షలు చేస్తున్నారు. చైనా లో ఇలా ఇప్పటికి చాలామార్లు జరిగింది. ఈ తాజా కరోనా వైరస్ ఏ టైపు.. ఏమిటి ?దాని లక్షణాలు ఏమిటో అధికారులు ప్రకటించలేదు.