He proved that hard work can achieve good results………………….
సర్పంచ్ గా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టి ఒడిస్సా ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన మోహన్ చరణ్ మాఝీ, సంతాల్ కమ్యూనిటీకి చెందిన ప్రముఖ గిరిజన నాయకుడు, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేయబడిన కియోంజర్ నియోజకవర్గం నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
2024 ఎన్నికలలో బిజెడికి చెందిన మీనా మాఝీపై 11,577 ఓట్ల ఆధిక్యతతో విజయాన్ని సాధించారు.2000లో ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. కియోంజర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి జగదీష్ నాయక్‌పై 22,163 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు. ఆ తర్వాత మాఝీ 2004, 2019..ఎన్నికల్లో గెలిచి కియోంజర్‌కు ప్రాతినిధ్యం వహించారు.
అసెంబ్లీ లో ఆదివాసీల గొంతుక గా మారాడు. ఆదీవాసీల సమస్యలపై మాటాడేవాడు. 2009లో ఇనుప ఖనిజం మాంగనీస్ తవ్వకాల గురించి ఆందోళనలు లేవనెత్తారు.మాఝీ ప్రస్తావించిన అంశాలపై రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి విచారణ కూడా జరిపారు.
మాఝీ రాయికాల పంచాయతీ మాజీ సర్పంచ్ గా కూడా చేసారు. అంతకు ముందు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కి చెందిన సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో కొన్నాళ్ళు టీచర్ గా పనిచేశారు. మాఝీ 1987లో ఝుంపురా హైస్కూల్‌లో హయ్యర్ సెకండరీ విద్యను పూర్తి చేసాడు.. 1990లో ఆనందపూర్ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. దేంకనల్ లా కళాశాల లో LLB చదివారు.
సర్పంచ్ గా ఉన్నపుడు కూడా ప్రజాసమస్యల పరిష్కారం పై ఎక్కువగా దృష్టి పెట్టారు. అదే ఆయనను రాజకీయంగా ఎదిగేలా చేసింది. మాఝీ తండ్రి ఒక వాచ్‌మెన్.. ఒడిశా 15వ ముఖ్యమంత్రిగా ఎన్నికైన మోహన్ చరణ్ మాఝీ గిరిజనులు .. ఖనిజాలు అధికంగా ఉన్న కియోంజర్ జిల్లాకి చెందిన వాడు.
ఇక సీఎం పదవికి బీజేపీ నేతలు పలువురి పేర్లను పరిశీలించారు. మాఝీ సంఘ్ పరివార్ కోసం అంకితభావంతో పని చేసున్నారు. బిజెపి ఆదివాసీ మోర్చా కార్యదర్శిగా చేశారు. ఆయన మత మార్పిడులకు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు..
మైనింగ్ మాఫియా, అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా ఆయన పోరాడిన తీరు పార్టీలో ఆయన ఇమేజ్ ని పెంచింది. మాఝీ సీఎం కావడానికి ఈ అంశాలన్నీ అనుకూలించాయి.ఒడిశా లో గిరిజనులు ఆ రాష్ట్ర జనాభాలో 23 శాతం మంది ఉన్నారు..
పొరుగున ఉన్న జార్ఖండ్‌లోని వారి సోదరులతో సన్నిహిత అనుబంధాన్ని కలిగి ఉన్నారు, అక్కడ గిరిజనుల మద్దతును పొంద లేకపోయిన క్రమంలో అక్కడ బిజెపి రాణించలేక పోయింది.
మాఝీ సీఎం పదవికి ఎంపిక చేయడం ద్వారా జార్ఖండ్‌లోనే కాకుండా ఇతర రాష్ట్రాల గిరిజనులకు కూడా ఒక బలమైన సంకేతాన్నిపంపింది. మాఝీని సీఎం చేయడం ద్వారా గిరిజనులతో బీజేపీ అనుబంధానికి బలం మరింత పెరిగిందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
———KNMURTHY