ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిరాకరించారని పైకి అంటున్నప్పటికీ అసలు కాంగ్రెస్ పార్టీ యే తెలివిగా షరతులు పెట్టి అతగాడిని దూరంగా పెట్టింది.ఇక సోనియా ఆఫర్ ను ఎందుకు తిరస్కరించారనే అంశాన్ని పీకే స్పష్టంగా ఎక్కడా వివరించలేదు.
తాను కాంగ్రెస్ పార్టీలో చేరడంలేదనీ..ఆ పార్టీకి సలహాదారుడిగా మాత్రమే చేస్తానని పీకే స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ పీకే ను సలహాదారుడిగా కూడా అంగీకరించే సూచనలు లేవు. పీకే కి కూడా సీన్ అర్ధమైంది. అందుకే ట్విట్టర్ లో పోస్ట్ పెట్టి సైలెంట్ అయిపోయారు. ఎన్నికల్లో వరుస ఓటములతో సతమతమవుతోన్న కాంగ్రెస్‌తో మరోసారి కలిసి పనిచేసేందుకు పీకే తనంతట తానే అప్రోచ్ అయ్యారు.
ఈ క్రమంలోనే పలుమార్లు పార్టీ అధిష్ఠానంతో మంతనాలు జరిపిన ప్రశాంత్ కిశోర్.. 2024 సార్వత్రిక ఎన్నికలు, ఈ ఏడాది జరగబోయే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు అధిష్ఠానం ముందు పెట్టారు. పీకే వ్యూహాలపై అధ్యయనం చేసేందుకు సోనియా గాంధీ కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం నేతృత్వంలో ఓ కమిటీ వేశారు.ఆయన రిపోర్ట్ కూడా ఇచ్చారు.
పీకే ను షరతులతో చేర్చుకోవచ్చని సూచనలు చేశారు. ఈ షరతులు పీకే కి మింగుడు పడలేదు. తెలంగాణా సీఎం కేసీఆర్ తో చర్చించేవరకు పీకే కాంగ్రెస్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అటు కాంగ్రెస్ లో పదవి .. ఇటు సొంత దుకాణం నడుపుకోవాలని ఆశపడ్డారు. కానీ సొంత దుకాణం ఎత్తేయమనడంతోనే పీకే రివర్స్ అయ్యారు.
ఇదంతా ముందస్తు పధకం ప్రకారమే జరిగింది.కేసీఆర్ తో ఒప్పందం కుదుర్చుకుని వెళ్లడమే ఇందుకు నిదర్శనం అంటున్నారు. ఇక పీకే మళ్ళీ వచ్చి తెలంగాణలో తెరాస విజయం కోసం పనిచేసుకోవాలి. కేసీఆర్ తో ఒప్పందం కుదుర్చుకున్న పీకే ను కాంగ్రెస్ సలహాదారు గా మాత్రం ఎలా పెట్టుకుంటుంది. ఢిల్లీ వర్గాలు కూడా ఆ విషయమే చెబుతున్నాయి.
పాపం తనతో కలసి పీకే ప్రెస్ మీట్ పెడతాడని ..కేసీఆర్ ని విమర్శిస్తాడని రేవంత్ ముచ్చట పడ్డారు.ఆయన కోరిక తీరదేమో ?