కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

ఆ ఇద్దరి మధ్య పొత్తు కుదిరేనా ?

సూపర్ స్టార్ రజనీకాంత్ కోరితే తాను సీఎం అభ్యర్ధిగా పోటీ చేసేందుకు  రెడీ అంటున్నారు మక్కల్ నీది మయ్యుం పార్టీ అధినేత కమల్ హాసన్. రజనీ తాను సీఎం గా ఉండబోనని తేల్చి చెప్పిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే కమల్  రజనీకాంత్ తనను సీఎం అభ్యర్ధిగా ప్రకటిస్తే అంగీకరిస్తానని అంటున్నారు. తన మనసులో మాటేమిటో కమల్ బయట పెట్టారు. …

దీదీ కి కష్ట కాలం మొదలైందా ?

బెంగాల్ దీదీ కి కష్ట కాలం మొదలైనట్టుంది. బీజేపీ పశ్చిమ బెంగాల్ ను టార్గెట్ గా పెట్టుకుంది.  వచ్చే ఎన్నికల్లో బెంగాల్ లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని  కమల దళం వేగం గా పావులు కదుపుతోంది.  ఇటీవల బీజేపీ అగ్రనేత జేపీ నడ్డా కాన్వాయ్ పై దాడి జరిగిన దరిమిలా దూకుడు మరింత పెంచింది. ఈ క్రమంలోనే …

ఈ “చిన్నకాశీ” గురించి విన్నారా ?

మణికేశ్వరం .. ఇది పురాతన శైవక్షేత్రం.  ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలో ఉన్నది. గుండ్లకమ్మనది ఒడ్డున ఉన్న ఈ ఆలయం లో గంగా భాగీరధీ సమేత మల్లేశ్వరస్వామి  కొలువై ఉన్నారు. ఇది కాశీ విశ్వనాథుని దేవాలయం లాగా ఉండటం తో  ఈ మణికేశ్వరాన్ని చిన్న కాశీ అని కూడా పిలుస్తారు. స్థల పురాణం ప్రకారం ఉప్పు …

శని, బృహస్పతి కలిసే వేళ .. ఆకాశంలో అద్భుతం !

ఇవాళ ఆకాశంలో ఓ అద్భుతం జరగబోతోంది. సాయంత్రం 6 గంటలకు ఆకాశంలో పశ్చిమ దిక్కున బృహస్పతి, శని గ్రహాలు చేరువ కానున్నాయి. కొన్ని గంటలపాటు ఈ గ్రహాలు కలిసే ఉంటాయి. అతి ప్రకాశవంతమైన బృహస్పతి, శని గ్రహాలు రెండూ 0.1 డిగ్రీల దూరంలో ఒకదానికి ఒకటి దగ్గరగా వస్తాయి. క్రీస్తు శకం 1623లో బృహస్పతి, శని …

ఆ మినప రొట్టెల రుచి అద్భుతం !

కోనసీమలో మూకుడు రొట్టె చాలా పాపులర్. అందులో ముక్కామలలో  మినప రొట్టెలు  మరీ ప్రసిద్ధి. సాయంకాలం వేళలో ఈ మినప రొట్టెల కోసం జనం ఎదురుచూస్తుంటారు. ఉదయం పూట ప్రతీ ఒక్కరూ  ఇడ్లీ, పూరీ, దోశె , గారె వంటి పదార్ధాలను  అల్పాహారం  తీసుకోవడం సర్వసాధారణం. సాయంత్రం సమయంలో మాత్రం వేడే వేడి మూకుడు రొట్టె కోసం …

ఆయనకు సలహాదారులు కావలెను !!

విజయాలైనా … వైఫల్యాలనయినా ప్రజలే  డిసైడ్ చేస్తారు. ఓడిపోయిన వారు ఆ ప్రజలకు దగ్గరై మరల విజయం సాధించవచ్చు . కాకపోతే సరైన పద్దతిలో , సరైన వ్యూహంతో ముందుకు సాగాలి.  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్టీ కేవలం ఒకటి ,రెండు ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రానా కాడి వదిలేసి దూరంగా వెళ్ళటం  సబబుగా లేదని  ఆయన అభిమానులు అంటున్నారు. నిజానికి  ఇప్పటికి మించిపోయింది …

ఇకపై కొన్ని ఫోన్ల లో వాట్సాప్ పనిచేయదు!

వాట్సాప్ ఇక పై అన్ని ఫోన్లలో పనిచేయదు . 2021 జనవరి 1నుంచి ఈ కొత్త విధానం అమలులోకి రానుంది. కొన్ని ఐఫోన్లు, ఆండ్రాయిడ్‌ ఫోన్లలో వాట్సాప్‌ పనిచేయదని అంటున్నారు. కంపెనీ చెబుతున్న వివరాల ప్రకారం ఐఫోన్‌లో ఐవోఎస్‌ 9, ఆండ్రాయిడ్‌ ఫోన్లలో 4.0.3 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ కన్నా ముందువి ఉంటే వాటిలో మాత్రం వాట్సాప్‌ …

త్వరలో రాజ్యసభకు జస్టిస్ చలమేశ్వర్ ?

త్వరలో పెద్దల సభకు జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ను పంపే యోచన లో ఏపీ సీఎం జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి రాజ్య సభకు మేధావి వర్గానికి చెందిన వారినే పంపాలి. అయితే రాజకీయ పార్టీలు  ఎక్కువగా రాజకీయ నేతలనే ఎంపిక చేస్తుంటాయి.మేధావులను,రాజ్యాంగ నిపుణులను  పంపితే కీలకమైన బిల్లులు తదితర అంశాల్లో తమ వాదనలను వినిపిస్తారు. …

‘డ్రాగన్’ కు చెక్ చెప్పబోతున్నారా ?

చైనా దూకుడు కు చెక్ చెప్పేందుకు భారత్ సిద్ధమౌతున్నదా ? పరిస్థితి చూస్తుంటే అలాగే ఉందని అనిపిస్తుంది. పాకిస్తాన్‌, చైనా సరిహద్దుల్లో సైనికులకు 15 రోజుల యుద్ధానికి అవసరమైన మందుగుండు, ఆయుధాలు సిద్ధం చేసుకోవాలని ఆదేశాలు వెళ్లిన క్రమంలో ఈ సందేహాలు ఎవరికైనా వస్తాయి. దీనికి తోడు త్రివిధ దళాధిపతి బిపిన్‌ రావత్‌ మాటలు అలాగే …
error: Content is protected !!