అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ, వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
పై ఫొటోలో కనిపించే జంట చూడ ముచ్చటగా ఉంది కదా. కేవలం పొట్టిగా ఉన్నారు తప్పితే మరే లోపం ఆ ఇద్దరికీ లేదు. మొత్తం ప్రపంచంలోనే అతి పొట్టి వాళ్ళు ఈ ఇద్దరూ. బ్రెజిల్ కి చెందిన పాలో గాబ్రియేల్ వయసు 36 ఏళ్ళు. ఎత్తు 90.28 సెంటీమీటర్లు . కత్యుషియా లీషినో వయసు 33 ఏళ్ళు. ఎత్తు 91. 13 సెంటీమీటర్లు. …
జాడ లేకుండా పోయిన వివాదాస్పద స్వామి నిత్యానంద ట్విట్టర్ లో ఖాతా తెరిచి జోకులు పేలుస్తున్నాడు. కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో తమ దేశమైన కైలాష్ ద్వీపంలోకి భారతీయ భక్తులకు ప్రవేశం లేదని ప్రకటించారు. భారత్ తో పాటు బ్రెజిల్, ఈ యూ, మలేషియా భక్తుల ప్రవేశం పై నిషేధం విధిస్తున్నట్టు తన ప్రెసిడెన్షియల్ మెండేట్ లో …
భండారు శ్రీనివాసరావు .……………………………………… పేరుకు తగ్గట్టే మంచి రాజుకు ఉండాల్సిన సుగుణాలు అన్నీ కురుసార్వభౌముడు సుయోధనుడికి వున్నాయి. అయితే, అతడి దురదృష్టం, అసూయ అనే దుర్గుణం ఒక్కటే అతగాడి వినాశనానికి హేతువు అయింది.దాయాది ధర్మరాజు నిర్వహించిన రాజసూయ యాగానికి వెళ్లి వచ్చిన తర్వాత అతడిలో ఈ మత్సరం మరింతగా వెర్రి తలలు వేసింది. లక్కఇంటిని తగలబెట్టి …
“అందరికి ఇదే నా చివరి గుడ్ మార్నింగ్ .. రేపు నేను మిమ్మల్నిఇక్కడ మళ్ళీ కలవక పోవచ్చు.నా శరీరం ప్రాణాలు కోల్పోవచ్చు. కానీ ఆత్మ శాశ్వతం. అందరూ జాగ్రత్తగా ఉండండి “అంటూ ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టిన ఆమె కొద్దీ గంటల్లోనే మరణించారు. మరణాన్ని ఆమె ముందే ఊహించారు. ఆమె చెప్పినట్టుగా మరుసటి రోజు ఉదయాన్ని …
హిందువుల ఆరాధ్య దైవం ఆంజనేయుడి జన్మ స్థలం తిరుమల గిరుల్లోని అంజనాద్రే అని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఇందుకు చారిత్రక ఆధారాలున్నాయని స్పష్టం చేసింది. శ్రీరామనవమి రోజున ప్రకటిస్తామని చెప్పిన విధంగా ఇవాళ టీటీడీ ప్రకటన చేసింది. పండితులు, నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేసి ..పరిశోధన చేసి.. హనుమంతుడి జన్మస్థానం తిరుమలేనని టీటీడీ …
మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇవాళ 72 సంవత్సరంలోకి ప్రవేశించారు. ఇప్పటికి ఆయన చురుగ్గా క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొంటున్నారు. నిన్న గాక మొన్న జరిగిన తిరుపతి లోకసభ ఉపఎన్నిక ప్రచారంలోనూ బాబు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆయన కంటే చిన్నోళ్లు కృష్ణ రామా అనుకుంటూ ఇంటి దగ్గర కూర్చుంటుంటే .. బాబు మాత్రం …
అలుపూ సొలుపు లేకుండా మెట్లకిన్నెర మీద అతడు పలికించే గమకాలు గంధర్వ లోకంలో విహరింప జేస్తాయి. అతడి చేతివేళ్ల నడుమ పలికే కిన్నెర శబ్ద తరంగాలు మనల్ని ఎక్కడికో తీసుకెళ్తాయి. అలాంటి మెట్ల కిన్నెర వాయిద్య కళాకారుడు భిక్షమెత్తుకుంటున్నాడు. మొగిలయ్య ఆఖరి తరం వాయిద్య కారుడు కూడా. ఆయన ప్రతిభను గుర్తించి తెలంగాణ సర్కార్ మొదటి …
తెలుగు దేశం అధినేత ఎన్టీరామారావు కు 1983 ఎన్నికల సమయంలో పూర్తి మద్దతు ఇచ్చి .. రోజూ ఆయన వార్తలు , ఫోటోలు వేసి ఈనాడు విశేష ప్రచారం కల్పించిన విషయం అందరికి తెల్సిందే. అప్పట్లో ఆ ప్రచారం ఎన్టీఆర్ విజయానికి కొంత మేరకు దోహదపడింది.ఆ ప్రచారం మూలాన ఈనాడు సర్క్యులేషన్ పెరిగిందా లేదా అన్న …
పశ్చిమ బెంగాల్ ఎన్నికలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ .. తృణమూల్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. మరోవైపు కేంద్ర బలగాలు నలుగుర్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పడేశాయి. ఆవేశ కావేష ప్రసంగాలు సాగుతున్నాయి. నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరగగా బెంగాల్ లో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతున్నాయి. …
error: Content is protected !!