అప్పట్లో కుర్రకారును ఊపేసిన సినిమా!!

Sharing is Caring...

Subramanyam Dogiparthi………………………

హిందీ ఆరాధన చూడని వారికి బాగా నచ్చే సినిమా  ఈ కన్నవారి కలలు . 1974 సంక్రాంతికి ఈ సినిమా  రిలీజయింది.  ఆరాధన సినిమా ఓ మాస్టర్ పీస్.  అప్పట్లో కుర్రకారుని ఓ ఊపు ఊపింది . శక్తి సామంత ఎంత గొప్పగా తీసారంటే , రాజేష్ ఖన్నాని ఆకాశంలో కూర్చోబెట్టారు .కలెక్షన్ల సునామీని సృష్టించింది . మా నరసరావుపేట సత్యనారాయణ టాకీసులో వారం రోజులు ఆడితే నేను ఆరు రోజులు చూసా. 

అప్పట్లో హిందీ సినిమాలు మా ఊళ్ళో నైట్ షోలు వేసేవారు కారు . చాలా కొద్ది సినిమాలు అలా పడేవి . An evening in Paris , Bobby , సంగం నాకు గుర్తున్న సినిమాలు . ఈ ఆరాధన నైట్ షోగానే వేసారు . మా కాలేజి అబ్బాయిలు , అమ్మాయిలు అందరూ ఆ థియేటర్లోనే . రాజేష్ ఖన్నా , షర్మిలా టాగోర్ పోటాపోటీగా నటించారు . అశోక్ కుమార్ కనిపించేది కాసేపయినా మరచిపోలేం.  

ఇంక S D బర్మన్ సంగీతం అద్భుతం. రూపు తేరా మస్తానా ప్యార్ మేరా దీవానా , మేరీ సప్నోంకి రాణీ , కోరా కాగజ్ థా యే మేరా , గున్ గున్ రహాహై భ్రమర్ , చందా హైతూ మేరా సూరజ్ హై తూ , బాహుమే బహార్ హై తుంకో ముఝ్ సే ప్యార్ హై పాటలు , నేపధ్య సంగీతం సూపర్ . ఆరాధన సినిమాను తెలుగు , తమిళం , బెంగాలీ భాషల్లో రీమేక్ చేసారు . అమెరికన్ సినిమా అయిన To each his own ఆరాధనకు ఆధారం. 

మన తెలుగు సినిమాకు వద్దాం. ఈ సినిమాకు మరో ప్రత్యేకత ఉంది . మోహన్ బాబు మొదటిసారిగా ఈ సినిమాలో చిన్న పాత్రలో నటించారు. అంతకు ముందు అల్లూరి సీతారామరాజులో ఒక సీన్ లో కనిపించారు. టైటిల్స్ లో యం భక్తా చౌదరి అనే పేరు ఉంటుంది . ఏ పాత్రలో నటించారో చెప్పండి చూద్దాం. 

శోభన్ బాబు తండ్రి , కొడుకు పాత్రల్లో గొప్పగా నటించారు . వాణిశ్రీ గురించి చెప్పేదేముంది ! షర్మిలా టాగోర్ తో సమానంగా నటించింది . She may not look as gracious as Sharmila Tagore . కానీ , నటనలో సమానంగా నటించింది . ఇతర పాత్రల్లో లత , రామకృష్ణ , గుమ్మడి , ధూళిపాళ , ప్రభాకరరెడ్డి , కాకరాల , గీతాంజలి , ఝాన్సీ , త్యాగరాజు ప్రభృతులు నటించారు.  

వి కుమార్ సంగీత దర్శకత్వంలో ‘మధు ఒలకపోసే నీ చిలిపి కళ్ళు’ పాట సూపర్ హిట్ సాంగ్ . నేను ఇప్పటికీ నాకు తెలియకుండానే హం చేస్తుంటా . ‘ఒక నాటి మాట కాదు’ , ‘రాధా రాధా రాధా పులకింతరాదా’ , ‘చెలి చూపులోన’ ,’సారీ సో సారీ’ పాటలు శ్రావ్యంగా ఉంటాయి . యస్ యస్ బాలన్ స్వీయ దర్శకత్వంలో జెమిని బేనర్లో నిర్మించారు . రాజశ్రీ డైలాగులు బాగుంటాయి. 

ఆరాధన సినిమాలో రూప్ తేరా మస్తానా ప్యార్ మేరా దీవానా పాటతో పోల్చినప్పుడు ‘చెలి చూపులోన’ పాట తేలిపోతుంది . అందుకే చెప్పా . ఆరాధన చూడని వారికి కన్నవారి కలలు బాగా నచ్చుతుంది అని . Even then , మన తెలుగు సినిమా కూడా బాగానే ఆడింది . శోభన్ బాబు – వాణిశ్రీ జోడీ , సినిమా కధ మహిళలకు బాగా నచ్చింది. రెండు సినిమాలూ యూట్యూబులో ఉన్నాయి . Unmissable , romantic , feel good movies . ఆరాధన ఓ గొప్ప మ్యూజికల్ హిట్ . ఓ మ్యూజికల్ సెన్సేషన్ . రెండు సినిమాలూ తప్పక చూడండి. 

Tharjani …………………….

ఈ కన్నవారి కలలు సినిమాకు ముందుగా అక్కినేని ని హీరో గా అనుకున్నారు. అక్కినేని ఆరోగ్య సమస్యల కారణంగా కాల్షీట్స్ ఇవ్వలేదు. కొంతకాలం వెయిట్ చేయమన్నారట. జెమిని పిక్చర్స్ నిర్మాతలు ఆగకుండా  శోభన్ ను హీరో గా తీసుకుని సినిమా పూర్తి చేశారు. కాశ్మీర్ లో తీసిన తొలి తెలుగు సినిమా ఇదే అంటారు. 

తర్వాత కాలంలో కూడా అక్కినేని సూట్ అయ్యే పాత్రలకు శోభన్ బాబు నే నిర్మాతలు ప్రిఫర్ చేశారు. అప్పటినుంచే శోభన్ కి రొమాంటిక్ హీరో గా పేరొచ్చింది. జీవన తరంగాలు, చక్రవాకం వంటి నవలా చిత్రాలలో కూడా చేశారు. ఈ కారణాల వలన అప్పట్లో అక్కినేని, శోభన్ బాబుల మధ్య కొన్నాళ్ళ పాటు విభేదాలు కొనసాగాయని కూడా అంటారు. ‘కన్నవారి కలలు’ సినిమాకు ముందు ‘మంచిరోజులు వచ్చాయి’ సినిమాను అక్కినేని హీరోగా జెమిని పిక్చర్స్ వారే తీశారు. అది హిట్ అయింది.  

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!