తాంత్రిక విద్యలున్నాయా ?

Sharing is Caring...

What is tantra ………………………………………………..

ప్రస్తుత కాలంలో తంత్రం అంటే అదేదో చెడు చేయడం అని, రహస్యంగా కుట్రలను పన్నటం అని అందరూ అనుకుంటున్నారు. దాన్ని తంత్ర అనరు. కుతంత్రాలు అంటారు.ఒక కార్యాన్ని విజయవంతం చేయడానికి ఇష్ట కార్య సిద్ధి జరగడానికి కొన్ని మంత్రాలు,వస్తువులను ఉపయోగించి చేసే కార్యక్రమాన్ని తంత్రం అంటారు.

తంత్ర అనేది ఒక శక్తి గల మంత్రంతో గూడిన సాధనం లాంటిది. ఆ సాధనాన్ని శత్రు సంహారానికి ఉపయోగించవచ్చు.చెడు సంకల్పంతో చెడు కార్యములకు ఉపయోగించవచ్చు. మంచికి చేస్తే మంచి ఫలితాన్ని,చెడుకు చేస్తే చెడు ఫలితాలను పొందుతారు.

భారతంలో శకుని  తంత్రాన్ని ఉపయోగించి తంత్ర విద్య ద్వారా మాయా జూదం జరిగేలా చేసాడు. అది చెడు అవడం వలన అప్పటికి మాత్రం వారి కార్యం విజయవంతం అయింది. కానీ కౌరవులు పాచికల రూపంలో ప్రేతాత్మలను ఉపయోగించి చెడు బుద్ది తో చేసిన పాప తాంత్రిక కర్మ వలన చివరకు సర్వ నాశనం అయిపోయారు.సంకల్పాన్నిబట్టి ఈ తాంత్రిక విద్యల ద్వారా ఫలితాలు పొందుతారు.

మంచికి,ధర్మానికి చెడు ఎదురవుతున్న సందర్భంలో ఆ చెడును నిర్మూలించగల శక్తి ఆ పరమాత్మకి ఉన్నప్పటికీ.. తంత్ర విద్యల ద్వారా మానవ రూపంలో ఉన్న పాండవుల చేత ప్రయోగింపజేసి చెడును నిర్మూలించాడు.ఇందులో సూక్ష్మం ఏమిటంటే కర్మఫలం వలన మానవుడు ఎదుర్కొనే చెడు కర్మలకు నిర్మూలన మార్గాలను తంత్ర విద్యల రూపంలో ఆ మహావిష్ణువే వరంగా ప్రసాదించారు. 

మనం ఎదుర్కొంటున్న శత్రు సమస్యలను, వారు చేసే లేదా చేయించే అభిచార కర్మలను , మనమే తొలగించుకునేలా తంత్ర విద్యలను ప్రసాదించారు.ఎంతో శక్తివంతులు … శూరులూ , ధీరులు , ధర్మ పరాయుణులైన పాండవులు శత్రు సంహారానికి తంత్రాలను ఉపయోగించారు.

మహాభారతంలో ఉపయోగించిన అత్యంత శక్తివంతమైన అస్తశస్త్రాలు కూడా తాంత్రికమైనవే. ఆచరణకి కష్ట సాధ్యమైన నాగాస్త్రం. దీనినే వశీకరణ అస్త్రం అని కూడా అంటారు. ఆగ్నేయాస్త్రం , కుజాస్త్రం ఇది కుజుడికి సంబంధించినది , పాశుపతాస్త్రం ఇది మహాదేవుడికి సంబంధించినది. వాయువ్యాస్త్రం ఇది కేతువు , వాయు దేవుడికి సంబంధించినది . వారుణాస్త్రం ఇది వరుణుడికి సంబంధించినది. 

ఇలా ఎన్నో శస్త్ర అస్త్రాలు అధర్వణ వేదంలో భాగాలే .. అంటే ఇక్కడ మనం తెలుసుకోవల్సినది ఏమిటంటే ఈ శస్త్ర అస్త్రాలు అన్నీ కూడా తాంత్రిక విద్యలు. రాక్షస పీడను,శత్రు పీడను నిర్మూలించడం కోసం రూపొందించిన విద్యలు ..ద్వాపరయుగంలో, త్రేతాయుగంలో కూడా రాక్షస ఫీడను నిర్మూలించి లోక కళ్యాణం కోసం ఈ శస్త్ర అస్త్రాలను ఉపయోగించక తప్పలేదు. ఇందులో మర్మం ఏమిటి అంటే పైశాచిక తనాన్ని నిర్మూలించడమే.

కొంత శ్రద్ధగా గమనిస్తే ఇందులో మర్మం అర్థం అవుతుంది. ఎదుటి వారి పై తంత్ర విద్యలు ప్రయోగించాలన్న వారికి పూర్వ జన్మ పాపాలు,శాపాలు అధికంగా ఉంటేనే అవి వారి పై ప్రభావాన్ని చూపుతాయి. అంటే చేసే ప్రతీ క్రియ కూడా కర్మ ఫలమే .. అది మంచి కానీ చెడు కానీ, పైశాచిక గ్రహాల చెడు ప్రభావాలను నిర్మూలించడానికి మాత్రమే తంత్ర విద్యలు ఉపయోగపడతాయి.

విధిని తప్పించుకోవడం కష్టం కానీ తామస,రజో లక్షణాలు కలిగిన శత్రు పీడ నివారణా , అభిచార కర్మలను తంత్ర విద్యల ద్వారా నిర్మూలించవచ్చు.ఈ తంత్ర విద్యలను అభ్యసించిన వారు వీలైనంత వరకు లోక కళ్యాణం కోసమే ఉపయోగించాలి.అలా కాకుండా కామ, క్రోధ , మద, మత్సర్యాలతో, అసూయతో, ఈర్ష్యాద్వేషాలతో ఇతరులపై చేయడం  మంచిది కాదు.

శక్తివంతమైన ఈ తాంత్రిక విద్యలను అభ్యసించడం వల్ల మనుషులు తాము ఎదుర్కొంటున్న శత్రువులు చేసిన అభిచార కర్మలను నిర్మూలించుకోగలరు. ప్రస్తుత కాలంలో తంత్ర విద్యలు సంపూర్ణంగా తెలిసినవారు అరుదు. తమకు అన్ని తెలుసని చెప్పుకుని మోసం చేసే వారే ఎక్కువ. కాబట్టి ఎవరిని నమ్మకూడదు.

తంత్ర విద్యలు చాలా కఠినమైనవి. వీటిని నేర్చుకోవడం కూడా కష్టమే. ఎంతో సాధన అవసరం. ప్రయోగించడం ఆంతకన్నా కష్టమే. విఫలమైన వారు ఎందరో ఉన్నారు. తేడా వస్తే ప్రాణాలకే ముప్పు. తాంత్రిక విద్యలు 64 ఉన్నాయి. వీటిని గురుముఖతః నేర్చుకోవాలి. ఉత్తరాదిలో తాంత్రిక పూజలు చేసేవాళ్ళు ఎక్కువగా కనిపిస్తారు.

నోట్ .. ఈ ఆర్టికల్ జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసమే మాత్రమే .. ఈ విద్యలు నేర్చుకోవడం శ్రేయస్కరం కాదు.  

 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!