ఇండియాలో కూడా మమ్మీలు ఉన్నాయా ? అంటే అవును అనే జవాబు చెప్పుకోవాలి. హిమాచల్ ప్రదేశ్ లోని స్పితి వ్యాలీ సమీపం లో గ్యూ గ్రామంలో సహజ సిద్ధమైన మమ్మీ ఉంది. ప్రత్యేకంగా ఒక మందిరం కట్టి ఆ మమ్మీని ప్రస్తుతం అక్కడ భద్రపరిచారు. 500 ఏళ్లు దాటినా ఆ మృత దేహం వెంట్రుకలు, గోర్లు పెరుగుతున్నాయి.
తేలుకాటు నుంచి ప్రజలను రక్షించేందుకు సంఘా తెంజింగ్ అనే భౌద్ధ సన్యాసి ప్రాణత్యాగం చేశారని గ్యూ గ్రామస్తులు చెబుతున్నారు. అప్పటినుంచి ప్రజలు తేళ్ల బారినపడకుండా ఉంటున్నారని అంటున్నారు. అక్కడి ప్రజలు దృష్టిలో ఆయనిపుడు దేవుడు. అందుకే ఆయన మృతదేహాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఆ మమ్మీని పరిశీలిస్తే ఆ సన్యాసి సజీవంగా ఉండి సాధనలో ఉన్నట్టు కనిపిస్తుంది.
తెంజింగ్ 565 ఏళ్లుగా తపస్సు చేస్తున్నారని కొందరి విశ్వాసం. 2002 లో అమెరికా,ఇంగ్లాండ్ కు చెందిన కొంత మంది శాస్త్రజ్ఞులు ఈ మమ్మీ ని సమూలంగా పరిశీలించారు. తర్వాత వారు ఈ మమ్మీ రసాయనాలు ఉపయోగించని తొలి మమ్మీ అని తేల్చి చెప్పారు. ఈ మృతదేహం లో సహజంగా జుట్టు గోర్లు ఉన్నాయని … దంతాలు .. దవడలను పరిశీలించి చూస్తే జీవించి ఉన్న మనిషి కున్న తీరులో ఉన్నాయని స్పష్టం చేశారు.
బాడీ లోని ఎముకలు కీళ్లు కూడా చెక్కుచెదరలేదని ఎక్సరే రిపోర్ట్ తెలియజేస్తుంది. అలాగే కణజాలాలు మృదువుగా ఉన్నాయట. దీన్ని బట్టి మమ్మీ సజీవంగా ఉందని అంటున్నారు. మమ్మీకి ఎక్కడైనా గాయమైతే రక్తం కూడా వస్తుందని చెబుతున్నారు. వారి మాటలను బట్టి చూస్తుంటే ఇదొక అద్భుతం అనిపిస్తుంది.
ముందెన్నడూ ఇలాంటివి కనీవినీ ఉండం. 1975 లో ఇక్కడ భూకంపం వచ్చి గ్రామం మొత్తం ద్వంసం అయింది. ఆ సందర్భంగా జరిగిన తవ్వకాలలో ఈ మమ్మీ ని కనుగొన్నారు. అపుడు ఈ మృత దేహం నుంచి రక్తస్రావం జరిగిందట. పర్యాటకులు వచ్చినప్పుడు గోర్లు , వెంట్రుకలు తీసుకెళుతున్న దృష్ట్యా ఈ మమ్మీని గాజు పెట్టె లో కొన్నాళ్ళు భద్రపరిచారు.
మమ్మీలకు ఈజిప్టు ప్రసిద్ధి. అక్కడ మృతదేహాలకు రసాయనాలు పూసి అవి పాడవకుండా పెట్టెలో దాచి ఉంచుతారు. అక్కడే ఈ సంస్కృతి ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ గ్యూ గ్రామంలో ఉన్న మమ్మీకి అలాంటి రసాయనాలు పూసినట్టు లేదు. అయినా భద్రంగా ఉండటం చిత్రమే. ఇలా సహజ సిద్ధంగా ఏర్పడిన మమ్మీలు ప్రపంచం మొత్తం మీద 30 వరకు ఉన్నాయని సమాచారం.
వీటిలో అధిక భాగం జపాన్ లోని ఈశాన్య హోన్సు అనే ద్వీపంలో ఉన్నాయని అంటారు. అక్కడ బౌద్ధ భిక్షువులు ఒక రకమైన మూలికలు .. ఆకులనే ఆహారంగా స్వీకరిస్తారట. ఫలితంగా మనిషి చనిపోయినా శరీరం దెబ్బతినకుండా మమ్మీలాగా తయారవుతుందట. ఈ అంశంపై పరిశోధనలు కూడా జరుగుతున్నాయని సమాచారం. హిమాచల్ ప్రదేశ్ చూసేందుకు వెళ్లిన వాళ్ళు ఈ మమ్మీని చూసి రావచ్చు.
ఇది కూడా చదవండి >>>>>>>>>>>>> ఎవరీ గోబెల్స్ ??