అర్బన్ నక్సల్ అనే పదం ఈ మధ్యకాలంలోనే వాడుకలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారికి పాలకులు పెట్టిన పేరు అది . తొలిసారి గా ఈ పదం భీమా కోరేగావ్ కేసులో వినబడింది. వరవరరావు ,అరుణ్ ఫెరీరా, వెర్నన్ గోన్యాల్ తదితరుల అరెస్ట్ తో మావోయిస్టుల అర్బన్ నెట్వర్క్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మావోయిస్టునేతలకు పౌరహక్కులనేతలు సహకరిస్తున్నారని ,వీరి ద్వారా విద్యార్థులను మావోయిస్టుల వైపు ఆకర్షిస్తున్నారని మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత దేశంలో చాలామంది పై ఈ తరహా కేసులు నమోదు అయ్యాయి. ఈ అరెస్టులపై నిరసనలు వ్యక్తమౌతూనే ఉన్నాయి. ప్రముఖులు కూడా ఇలాంటి నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడం విశేషం . ప్రభుత్వ వ్యతిరేకులను అర్బన్ నక్సల్ అంటే అనొచ్చు. కానీ ప్రభుత్వం లో… అందులో సీఎం గా ఉన్న కేజ్రీ వాల్ ను కూడా అర్బన్ నక్సల్ కేటగిరీలో కలపడం చిత్రమే. ప్రభుత్వాన్ని అడిగితే ఈ పదాలకు మాకు అర్ధమే తెలియదు అంటోంది.
కానీ నేతలు మాత్రం ముఖ్యం గా బీజేపీ నాయకులు ఈ పదాన్ని తరచుగా వాడుతున్నారు.
ʹసీఏఏను వ్యతిరేకిస్తూ నిర్వహిస్తున్న ర్యాలీలకు కాంగ్రెస్ సహా అర్బన్ నక్సల్స్ మద్దతు ఇస్తున్నారుʹʹ
– గత ఏడాది డిసెంబర్ 18న జార్ఖండ్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీ
ʹʹజమ్మూ కశ్మీర్‌లోని టెర్రరిస్టులకు అర్బన్ నక్సల్స్‌కు వ్యతిరేకంగా గట్టి చర్యలు ʹʹ
– గత ఏడాది నవంబర్ 16న కేంద్ర హోంమంత్రి అమిత్ షా
ʹʹఅర్బన్ నక్సల్‌కు అతి పెద్ద ఉదాహరణ అరవింద్ కేజ్రివాల్ ʹʹ
– ఢిల్లీ ఎన్నికల సభలో ఢిల్లీ బీజేపీ ఛీఫ్ మనోజ్ తివారి
పై ప్రకటనలు మూడు ముఖ్యమైన బీజీపీ నేతలవే. వివిధ సందర్భాల్లో వారు పేర్కొన్నవే.
వారికి నచ్చనివారిని ఆలా పిలుస్తుంటారు. వేదికలపైనుంచి విమర్శిస్తుంటారు. కాగా ఆ మధ్య ఆర్టీఐ ద్వారా వెళ్లిన ఒక ప్రశ్నకు అసలు అర్బన్ నక్సల్ అనే పదమే తమకు తెలీదని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ జవాబు ఇచ్చింది. ప్రముఖ పత్రిక ఇండియా టుడే అడిగింది కాబట్టి సమాధానం వెంటనే వచ్చింది . అలాగే ʹతుక్టే తుక్డే గ్యాంగ్ʹ అనే పదానికి అర్ధం తెలీదని , ఆ పదం తమ రికార్డుల్లో లేదని కేంద్ర హోమ్ శాఖ అధికారులు చెప్పారు.
అసలు అర్బన్ నక్సలైట్లు, తుక్డే తుక్డే గ్యాంగ్ అనేవే లేవని ప్రభుత్వమే స్పష్టంగా చెబుతుంటే ఆ ప్రభుత్వానికి నాయకత్వం వహించేవాళ్ళు మాత్రం రోజూ అర్బన్ నక్సలైట్లు, తుక్డే తుక్డే గ్యాంగ్ అని తమ ప్రసంగాలలో ఎందుకు మాట్లాడాతారో తెలీదు.
Gud attempt please write elaborately about urban naxalites n tukde tukde gangs n their relevance to d present scenario