అల్లూరయ్య స్వీట్స్ టేస్ట్ అదరహో !!

Sharing is Caring...

Quality and tasty food in Ongole………………

ఒంగోలు వాళ్ళు అల్లూరయ్య స్వీట్స్ గురించి గర్వంగా చెప్పుకుంటారు. ఆ స్వీట్స్ కూడా మధురంగా ఉంటాయి మరి. రెగ్యులర్ గా  ఇంట్లో వాడుకోవడానికి గాక బంధుమిత్రులకు కూడా ఈ స్వీట్స్ పంపుతుంటారు. పండగలకు, పబ్బాలకు ఇక చెప్పనక్కర్లేదు. ఈ స్వీట్ షాపు లో ప్రధానంగా మైసూరుపాక్ రుచి అద్భుతంగా ఉంటుంది.

శ్రేష్ఠమైన నెయ్యి వాడతారు వీటి తయారీలో.. నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా ఉంటాయి. ఏక్ దమ్మున ఎవరైనా అరకేజీ తిన్నా వెగటు వేయదు.ఈ రుచి మరెక్కడా రాదు. దొరకదు. రోజు 100 కేజీల మైసూరు పాక్ అమ్ముతారు. మధ్యాహ్నం లోగా సరుకు మొత్తం ఖాళీ అవుతుంది. ఒంగోలు కి దూరంగా ఉన్నవాళ్లు కూడా వీటిని తెప్పించుకుంటారు.

ఒక్క మైసూరు పాక్ మాత్రమే కాదు జీడిపప్పు మిఠాయి కూడా సూపర్ గా ఉంటుంది. వీటితో పాటు ఇతర స్వీట్స్ కూడా ఇక్కడ తయారు చేస్తారు. అయితే మైసూరు పాక్ కి డిమాండ్ ఎక్కువ. ఉదయాన్నే వెళితే కావాల్సినంత దొరుకుతుంది.ఇటీవల కాలంలో విదేశాలలో ఉన్న ఫుడ్ లవర్స్ కూడా వీటిని తెప్పించుకుంటున్నారు. నేతితో చేసే బూందీ కూడా రుచికరంగా ఉంటుంది.

దాదాపు 66 ఏళ్ళ క్రితం యేలేటి అల్లూరయ్య ఈ షాప్ ను  ట్రంక్ రోడ్లో ఒక చిన్న గదిలో ప్రారంభించారు. పదేళ్ల క్రితం బైపాస్ రోడ్ లో కూడా బ్రాంచ్ ను తెరిచారు. వేరే ఊర్లలో ఎక్కడా అల్లూరయ్య స్వీట్స్ కి శాఖలు లేవు. కేవలం మౌత్ పబ్లిసిటీ ద్వారానే ఈ షాప్ వ్యాపారం ఊపందుకుంది. ఈ పాపులారిటీ ని చూసి కొంతమంది  స్వీట్స్  వ్యాపారంలోకి వచ్చినప్పటికీ  రుచి విషయంలో అల్లూరయ్య ను చేరుకోలేకపోయారు.

ప్రస్తుతం అల్లూరయ్య స్వీట్స్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు.  ఫుడ్ లవర్స్ ఎపుడైనా ఒంగోలు వెళితే  అల్లూరయ్య స్వీట్స్ ను మిస్ కాకండి. ఒక్కసారి మీరు మైసూరు పాక్ రుచి చూస్తే ఇక వదలరు. మీరే అందరికి చెబుతారు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!