‘సముద్ర గర్భం’ లో 7 వేల ఏళ్ళనాటి రహదారి !

Sharing is Caring...

Great research………………….

మధ్యధరా సముద్రం దిగువన మట్టి నిక్షేపాల క్రింద  ఉన్న రహదారి బయట పడింది. క్రొయేషియా తీరానికి ఆవల ఉన్న ఆడ్రియాటిక్‌ సముద్రగర్భంలో శాస్త్రవేత్తలు కొన్నాళ్ల క్రితం అన్వేషణలు జరుపుతున్నప్పుడు ఆశ్చర్యకరంగా ఈ పురాతన రహదారి కనిపించింది.

మధ్యధరా సముద్రంలో  కోర్కులా ద్వీపం సమీపంలో మునిగిపోయిన క్రోయులా దీవిని అనుసంధానిస్తూ ఈ పురాతన రహదారిని నిర్మించి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.ఇది కొత్తరాతి యుగంలోని మంచుయుగం చివరి రోజులకు చెందినది కావచ్చని, కనీసం ఏడువేల ఏళ్ల కిందట దీనిని నిర్మించి ఉంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ  రహదారిని నాలుగు మీటర్ల వెడల్పు లో జాగ్రత్తగా పేర్చబడిన రాతి పలకలతో రూపొందించారు. సముద్ర గర్భానికి పదహారు అడుగుల లోతున దీనిని కనుగొన్నారు. జదార్‌ యూనివర్సిటీకి చెందిన ఆర్కియాలజిస్ట్‌ మేట్‌ పారికా నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం సముద్రంలో దాగి ఉన్న ఈ పురాతన రహదారిని కనుగొన్నది. 

అలాగే ఈ రహదారిపై రాతి గొడ్డళ్లు, పలుగులను,తిరుగలి రాళ్ల శకలాలు దొరికాయి. వాటిని కార్బన్‌ డేటింగ్‌ ద్వారా పరీక్షించి, ఇవి క్రీస్తుపూర్వం 4,900 నాటివని శాస్త్రవేత్తలు తేల్చారు. రాతి గొడ్డళ్లను ఉపయోగించి జంతు బలులు ఇచ్చిన ఆనవాళ్లు కూడా ఇక్కడ లభించాయి.

ఈ రహదారి నియోలిథిక్ స్థావరంలో భాగం, ఇక్కడ 5000 BCE ప్రాంతంలో హ్వార్ సంస్కృతి కి చెందిన ప్రజలు నివసించారని అంటున్నారు. అక్కడి ప్రజలలో నైపుణ్యం కలిగిన రైతులు, పశువుల కాపరులు ఉన్నారని చెబుతున్నారు. పరిసర ప్రాంతాల్లో ప్రజలు వ్యవసాయం చేసిన జాడలున్నాయని కనుగొన్నారు.పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయి. ముందు ముందు మరిన్ని విశేషాలు వెలుగు చూడవచ్చు. 

 

 

 

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!