లేజర్ ఆయుధాలు ప్రయోగిస్తున్న రష్యా !

Sharing is Caring...

Laser Weapons………………………………………….. 

ఉక్రెయిన్ పై రష్యా దాడులు మొదలై మూడు నెలలు అవుతున్నా.. ఇప్పటివరకూ రష్యా పూర్తి స్థాయిలో పైచేయి సాధించలేకపోయింది.  ఈ రెండు దేశాలు కాకుండా వేరే ఏ దేశమూ యుద్ధంలో ప్రత్యక్షంగా కాలు పెట్టలేదు. నాటో దేశాలు తెరవెనుక నుంచి ఉక్రెయిన్ కి సహాయం అందిస్తున్నాయి. ఇది బహిరంగ రహస్యమే.  

రష్యా మూడు రోజుల క్రితం కొత్త తరం శక్తివంతమైన లేజర్ ఆయుధాలను ప్రయోగించడం మొదలు పెట్టింది. ఈ లేజర్ ఆయుధం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు డ్రోన్లను 5 సెకన్లలో అగ్నికి ఆహుతి చేస్తుంది. ఈ కొత్త లేజర్  ఆయుధాల  ప్రత్యేకతల గురించి ప్రపంచానికి చాలా తక్కువగా తెలియడంతో రష్యా శత్రు దేశాల్లో గుబులు పుడుతోంది.

2018లో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దీన్ని ఆవిష్కరించారు. దీనితో పాటు ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి, నీటి అడుగున పనిచేయగల న్యూక్లియర్ డ్రోన్‌లు, సూపర్‌సోనిక్ ఆయుధాలను ఆవిష్కరించారు.ఈ ఆయుధం అంతరిక్షంలో 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు ఉపగ్రహాన్ని నిర్వీర్యం చేస్తుంది. ఇది భూమికి 1,500 కి.మీ ఎత్తులో ఉన్న ఏ ఉపగ్రహాన్ని అయినా నిర్వీర్యం చేసి .. డ్రోన్లను  సెకన్లలో నాశనం చేస్తుంది. 

అణ్వాయుధాలనుమోసుకెళ్లే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను పర్యవేక్షించడానికి ఉపగ్రహాలు ఉపయోగిస్తున్నందున రష్యా ఈ లేజర్ ఆయుధాన్ని ప్రయోగిస్తున్నది. ఈ కొత్త లేజర్ ఆయుధంతో దేన్నైనా  టార్గెట్ చేయవచ్చు. ఈ లేజర్ ఆయుధాన్ని టెస్ట్ చేశామని, ఈ ఆయుధాన్ని రష్యా మిసైల్ ఆర్మీకి సరఫరా చేసినట్లు ఆ మధ్య డిప్యూటీ ప్రధాని యూరీ బోరిసోవ్ ప్రకటించారు. 

ఈ ఆయుధం 1500 కి.మీ దూరంలో ఉన్న ఏ ఉపగ్రహ నిఘా సామర్థ్యాన్నైనా క్షణంలో నిలిపివేసే శక్తిని కలిగి ఉందని రష్యా అంటోంది. ఒక ఉపగ్రహం రష్యా పై  నిఘా పెట్టిందని తెలిస్తే లేదా గూఢచర్యం చేస్తున్నట్లయితే, ఈ లేజర్ ఆయుధంతో ఆ ఉపగ్రహం భూమి వైపు చూడకుండా రష్యా దాన్నిసర్వ నాశనం చేస్తుంది.

ఈ లేజర్ నుండి వెలువడే రేడియేషన్ ఆ ఉపగ్రహాన్ని నిర్వీర్యం చేస్తుంది.  భవిష్యత్తులో తమ శాస్త్రవేత్తలు అవసరాన్ని బట్టి ఈ లేజర్ ఆయుధం సామర్థ్యాన్ని మరింత పెంచుతారని, దీని వల్ల చాలా నష్టం వాటిల్లుతుందని బోరిసోవ్ అంటున్నారు. 

ప్రస్తుతం రష్యా చేసిన ఈ ప్రకటన అమెరికాకు గుబులు పుట్టిస్తోంది. ఎందుకంటే, అంతరిక్షంలో అమెరికాకు చెందిన అనేక ఉపగ్రహాలు ఉన్నాయి. ఇది భూమిపై జరిగే అన్ని కార్యకలాపాలపై నిఘా ఉంచుతుంది.ఈ లేజర్ ను ఎదుర్కోవడమెలా అని అమెరికా శాస్త్రజ్ఞులు ఆలోచిస్తున్నారు. 

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!