ఆస్కార్ లో సత్తా చాటే సినిమాలేమిటో ?

Sharing is Caring...

ఆస్కార్ వేడుకలకు రంగం సిద్ధమైంది. ఎన్నో సినిమాలతో పోటీ పడి పది సినిమాలు నిలిచాయి. వీటిలో ది బెస్ట్ ఏదో అవుతుందో చూడాలి. వాటిలో రెండు సినిమాల గురించి తెలుసుకుందాం.
వరస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్ … ఈ సినిమా ఓ  విభిన్నమైన డార్క్ రొమాంటిక్ కామెడీ డ్రామా.  డైరెక్టర్ చిమ్ ట్రైయర్ తెరకెక్కించారు. ఓస్లోలో లోని జూలీ అనే వైద్య విద్యార్థిని జీవిత కథగా సినిమా సాగుతుంది. జూలీకి 30ఏళ్లు వచ్చినా జీవితంపై స్పష్టత ఏర్పడదు.

ప్రేమ విషయంలోనూ కన్ఫ్యూజ్  అవుతుంటుంది. ఈ క్రమంలోనే జూలీ ముగ్గురు అబ్బాయిలను ప్రేమిస్తుంది. అయితే ఆ కుర్రోళ్ళు జీవితంలోకి ప్రవేశించాక ఆమెకు   లైఫ్ పై  ఓ స్పష్టమైన దృక్పథం ఏర్పడుతుంది. మరి ఆ తర్వాత జరుగుతుంది ? ప్రపంచంలో తన స్థానాన్ని వెతుక్కుంటూ ఆమె చేసిన ప్రయాణం ఏ దిశగా సాగింది ? తన గురించి తాను ఏం తెలుసుకుంది? అన్నది మిగతా కథాంశం.

ఈ సినిమా ఆస్కార్ రేసులో ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగాల్లో నామినేషన్లు దక్కించుకుంది.ఫిబ్రవరి 4 న ఈ సినిమా విడుదలయింది. స్క్రిప్ట్ చాలా సహజంగా ఉందని టాక్. జూలీ పాత్రలో రెనేట్ రీన్స్వే బాగా నటించినదని విమర్శకుల అభిప్రాయం.  సినిమా ఆసాంతం ఆకట్టుకునే ఉంటుందని రివ్యూలు వచ్చాయి.  

లూనానా : ఎ యాక్ ఇన్ ద క్లాస్ రూమ్ ….. ఓ ఆసక్తికరమైన క్లాస్ రూమ్ డ్రామా కథాంశంతో రూపొందిన చిత్రమే ‘లూనానా’. పావో బేయ్నింగ్ దోర్జీ తెరకెక్కించారు. ఆస్ట్రేలియా కి  వెళ్లాలి.. మంచి గాయకుడిగా పేరు తెచ్చుకోవాలి అని కలలు కనే కుర్రాడు ఉగ్యెన్. తన అమ్మమ్మ కోరిక మేరకు ఇష్టం లేకున్నా ఉపాధ్యాయ వృత్తిలోకి  చేరతాడు.  

ఈ క్రమంలోనే తన చివరి ఏడాది శిక్షణా కాలంలో భాగంగా లూనానా గ్రామంలోని స్కూల్ లో బోధించడానికి వెళ్తాడు. అది మారుమూల కొండ ప్రాంతం. కరెంటు, నెట్ వంటి సదుపాయాల ఊసే కనిపించదు. అక్కడి పరిస్థితులు చూసి ఉగ్యెన్ భయపడతాడు.. ఆఊరి వదిలేసి వెళ్లాలనుకుంటాడు.  కానీ ఆ గ్రామ ప్రజలు, అక్కడి పిల్లలు తనపై చూపిస్తున్న అభిమానాన్ని.. తనపై పెట్టుకున్న నమ్మకాన్నిచూసి కదలలేక పోతాడు.

మరి ఆ తర్వాత ఏమి జరిగింది ? ఆ ఊరి పిల్లల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అతగాడు ఏమి చేశాడు? గాయకుడు అవ్వాలన్న కల నెరవేరిందా? లేదా? అన్నది మిగతా కథ. ఈ సినిమా ప్రధానంగా గ్రామీణ, పట్టణ జీవితాలకు మధ్య ఉన్న వ్యత్యాసాలను చూపిస్తుంది.  నిజమైన ఆనందం ఏమిటి అనే అంశాన్ని ..  స్పృశిస్తూ సాగుతుంది. భూటాన్ నుంచి ఆస్కార్‌కు నామినేట్ అయిన తొలి చిత్రమిది. 

ఇంకా ఇలాంటి సినిమాలను ఇవాళ సాయంకాలం 5గంటలకు మొదలయ్యే ఆస్కార్‌ చిత్రోత్సవ వేడుకల్లో ప్రదర్శిస్తారు. ఇండియాలో మాత్రం 28 తెల్లవారుజామున 5 గంటల నుంచి లైవ్ ప్రసారం ఉంటుంది. ఈ ప్రతిష్ఠాత్మక వేడుక కోసం లాస్‌ఏంజెలిస్‌లోని డాల్బీ థియేటర్‌ను రెడీ చేశారు. ఈసారి ఆస్కార్‌ను గెలుచుకునే చిత్రమేదో అన్న విషయం ఆసక్తి రేకెత్తిస్తోంది.

94వ ఆస్కార్‌ అవార్డుల రేసులో ఉత్తమ చిత్రం విభాగంలో మొత్తం పది సినిమాలకు ఫైనల్ జాబితాలో చోటు దక్కింది. పవర్‌ ఆఫ్‌ ది డాగ్‌ , కొడా సినిమాల మధ్యనే ప్రధాన పోటీ అంటున్నారు.  ఇక ఆస్కార్ అవార్డుకు రెండు భారతీయ చిత్రాలు నామినేట్ అయ్యాయి. అందులో ఒకటి తమిళ హీరో సూర్య నటించిన జై భీమ్ సినిమా కాగా, మరొకటి మోహన్ లాల్ నటించిన మరక్కార్ సినిమా. ఈ రెండు సినిమాలు కూడా సౌత్ ఇండస్ట్రీకీ చెందిన సినిమాలు కావడం విశేషం. ఆస్కార్ రేసులో మొత్తం 276 సినిమాలు షార్ట్ లిస్ట్ అయ్యాయి.

Sharing is Caring...
Support Tharjani

One Response

  1. Apparao Dora March 28, 2022
error: Content is protected !!