పవర్ స్టార్ ది మెగాస్టార్ రూటే నా ?

Sharing is Caring...

Bharadwaja Rangavajhala ……………………………..

వకీల్ సాబ్ తో తన స్టామినా స్ట్రాంగే అని ప్రూవ్ చేసేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ … వరుసగా సినిమాలు కమిట్ అవడం మొదలుపెట్టాడు.2023 మార్చి లోపు కనీసం రెండు సినిమాలైనా రిలీజుకు పెట్టేయాలనుకున్నాడు. ఈ ప్రాసెస్ లోనే భీమ్లా నాయక్ తెరకెక్కించారు. దాని తర్వాత క్రిష్ మూవీ హరిహరవీరమల్లు పట్టాలెక్కాలి … ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ యాక్టివిటీ అంతా కంప్లీట్ అయిపోయిందనే వార్తలు కూడా వచ్చాయి.

భీమ్లా నాయక్ కంప్లీట్ అయినా … పవన్ హరిహర వీరమల్లు పాత్రలోకి ప్రవేశించడం లేదు. కారణం ఏమిటి అని వాకబు చేయగా కొండపొలం అని తెలుస్తోంది. నిజానికి కథానాయకుడు మహానాయకుడు సినిమాల దెబ్బ తర్వాత క్రిష్ కోలుకుని చేసిన సినిమా కొండపొలం. కొండపొలం కన్నా ముందే పవన్ మూవీ కమిట్మెంట్ జరిగింది.అప్పటికి భీమ్లానాయక్ సెట్స్ మీదుండడంతో దీన్ని దాని తర్వాత అన్నారు. ఆ గ్యాప్ లో తనను తాను ప్రూవ్ చేసుకోడానికి అన్నట్టు కొండపొలం ఎటెమ్ట్ చేశాడు క్రిష్.

నెగెటివ్ టాక్ రావడంతో కొండపొలం ఆడలేదు. పోయింది పోతూ పవన్ మూవీ అవకాశాన్ని కూడా లాక్కుపోయిందనేది ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తున్నమాట. అయితే డైరెక్టర్ సన్నిహితులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ హరిహర విరమల్లు ఉంటుందనే అంటున్నారు.పవన్ చేయను అని కన్ఫర్మ్ గా చెప్పలేదు అంటున్నారు. అయితే క్రిష్ ను బైపాస్ చేసి సముద్రఖని తో సినిమా చేయడానికి పవన్ ఇంట్రస్ట్ చూపిస్తున్నారనే మాట కూడా బలంగానే వినిపిస్తోంది.

పవన్ తో సినిమా చేయాలనుకున్న వారెవరికీ ఆయన నో చెప్పడం లేదు. కానీ కన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. గత ఎన్నికలప్పుడు పవన్ సినిమా కెరీర్ ఆల్మోస్ట్ ఎండ్ కు వచ్చేసిందనే అనుకున్నారంతా … తీరా ఆయన పార్టీకి ఒక్కసీటు మాత్రమే రావడం అది కూడా వైసీపీ వైపు వెళ్లిపోవడంతో కాస్త డైలమాలో పడ్డ పవన్ రాజకీయాలకు కొంత గ్యాప్ ఇచ్చి సినిమాలవైపు టర్నింగ్ ఇచ్చుకుని అందర్నీఆశ్చర్యపరచారు.

అలా వకీల్ సాబ్ తెరకెక్కి సక్సస్ అయ్యింది.ఆ వెంటనే భీమ్లానాయక్ స్టోరీ లైన్ కు ఓకే అన్నాడు. కష్టకాలంలో గబ్బర్ సింగ్ లాంటి అద్దిరిపోయే హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ కు కూడా ఓ సినిమా చేస్తానని హామీ ఇచ్చాడు వపన్ కళ్యాణ్. అలాగే ఒకప్పుడు ఖుషీ మూవీతో తన ఇమేజ్ ను ఎక్కడికో తీసుకుపోయిన రత్నం కూ బాస చేశాడు.కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే … క్రిష్ తో పాటు వీళ్లందరినీ బైపాస్ లో పెట్టేసి తమళ డైరెక్టర్ తో ట్రావెల్ అవడానికే పవన్ నిర్ణయించుకున్నాడనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి.

పవన్ మూవీ మీద గంపెడు ఆశలు పెట్టుకున్న క్రిష్ ఇప్పుడు పవన్ ఇలా చేస్తాడనుకోలేదు అని సన్నిహితుల దగ్గర వాపోతున్నట్టు టాక్ . సినిమా లేదనే మాట మాత్రం ఓపెన్ గా ఎవరూ అనడం లేదు. అలాగే హరీష్ శంకర్ సినిమా కూడా ఉందనే చెప్తున్నారు. 

ఇదంతా చూస్తుంటే … ఒకప్పుడు చిరంజీవి విజయబాపినీడు కథ గుర్తొస్తోంది అంటున్నారు సీనియర్లు. చిరంజీవికి మగమహారాజు, మగధీరుడు , గ్యాంగ్ లీడర్ లాంటి అద్దిరిపోయే హిట్స్ ఇచ్చిన విజయబాపినీడు బిగ్ బాస్ లాంటి ఒక్క ఫ్లాప్ ఇవ్వగానే ఆయన్ని తన మనసులోంచీ తుడిచేశారు మెగాస్టార్. అయితే లౌక్యంగా వ్యవహరించే చిరంజీవి ఆ మాట ఎన్నడూ బైటకు అనలేదు.

చిరంజీవి ప్రతి పుట్టిన రోజుకీ విజయబాపినీడు వెళ్లి చిరంజీవిని కల్సి విషెస్ చెప్పడం .. ఈ ఏడాది మనం సినిమా చేస్తున్నాం … మంచి స్క్రిప్టుతో రండి అని ఆయన చెప్పడం … ఈయన నాలుగైదు కథలు రడీ చేసుకుని వెళ్లడం అవి వాయిదా పడడం ఇలా జరిగింది తప్ప … బిగ్ బాస్ తర్వాత తిరిగి బాపినీడుతో సినిమా చేయలేదు బిగ్ బాస్.

ఒక దశలో దర్శకుడు విఎన్ ఆదిత్య డైరెక్షన్ లో మెగాస్టార్ మూవీ అని బాపినీడు అనౌన్స్ చేశారుగానీ మెగాస్టార్ పచ్చజండా ఊపలేదు.అదీ కొంత కాలం నాని ఆగిపోయింది.నిజానికి ఈ అనుభవం ఆదిత్యకు కొత్తేం కాదు … అంజనా ప్రొడక్షన్స్ లో వచ్చిన ఏకైక హిట్టు బావగారూ బావున్నారాకి ఎక్కువ శ్రమ పడింది ఆదిత్యే. ఆ టైటిల్ పెట్టింది కూడా తనే. ఆ టైమ్ లో ఆదిత్య మీద ప్రేమ పుట్టుకొచ్చిన మెగాస్టార్ మంచి స్క్రిప్టు తెచ్చుకో సినిమా చేస్తున్నాం అనడంతో ఆదిత్య కష్టపడి ఓ లైన్ రాసుకొచ్చి మెగాస్టార్ కు చెప్పాడు.

ఆయన ఓకే చేశాడు.అది కూడా అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ లోనే అనుకున్నారు . ముహూర్తం కూడా జరిగింది. ఈ లోగా ఆదిత్యకు బాస్ అనే ఫ్లాప్ రాడంతో ఈ ముహూర్తం ఫొటోలకే పరిమితం అయిపోయింది.దాదాపు పవన్ కూడా ప్రస్తుతం ఎఎమ్ రత్నం , క్రిష్ లతో అలాగే వ్యవహరిస్తున్నాడనేది ఇండస్ట్రీ సీనియర్లు అంటున్నమాట … నాకైతే తెలియదు …

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!