బాపూ.. నీ పాదాలేవీ!

Sharing is Caring...

Taadi Prakash……………………………….. 

MOHAN’s encounter with artist Bapu

విజయవాడ, విశాలాంధ్ర ఆఫీసు.బాస్ ఒక చేతిలో ఫోనూ, మరో చేతిలో టైటిల్ డిజైనూ పట్టుకుని తాపీగా మాటాడుతున్నాడు. ఎదురుగా నేను టైటిల్ తీసుకుని చూశా.తెన్నేటి సూరి ‘చంఘిజ్ ఖాన్’ కి బాపూ వేసిన బొమ్మ. ఉరుకుతున్న గుర్రం మీద వీరావేశంతో చంఘిజ్ ఖాన్ మంగోలియన్ కళ్ళూ, మీసాలూ, వెనక మంగోలియన్ డిజైన్. కళ్ళు తిరిగే రంగులు. మబ్బుల్లోకి ఎగిరిపోయే గుర్రం వెన్నుమీంచి తోకవరకూ సర్రున దూసిన గీత.

బాస్ జోషి గారు మాట్లాడుతున్నారు. “బొమ్మ బానే ఉంది. రంగులు కూడా ఓకే-కానీ మంగోలియన్ ఎట్మాస్ఫియర్ రాలేదు. తెన్నేటి సూరి స్పిరిట్ కావాలి. అదే లేదిందులో” ఇంకా ఏదో మాట్లాడి ఫోన్ పెట్టేశాడాయన. ఎవరితో మాట్లాడారంటే … బాపూ అన్నారు. నాకళ్లు మెరిశాయి. ఏమన్నాడాయన? అంటే మంగోలియన్ మోటిఫ్స్ ఉన్న ఆల్బమ్ లు పంపిస్తే మరో బొమ్మ గీసిస్తానని చెప్పాడట.

ఈ బొమ్మకేం తక్కువా? కన్ను వంకరా, కాలు వంకరా? అని నేను వాదించా. బాపూ రెండోసారి కాదంటే మూడోసారి గూడా వేసిస్తాడు. నీకేమిట్రా నెప్పి మధ్యలో అని జోషీగారు నవ్వేరు. బెంగపడిపోయాను.
ఎంత అందమైన బొమ్మ. బాపు బెజవాడ హోటల్ నుంచే ఫోన్ చేశారని జోషీ చెప్పారు. ఇదంతా పన్నెండూ, పదమూడేళ్ళ క్రితమేమో. ముత్యాలముగ్గుకు ముందో వెనకో మరి. బాపూని ఇంటర్వ్యూ చెయ్యాలి. నేనో డైలీ పేపర్ సబ్బెడిటర్ని.

నా పక్కన బుల్లి మంత్లీ ‘యువజన’ఎడిటర్. ఇంటర్వ్యూలో తుచ్ఛమైన సినిమాల గురించి మాట్లాడ కూడదన్నాను. బాపూ అంటే నిన్నా నేడూ రేపూ బొమ్మలేననీ లెక్చర్ దంచాను. హరి వంశము నుండి చక్రభ్రమణం, సెక్రటరీ వరకూ వేసిన ఇలస్ట్రేషన్ల ఆరాతీయాలి. చందమామలో గలివర్ ట్రావెల్స్ కి విదేశీ బొమ్మలూ, గంగావతరణం పద్యాలకి శివుడి నిలువెత్తు బొమ్మా బొత్తిగా తేడాగా ఎందుకున్నాయో కూపీ లాగాలి.

గాలిబ్ గీతాల్లో క్రోక్విల్ గీతకీ, కార్ట్యూన్ కారికేచర్ లో బ్రష్ స్ట్రోక్ కీ మధ్య ఉన్న అక్రమ సంబంధం రహస్యాన్ని ఈ బాపూతో కక్కించాలి. ఈ విధంగా ద ఎలెవెన్ కాజెస్ ఫర్ ది బర్త్… రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ది టెల్గూ కార్టూన్ అండ్ ఇలస్ట్రేషన్ అనే పరిశీలనాత్మక కమ్ పరిశోధనాత్మక క్రిటిక్ రాయగలం అని చెప్పాను. నీ బుర్రే బుర్ర అన్నాడు పక్కనున్న బుజ్జాయి. అది సూరేకారం అని చెప్పాను. అప్పటికే నా లెక్చర్ లోని జ్ఞాన భారంతో వాడి కళ్లు అరమోడ్పులవుతున్నాయి.

నవోదయ రామ్మోహనరావుగారు హోటల్ గదిలోకి దారి చూపించారు. బాపూ లక్షణంగా తెల్ల డ్రస్ లో నల్ల పైప్ కాలుస్తున్నారు. మా మంత్లీ మాగజైన్ చూపించాం. మేము ఫలానా జర్నలిస్టులు హై అని చెప్పాం. కానీ నేను మీ అభిమానిగారు అని చెప్పలేదు. కనీసం నేను కూడా చిత్రకారుడు గారు అనైనా చెప్పలేదు. ఆయన మొహం చూసి ఓరి వెర్రివాడులారా అనేసుకున్నా.

ఆ మాటకొస్తే అంతలేసి బొమ్మలు గీసే మనిషిలా కనిపించనేలేదు. వాటి ఘోస్ట్ పెన్ మేన్ లాగా ఉన్నాడు. మహానుభావులైనట్టి మా హృదయాలని మీ బొమ్మలు చూరగొన్నాయన్నట్టు చెప్పాను.ఏదో లెండి తెలీక చేశానన్నట్టు ఆయన నసిగాడు. ఏది అడిగినా ఔనౌనూ, అంతే మరి అంటూ ముందుకు ముందే ఏకీభవించేస్తున్నాడాయన.  

Pl.Read it also  …………………………… బాపూ.. నీ పాదాలేవీ!

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!