వాణిజ్య బంధం బలపడిందా ?

Sharing is Caring...

Increase in trade ties …………….

భారత్ – చైనా దేశాల సరిహద్దుల్లో అపుడపుడు ఉద్రిక్తతలు నెలకొంటున్నప్పటికీ  ద్వైపాక్షిక వాణిజ్యంలో మాత్రం పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. 2014లో PM మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రెండు దేశాల మధ్య వాణిజ్యం $71.66 బిలియన్‌లు మాత్రమే.

2023-24 నాటికీ ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయిలో US$136.2 బిలియన్లకు చేరుకుంది. దీనిని బట్టి యునైటెడ్ స్టేట్స్ తో పోలిస్తే  చైనా యే భారత్ కు అతిపెద్ద వాణిజ్య  భాగస్వామిగా మారిందనుకోవాలి. చైనాకు భారతీయ ఎగుమతులు 6 శాతం పెరిగాయి..

ఫార్మాస్యూటికల్స్, మ్యానుఫ్యాక్చరింగ్‌తో సహా వివిధ రంగాలలో భారతీయ కంపెనీలు చైనాలో కార్యకలాపాలను చేపట్టాయి. అలాగే 100 కంటే ఎక్కువ చైనీస్ కంపెనీలు భారతదేశంలో చురుకుగా పనిచేస్తున్నాయి. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, ఎలక్ట్రానిక్స్‌లో ఈ పరస్పర పెట్టుబడి ధోరణి పెరిగింది.  

మెషినరీ, కెమికల్స్‌లో పారిశ్రామిక వస్తువులకు చైనా ముఖ్యమైన సరఫరాదారుగా ఉంది. ఎలక్ట్రిక్ వెహికల్ ,టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాలలో చైనా సాంకేతికత,పెట్టుబడులకు పెరుగుతున్న డిమాండ్ రెండు దేశాల మధ్య లోతైన ఆర్థిక సంబంధాలను సూచిస్తున్నాయి.

అదే సమయంలో కీలక పరిశ్రమలలో కొత్త జాయింట్ వెంచర్ల ద్వారా స్థానిక తయారీ యూనిట్లను స్థాపించడానికి, చైనా కంపెనీలను ఆకర్షించడానికి భారతదేశం చురుకుగా ప్రయత్నిస్తోంది.ఐక్యరాజ్యసమితి COMTRADE డేటాబేస్ ప్రకారం 2023లో చైనాకు ఇండియా ప్రధాన ఎగుమతులు US$16.25 బిలియన్లుగా ఉన్నాయి. సేంద్రీయ రసాయనాలు, ఖనిజ ఇంధనాలు, ఖనిజాలు, పత్తి,రాగి వంటి కీలక రంగాల నుంచి ఈ ఎగుమతులు జరిగాయి.

చైనా నుండి భారత్  చేసుకున్న దిగుమతుల విలువ US$16.25 బిలియన్లు. దిగుమతుల్లో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ పరికరాలు ఎక్కువగా ఉన్నాయి. తరువాత యంత్రాలు,అణు రియాక్టర్లు ఉన్నాయి. సేంద్రీయ రసాయనాలు, ప్లాస్టిక్‌, ఆప్టికల్, ఫోటో, టెక్నికల్, మెడికల్ ఉపకరణాలు కూడా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే ఇండియా పారిశ్రామిక ఎదుగుదలలో చైనా ముడి వస్తువులు కీలక పాత్రను పోషిస్తున్నాయని చెప్పుకోవాలి.

ఇక చైనా నుండి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) లో హెచ్చు తగ్గులు ఉన్నాయి. ఈ తరహా పెట్టుబడులపై భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొంత ప్రభావం చూపుతున్నాయి. సవాళ్లు ఎలా ఉన్నప్పటికీ రెండు దేశాల మధ్య సంబంధాలను స్థిరీకరించడానికి, సహకారాన్నిపెంపొందించడానికి ఈ పెట్టుబడులు దోహదపడతాయి.

2023లో చైనా నుండి ప్రత్యక్ష పెట్టుబడుల మొత్తం విలువ 3.2 బిలియన్ యుఎస్ డాలర్లు మాత్రమే. ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే తగ్గింది.  2022 లో దాదాపు 3.5 బిలియన్ యుఎస్ డాలర్లు గా నమోదు అయింది. 

భారత్ లో సినోస్టీల్, షౌగాంగ్ ఇంటర్నేషనల్, బావోషన్ ఐరన్ & స్టీల్ లిమిటెడ్, సానీ హెవీ ఇండస్ట్రీ లిమిటెడ్, చాంగ్‌కింగ్ లిఫాన్ ఇండస్ట్రీ లిమిటెడ్, చైనా డాంగ్‌ఫాంగ్ ఇంటర్నేషనల్, సినో హైడ్రో కార్పొరేషన్ వంటి కంపెనీలు పనిచేస్తున్నాయి. అనేక చైనీస్ ఎలక్ట్రానిక్, ఐటి,  హార్డ్‌వేర్ తయారీ కంపెనీలు కూడా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.

వీటిలో Huawei Technologies, ZTE, TCL, Haier మొదలైనవి ఉన్నాయి. విద్యుత్ రంగంలో EPC ప్రాజెక్ట్‌లలో పెద్ద సంఖ్యలో చైనీస్ కంపెనీలు పాల్గొంటున్నాయి. వీటిలో షాంఘై ఎలక్ట్రిక్, హార్బిన్ ఎలక్ట్రిక్, డాంగ్‌ఫాంగ్ ఎలక్ట్రిక్, షెన్యాంగ్ ఎలక్ట్రిక్ మొదలైనవి ఉన్నాయి. ఇటీవలి కాలంలో చైనీస్ మొబైల్ కంపెనీలు భారతదేశంలో అద్భుతమైన వృద్ధిని సాధించాయి, Xiaomi, Huawei, vivo , Oppo వంటి కంపెనీలు భారతీయ మొబైల్ హ్యాండ్‌సెట్ మార్కెట్‌లో 80 శాతం వాటా ను సొంతం చేసుకున్నాయి. 

ఇక చైనాలో పనిచేస్తున్న మన కంపెనీలు కూడా చాలానే ఉన్నాయి..చైనా ఆర్థిక కేంద్రం అయిన షాంఘైలో భారతీయ కంపెనీలు ఉన్నాయి. కొన్ని భారతీయ కంపెనీలు రాజధాని నగరం బీజింగ్‌లో కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాయి.

చైనాలోని కొన్ని ప్రముఖ భారతీయ కంపెనీలలో డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, అరబిందో ఫార్మా, మ్యాట్రిక్స్ ఫార్మా, NIIT, భారత్ ఫోర్జ్, ఇన్ఫోసిస్, TCS, APTECH, విప్రో, మహీంద్రా సత్యం, డాక్టర్ రెడ్డీస్, ఎస్సెల్ ప్యాకేజింగ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, సుందరం ఫాస్టెనర్స్, మహీంద్రమ్ ఫాస్టెనర్స్ ఉన్నాయి. & మహీంద్రా, టాటా సన్స్, బినాని సిమెంట్ వంటి కంపెనీలున్నాయి. మరికొన్ని కంపెనీలు జాయింట్ వెంచర్స్ లో భాగం గా పనిచేస్తున్నాయి.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!