తమిళనాట అప్పట్లో కరుణానిధి ధరించిన నల్ల కళ్లద్దాలకు ఎంతో క్రేజ్ ఉండేది. ఈ స్టైల్‌ను చాలా మంది ఫాలో అయ్యేవారు. తమిళనాడు రాష్ట్రానికి ఐదు సార్లు సీఎంగా బాధ్యతలు నిర్వహించిన కరుణానిధి … ఇంటా బయటా అదే స్టైల్‌లో కనిపించేవారు. ఇంతకూ ఆ కళ్లద్దాల వెనక ఉన్న మర్మమేంటో చాలాకాలం వరకు ఎవరికి తెలీదు.
ఒకసారి దీనిపై డీఎంకే సీనియర్ నేత ఇలంగోవన్ వివరణ ఇచ్చారు. 1960లలో కరుణానిధికి ప్రమాదం జరిగిందట .. ఆ ప్రమాదంలో ఆయన ఎడమ కన్నుకి గాయమైందట. డాక్టర్ల సూచన మేరకు అప్పటి నుంచి ఆయన నల్ల కళ్లద్దాలను ఉపయోగిస్తున్నారు. ఆ నల్లకళ్లద్దాలే అయన కు కొత్త ఇమేజ్ ను తెచ్చిపెట్టాయి. ఆయన డిఫెరెంట్ లుక్ లో కనిపించేవారు.
దాదాపు అలా 46 ఏళ్ల పాటు నల్లకళ్లద్దాలను ధరించిన ఆయన .. కొన్నాళ్ళు వాటిని పక్కన బెట్టి చివరి రోజుల్లో వైట్ గాగుల్స్ ను ధరించారు. ఆ అద్దాలను ప్రత్యేకంగా జర్మనీ నుంచి తెప్పించారట.అవి కూడా విజయ కంటి ఆసుపత్రి డాక్టర్ల సలహామేరకు తెప్పించారట. తమాషా ఏమిటంటే కరుణానిధి ప్రాణ స్నేహితుడైన ఎంజీఆర్ కూడా నల్ల కళ్ళద్దాలనే వాడేవారు. అలా ఆ ఇద్దరు నల్ల కళ్ళద్దాలకు బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చారు.
కాగా కరుణానిధికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఆయనెప్పుడూ పసుపురంగు శాలువానే ధరించేవారు. దీని వెనుక కూడా ఒక కథ ఉంది. రంగుల్లో పసుపు రంగుకి ఒక ప్రత్యేకత ఉంది. చూడగానే కంటిని ఆకర్షించే రంగుల్లో పసుపు దే ప్రథమస్థానం. ఎంత మంది లో ఉన్నా.. ఎక్కడ ఉన్నా..సులభంగా గుర్తు పట్టొచ్చు.
అందుకే కరుణానిధి పసుపు రంగు శాలువా ధరిస్తారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఆయన తన నల్లకళ్లద్దాలను పక్కన పెట్టినప్పటికీ చివరి వరకు పసుపు శాలువాను మాత్రం వదల్లేదు.అదే సెంటిమెంట్ కావచ్చుఅంటారు. అది కరుణ ప్రత్యేకత.
————KNM
చక్కగా నిష్పక్షపాతంగా వార్తలందిస్తున్నారు,అభినందనలు మీకు