నేపాల్ టూర్ వెళ్ళాలనుకుంటున్నారా ? ఈ ప్యాకేజి మీకోసమే!

Sharing is Caring...

IRCTC Attractive package…………….

IRCTC “Royal Nepal Ex – Hyderabad”టూర్ ప్యాకేజీ తో ముందుకొచ్చింది. తక్కువ ఖర్చు, అన్ని వసతులతో విమానంలో వెళ్లి నేపాల్ ను చూసివచ్చే అవకాశం ఇది.

నేపాల్ ప్రకృతి రమణీయతకు మరోపేరు. పర్యాటక కేంద్రం గా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ప్రతి ఏటా  మిలియన్ల మంది పర్యాటకులు నేపాల్ ను సందర్శిస్తుంటారు. ఈ IRCTC  ప్యాకేజీ టూర్  6 రాత్రులు /7 రోజులు సాగుతుంది. ఈ ప్యాకేజీ టూర్ 21.11.2026  న  ప్రారంభమవుతుంది.

Day  1..  ఉదయం 11.10 నిమిషాలకు హైదరాబాద్ నుండి బయలు దేరి ఉత్తర్ ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు విమానంలో చేరతారు. అక్కడ టూర్ ఆపరేటర్  పికప్ చేసుకొని రోడ్డు మార్గంలో నేపాల్‌‌ లోని లుంబినీకి తీసుకువెళతారు.సమయాన్నిబట్టి లుంబినీలో ఉన్న మాయాదేవి ఆలయం, ఇతర దేవాలయాలను చూపిస్తారు. ఆ రాత్రికి హోటల్‌లో బస చేయాలి.

Day.2… మరుసటి రోజు ఉదయం లుంబినీ నుండి బయలుదేరి పోఖరాకు చేరతారు.అక్కడ ప్రపంచ శాంతి ప్రదేశం పగోడా, ఫెవా సరస్సును చూపుతారు. ముందురోజు ఆలయాలను చూడకపోతే రెండవ రోజు చూపిస్తారు. రాత్రికి పోఖరలోనే బస చేస్తారు.

Day.. 3... మూడో రోజు ఉదయం అద్భుతమైన సూర్యోదయాన్ని చూసేందుకు  సారంగ్‌కోట్ వ్యూ పాయింట్‌కు తీసుకువెళతారు. తర్వాత  బింధ్యాబాసిని మందిర్, డేవిస్ ఫాల్స్, గుప్తేశ్వర్ మహాదేవ్ గుహలను సందర్శిస్తారు.ఆ రాత్రికి పోఖరలోనే బస చేస్తారు.

Day..4..నాలుగో రోజు ఖాట్మండుకు బయలు దేరుతారు.వెళ్లేదారిలో మనకామ్నా ఆలయాన్ని దర్శిస్తారు. సాయంకాలానికి ఖాట్మండుకు చేరుకుంటారు. లోకల్ మార్కెట్లను సందర్శిస్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.

Day..5.. ఐదో రోజు ఉదయం పశుపతినాథ్ ఆలయం, దర్బార్ స్క్వేర్, రాయల్ ప్యాలెస్, స్వయంభునాథ్ టెంపుల్ ను సందర్శిస్తారు. ప్రతి చోటా గైడ్ దగ్గరే ఉండి ఆ ప్రదేశం ప్రాధాన్యతలను వివరిస్తారు.

Day..6..  బ్రేక్‌ఫాస్ట్ చేశాక జనక్ పూర్ బయలుదేరుతారు. అక్కడ హోటల్ లో చెకిన్ అయిన తర్వాత జానకి దేవి టెంపుల్ కి వెళతారు. ఆ రాత్రి బస జనక్ పూర్ లోనే.

Day..7…  బ్రేక్ ఫాస్ట్ ముగించుకుని,హోటల్ చెక్ అవుట్ చేసి దర్భంగా విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ ఫార్మాలిటీస్ ముగించుకుని మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ కి బయలు దేరుతారు. సాయంత్రం 5.05 కి హైదరాబాద్ చేరుకుంటారు.ఈ ప్యాకేజీలో అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం ఉంటాయి. ఈ ప్యాకేజీలో భాగంగా 3 స్టార్ హోటల్‌లో వసతి సదుపాయం కల్పిస్తారు.

ఛార్జీల వివరాలు:

ఇతర వివరాలకు  IRCTC  వెబ్సైటు ను చూడండి. 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!