హరప్పా యుగంలో ఫ్రైడ్ ఫుడ్ తయారు చేసేవారా ?

Sharing is Caring...

Katta Srinivas……………………… 

Food habits and cooking methods in Harappan age ………………………..

ఆ మధ్య హరప్పా ప్రాంతం లో జరిపిన తవ్వకాల్లో ఆసక్తికరమైన విషయాలు కొన్నివెలుగు చూశాయి. అక్కడ దొరికిన మట్టి కుండలు హరప్పన్ల కాలం నాటి ఆహారపు అలవాట్లను తెలియజేస్తున్నాయి. నాలుగువేల ఏళ్ళ క్రితమే ఉడికించిన, వేయించిన ఆహారాన్ని వాళ్లు తీసుకునే వారని పరిశోధనలు చెబుతున్నాయి. 

హరప్పా యుగంలో ఆహారపు అలవాట్లు,వంట పద్ధతులపై 4,000 సంవత్సరాల క్రితపు మట్టి కుండలపై ఒక అధ్యయనం జరిగింది.  ఐఐటీ గాంధీనగర్, యూనివర్శిటీ ఆఫ్ కేరళ, యూనివర్శిటీ ఆఫ్ నార్త్ కరోలినా పరిశోధకుల బృందం దీనిని నిర్వహించింది.

క్రీస్తు పూర్వం 2100 నుండి సుమారు క్రీస్తు పూర్వం 400 సంవత్సరాల పాటు ఆక్రమించబడిన గుజరాత్‌లోని కచ్ జిల్లాలోని హరప్పా ప్రాంతమైన సుర్కోటడ నుండి వెలికితీసిన నలుపు, ఎరుపు కుండల అవశేషాలను వారు పరిశీలించారు.ఆ యుగంలోని వంట పద్ధతుల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకొచ్చాయి.

లిపిడ్ అవశేషాల (కొవ్వు సమ్మేళనాలు) విశ్లేషణ, స్థిరనివాసం ప్రారంభ దశలలో, నివాసితులు ఆహారాన్నిఉడకబెట్టడం.. వేయించడం వంటి పద్ధతుల్లో తయారు చేశారని అధ్యయనంలో  తేలింది. ఐఐటీ-గాంధీనగర్‌లో పాక చరిత్రలు,విషయాలు  సంస్కృతుల సదస్సు సందర్భంగా సమర్పించిన పేపర్‌లో ఈ విషయాలను పరిశోధకులు ప్రస్తావించారు. 

‘‘Understanding Cooking Techniques through Lipid Residue Analysis at the Harappan site of Surkotada అనే పేపర్‌లో పరిశోధనా అంశాలను పొందుపరిచారు. అహనా ఘోష్, రాజేష్ ఎస్ వి, అభయన్ జి ఎస్, ఎలినోరా ఎ రెబర్, హెల్నా లిస్టన్, శివప్రియ కిరుబాకరన్,  శారద చన్నరాయపట్న లు  ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.

హరప్పా కాలం నాటి స్థిరనివాసాలకు వెలుపలి ప్రాంతంలో మానవ అస్థిపంజరపు అవశేషాలను ఈ బృందం కనుగొన్నారు. ఇటువంటి అస్థిపంజరం స్థిరనివాసాలు ఏర్పడటానికి ముందు కాలం నాటిది అయివుండొచ్చు అని అభిప్రాయపడ్డారు.  ఇదే అస్థి  పంజరం దగ్గరలో ఆరు మట్టి పాత్రలు కూడా దొరికాయి.

అవి నలుపు, ఎరుపు రంగుల్లో వున్నాయి. తల దగ్గర .. నాలుగు కాళ్ళ దగ్గర రెండు వున్నాయి. ఆ పాత్రలలో మిగిలిన కొవ్వు కణాల అవక్షేప పదార్ధాల ఉనికిపై బృందం పరిశోధనలు నిర్వహించింది. 

ఐఐటి-జిఎన్‌లో డాక్టరల్ విద్యార్థి అహానా ఘోష్ మాట్లాడుతూ, “కొవ్వు సమ్మేళనాలు అయిన లిపిడ్‌లు మన్నికైనవి అని. లిపిడ్ అవశేషాల విశ్లేషణ తరచుగా పురావస్తు అధ్యయనాలలో ఉపయోగించబడుతుందని వివరించారు. వాటిని  minimally invasive techniques ఉపయోగించి కుండల అంచులు,  మూల ప్రాంతాల నుండి నమూనాలను సేకరించారట.

నమూనాలు IIT-Gn .. US లో ప్రత్యేక విశ్లేషణా ప్రక్రియకు పంపించారు. ఈ పరిశోధన అంతా పిహెడ్ డి థీసిస్ లో భాగంగా జరిగింది.కుండలలో నిజంగా లిపిడ్లు ఉన్నాయని ఫలితాలు స్పష్టం చేశాయి. “మేము వాటిని కొన్ని కుండలలో అంచు ప్రాంతంలో పెద్ద పరిమాణంలో కనుగొన్నాము, అయితే కొన్నింటిలో, ఇది బేస్‌లో కేంద్రీకృతమై ఉంది. ఉడకబెట్టడం వల్ల ఇది జరిగిందని మా పరికల్పన చెబుతోంది.

ఈ సమయంలో లిపిడ్లు పైకి ప్రయాణించి అంచు దగ్గర చేరాయి. కుండ బేస్ వద్ద ఉన్న లిపిడ్ల సాంద్రత అధిక ఉష్ణోగ్రత వద్ద వేయించడం కూడా వంట పద్ధతి అని సూచిస్తుంది, ”ఘోష్ చెప్పుకొచ్చారు. 
ప్రారంభ పరికల్పన కుండలలో మొక్కల ఆధారిత ఆహారం,  షెల్ఫిష్ వంటి సముద్ర ఆహారాలు ఉన్నాయని సూచిస్తున్నాయి.

గుజరాత్‌లో గతంలో నిర్వహించిన పురావస్తు అధ్యయనాలు హరప్పా వారి ఆహారం, పాక పద్ధతుల విలువైన వివరాలను అందించాయి .. నాడు  వారు నిల్వ చేయడానికి, వంట చేయడానికి వేర్వేరు కుండలను కలిగి ఉన్నారు.  హరప్పన్ల ఆహారంలో మొక్కల ఆధారిత, జంతు ఆధారిత ఆహారం రెండూ ఉన్నాయి.

GS అభయన్ కాన్ఫరెన్స్‌లో సమర్పించిన మరో పత్రం ప్రకారం, గుజరాత్‌లోని బగస్రా, కన్మేర్, షికార్‌పూర్, నవీనల్, కోటాడ భడ్లీతో సహా హరప్పా కాలం నాటి వివిధ పురావస్తు ప్రదేశాలలో 13 వేర్వేరు కుటుంబాలకు చెందిన 21 విభిన్న చేప జాతుల అవశేషాలు కనుగొనబడ్డాయి.

అనేక లోతట్టు ప్రాంతాలలో చేపల ఉనికి ఈ పాడైపోయే ఆహార పదార్ధం కోసం చక్కటి వ్యవస్థీకృత రవాణా వ్యవస్థ ఉందని సూచిస్తుందని అభయన్ వివరించాడు. హరప్పా ప్రజల ఆహారంలో సముద్ర, మంచినీటి చేప జాతులు రెండూ ఉన్నాయని అభయన్ చెప్పుకొచ్చారు

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!