Nehru vs Ambedkar ……………………
అంబేద్కర్.. ఒక న్యాయనిపుణుడు, ఒక ఆర్థికవేత్త, ఒక రాజకీయవేత్త, ఒక సంఘ సంస్కర్త.. రాజ్యాంగ పితామహుడు.. భారతీయులకు సామాజిక హక్కులు లభించాయన్నా.. దేశంలో ప్రజాస్వామ్యం ఉందన్నా అది డా.బి.ఆర్. అంబేద్కర్ చేసిన కృషి వల్లనే.
ఆయన భారతీయులకే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక తరాలకు స్ఫూర్తిదాయకం.. ఇవాళ కాంగ్రెస్ ఇతర పార్టీలు కావచ్చు..అందరూ అంబేద్కర్ పేరు చెప్పి ఓట్లు అడుగుతాయి..కానీ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్‌ను ఎన్నికల్లో ఒకటి కాదు రెండుసార్లు ఓడించిందనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు.
1947 లో భారతదేశం తెల్లవారి కబంధ హస్తాల నుంచి విముక్తి పొందింది. అంతకుముందు ఏడాదే అంటే 1946 లో కాంగ్రెస్ కొత్త పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంది. ఏటా అధ్యక్ష ఎన్నికలు జరిగే సంప్రదాయం ఉన్న పార్టీ లో రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా ఆరు సంవత్సరాలుగా ఎన్నిక జరగలేదు. అప్పటివరకు ఆ పదవిలో కొనసాగిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ పదవీ విరమణ చేశారు.
అధ్యక్ష పదవి ఎన్నికకు నామినేషన్లు వేసిన వారిలో నెహ్రూ, పటేల్, JB కృపలానీ, సుభాష్ చంద్రబోస్, జయప్రకాష్ నారాయణ్ ఉన్నారు. బోస్ మరణించినందున, JP పార్టీలో అధికారిక సభ్యుడు కానందున ఆ ఇద్దరి పేర్లను తొలగించారు. పటేల్, కృపలానీ తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు..
ఈ క్రమంలో నెహ్రూ పోటీ లేకుండా అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు. జూలై 6న పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆగస్టు 4న, వైస్రాయ్ వేవెల్ కాంగ్రెస్ అధ్యక్షుడిని పిలిచి మాట్లాడారు. ఇండియా ప్రభుత్వం తరపున తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని నెహ్రూను కోరారు.
పార్టీలో ఈ అంశంపై చర్చ జరిగింది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో 15 మంది సభ్యులతో కూడిన అత్యున్నత కమిటీ ఉంది. అందులో 12 మంది సర్దార్ వల్లబాయి పటేల్‌కు అనుకూలంగా ఉన్నారని అంటారు.అయితే మహాత్మా గాంధీ నెహ్రూ వైపు మొగ్గు చూపారని చెబుతారు. అప్పటికే కాంగ్రెస్ పార్టీ లో నెహ్రు ప్రముఖ నాయకుడు కావడంతో ఎవరూ ఏమీ మాట్లాడలేదు.
ఆ విధంగా, నెహ్రూ మొదట తాత్కాలిక ప్రభుత్వానికి అధిపతిగా అధికారాన్ని చేపట్టారు.
1947 ఆగస్టు 15న, జవహర్‌లాల్ నెహ్రూ భారతదేశపు మొదటి ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. నెహ్రూ తన మంత్రి వర్గంలోకి పదిహేను మందిని ఎంపిక చేశారు.
నాడు మంత్రివర్గంలో భాగమైన డా.బి.ఆర్.అంబేద్కర్ స్వతంత్ర భారత మొదటి న్యాయ శాఖ మంత్రి…నాడు అంబేద్కర్ సామాజిక సంస్కరణలు తీసుకు రావాలనుకున్నారు.. కానీ నెహ్రూతో సహా కొంతమంది కాంగ్రెస్ సభ్యులు అంబేద్కర్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్నారు.చాలాసార్లు నెహ్రూ కాంగ్రెస్ సభ్యులు అంబేద్కర్‌ను పార్లమెంటులో బహిరంగంగా అవమానించారని అంటారు.
సిద్ధాంత వైఖరి కారణంగా అంబేద్కర్ కాంగ్రెస్ ను వ్యతిరేకించారు. నాడు కాంగ్రెస్ సభ్యుల వైఖరితో విసిగిపోయిన అంబేద్కర్ పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసారు. కాంగ్రెస్ అంబేద్కర్‌కు వ్యతిరేకంగా మారడానికి అనేక కారణాలు ఉన్నాయి.
అంబేద్కర్ ఆర్టికల్ 370 కి వ్యతిరేకం.. భారత రాజ్యాంగాన్ని తిరస్కరించిన కాశ్మీర్ నేతలకు సొంత ప్రభుత్వాన్ని నడిపేందుకు అనుమతివ్వడం ఆయనకు నచ్చలేదు. రిజర్వేషన్ ప్రయోజనాలను ఇచ్చినందుకు నెహ్రూను నేరుగా అంబేద్కర్ ప్రశ్నించారు. అంబేద్కర్ వైఖరి కూడా నెహ్రు కి నచ్చలేదు
ఈ క్రమంలోనే 1952 లో ఎన్నికల బరిలోకి దిగిన అంబేద్కర్ ఓటమికి నెహ్రు వ్యూహ రచన చేశారు. 10వ తరగతి కూడా పాస్ కాని అంబేద్కర్ సహాయకుడు ఎన్.ఎస్. కజ్రోల్కర్‌ను ఎంపిక చేసి అంబేద్కర్‌పై పోటీకి రంగంలోకి దింపారు.
ముంబయి నార్త్ సెంట్రల్ నియోజకవర్గం లో గాంధీ మద్దతుతో నెహ్రూ కజ్రోల్కర్ కోసం ప్రచారం చేసారు. నాటి ఎన్నికలో 14,500 ఓట్ల తేడాతో అంబేద్కర్‌ను ఓడించారు.1954 లోక్‌సభ బై ఎలక్షన్‌లో కూడా అదే కథ పునరావృతమైంది.
భండారాలో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి భౌరావ్ బోర్కర్ చేతిలో అంబేద్కర్ ఓడిపోయారు. మునుపటి జనసంఘ్ (ఇప్పటి బిజెపి) ఆ ఎన్నికల్లో డాక్టర్ అంబేద్కర్‌కు మద్దతు ఇచ్చింది. అయినప్పటికీ అక్కడ ఆయన కాంగ్రెస్ చేతిలో ఓడిపోయారు.అంబేద్కర్ ఓటమే లక్ష్యంగా పెట్టుకుని నాడు కాంగ్రెస్ పనిచేసిందని విమర్శలు కూడా వచ్చాయి .ఇప్పటికి ఆ విమర్శలకు కాంగ్రెస్ జవాబు చెప్పుకోలేని స్థితిలో ఉంది.