ఆ ఇద్దరికి పేరు తెచ్చిన .. రక్త కన్నీరు !!

Sharing is Caring...

యర్నాగుల సుధాకరరావు…………………………

కొన్ని పాత్రలు కేవలం ఒకరిద్దరు నటులకోసమే పుట్టుకొస్తాయి. అలాంటి పాత్రే రక్తకనీరు లోని గోపాలం పాత్ర. తమిళం లో MR.. రాధా ఆ పాత్రలో జీవించి ప్రేక్షకుల మెప్పు పొందారు. అదే పాత్రను తెలుగులో నాగభూషణం చేశారు. రాధను కొంత మేరకు అనుకరించినప్పటికీ ఆ పాత్రతో నాగభూషణం తెలుగు నాటకప్రియుల గుండెల్లో నిలిచిపోయాడు. వేరెవరూ ఆపాత్ర చేయడానికి సాహసించలేకపోయారు. కొందరు చేసినప్పటికీ ఆ ఇద్దరిలా మెప్పించలేకపోయారు.

తమిళ నాటకరంగ నటసింహం ఎమ్‌ఆర్‌రాధా.తమిళంలో రక్త కన్నీరు నాటకాన్ని రాష్ట్రమంతా వేలాది  ప్రదర్శనలిచ్చి ఔరా అనిపించుకున్నారు .ఎమ్‌.ఆర్‌.రాధ.. ఈయన అసలుపేరు మోహన్‌ రాజగో పాలరావు నాయుడు రాధాకృష్ణన్‌.ఆయన చాలా చిన్నవయస్సు నుంచే నటజీవితంపై మక్కువ పెంచుకున్నాడు.1953 లో ఈనాటకాన్ని తమిళంలో సినిమాగా అదేపేరుతో నిర్మించారు.

ఆచిత్రం తమిళనాట కాసులవర్షం కురిపించడమే కాకుండా ఎమ్‌. ఆర్‌.రాధాను సూపర్‌స్టార్‌గా నిలబెట్టింది.  ఆయన నటన ఒకసాగరంలా సాగిపోతుంది.ఆ తర్వాత చితి,కుముదం, కర్పగం వంటి సినిమాలు చేసాడు. తెరమీద విరుపులతో కూడిన నటనను  పలువురు నటులు అనుకరించేవారు రక్తకన్నీరు నాటకం చూసిన తెలుగు నటుడు నాగభూషణంకు అచ్చం నీలాగునే ఉన్న ఎమ్‌ఆర్‌రాధ నాటకంతో ఎంతో సక్సెస్‌ అయ్యాడు.

నీవు దాన్ని తెలుగులోకి మార్చుకుని నాటకాలు వేసుకోరాదు. సిన్మా వేషాలకు ఎంతని కాళ్లరిగేలా తిరుగుతావు అని ఒక మిత్రుడు సలహా ఇచ్చాడు.  నాగభూషణం రక్తకన్నీరు నాటకంను తెలుగులో ప్రదర్శించు కోవడా నికి ఎమ్‌ఆర్‌ రాధను అడగడం ఆయన ఓకే అనడం ఆవెంటనే ప్రముఖరచయిత పాలగుమ్మిపద్మ రాజుతో ఆనాటకం రాయించి ప్రద ర్శించడం జరిగిపోయింది. ఆనాటకం నాగభూషణాన్ని క్షణం తీరిక లేకుండా చేసింది.ఈ నాటకంలో  మేటి నటీమణులు వాణిశ్రీ,శారదలు చాలాకాలం నటించి రాణించారు.

తమిళసినిమాను తెలుగుతో నాగభూషణంతో రీమేక్‌ చేద్దామనుకున్నారు ఒకరిద్దరు నిర్మాతలు.వద్దు ఎమ్‌ఆర్‌రాధ పాత్రపరిధికి మించి చేసాడు.ఆచిత్రాన్నే డబ్బింగ్‌ చేద్దామనుకున్నారు.ఎమ్‌ఆర్‌రాధ పాత్రకు నాగభూషణంతో వాయిస్ ఇప్పించారు.  ఆచిత్రం తెలుగులో 1956లో విడుదల య్యింది.

తెలుగునాట జనాలను ఉక్కిరిబిక్కిరి చేసింది.ఎమ్‌ఆర్‌ రాధ సెకెండ్‌ఆఫ్‌లో కుష్టురోగిగా చేసిన నటనను  జనాలు చూడడానికి భయపడిపోయారు. వంగిన వేళ్లతో ఒకకాలు చొట్టవోయిన నడకతో గుడ్డికళ్లతో అభినయాన్ని  తెలుగు జనాలు గుడ్లప్పగించి చూసారు.ఆనటనకు నాగభూషణం  మాటలు బాగాపేలాయి.

చిత్ర కథనంలోకి వెడితే హీరో గోపాలం ధనికుడు వేశ్యాలోలుడు,మద్యపానం,పేకాటలలో మునిగి తేలుతుంటాడు.తల్లిపట్ల అగౌరవంగా ప్రవర్తిస్తాడు.చేసుకున్న ఇల్లాలిలో విదేశీయతను కోరు కుంటాడు.చివరికి పల్లెటూరు గబ్బిలం అని పొమ్మంటాడు. ధనం అంతా వేశ్యలకు అర్పించేసి కుష్టురోగానికి గురయి వీధుల పాలవుతాడు.ఆకలితో  అలమటిస్తాడు ఇదిసూక్షంగా కథ….కథంతా సీరియస్‌గా నడుస్తుంది. కానీ హాస్యం,సమాజం పై నిప్పులు చెరిగేలా వ్యంగ్యంతో ఆద్యంతం ప్రేక్షకులను అలరిస్తుంది. 

కుష్టురోగంతో బాధపడుతూ వేశ్య ఇంటి నుంచి, తరిమివేయబడిన ఎమ్‌ఆర్‌రాధ ఆ పాత్రలో జీవించాడు.  డబ్బు ఉన్నప్పుడే రావల్సిన జబ్బురా రామా! లేనప్పుడు వచ్చిందిరా రామా!! అని ఏడుపు గొంతుతో ఎలుగెత్తి రోడ్డుమీద కుంటి నడకలతో నడుచుకుని పోతుంటాడు.రోడ్డుపక్కనే ఉన్న రాళ్లకుప్పను తన్ని పడిపోతాడు. అప్పుడు ఓహో నాలాంటి కనుచూపు లేనివాడి కాళ్లు పోగొట్టడానికి మున్సిపాలిటివారు వేసిన రాళ్లన్నమాట.

ఎప్పుడో రెండుసంవత్సరా లకు వేయాల్సిన రోడ్డుకు ఇప్పట్నించి రాళ్లురప్పలు రోడ్డుపక్కన వేస్తారు ఎందుకో!వంటి డైలాగులు గుప్పించడమే ఈచిత్రం ప్రత్యేకత.విపరీతమైన వ్యంగ్యంతో కూడిన మాటలతో వచ్చిన చిత్రం. చివరిసీనులో రోడ్డుమీద అమ్మాఆకలి అని అరుస్తుంటాడు గోపాలం.అతడి స్నేహితుడు ఎమ్‌ఆర్‌రాధను గుర్తుపట్టక ఎవరో అన్నార్తుడని ఇంటివద్దకు రాగలిగితే భోజనం పెట్టిస్తానంటాడు.

అందుకు ఒకకూలివాడి సాయంతో నడిపిస్తాడు.ఎమ్‌ఆర్‌ రాధను కర్రచేతికిచ్చి లాక్కెళతాడు ఆకూలి వాడు.  ఇంటికి చేరాక అక్కడ అలసిపోయి కూర్చుంటాడు ఎమ్‌ఆర్‌రాధ. కూలివాడికి సూట్‌కేసు మోసుకొచ్చినందుకు కూలివాడిని నడిపించుకుని వచ్చినందుకు అర్దరూపాయి కిరాయి ఇస్తాడు స్నేహితుడు. బాబు తక్కువే ఇచ్చారు ఆజబ్బుపడ్డ బిచ్చగాడిని నడిపించడం చాలాకష్టం అని నసుగుతాడు.

ఎమ్‌ఆర్‌రాధ కలుగచేసుకుని ఏరాకూలీ!ఆబాబు ఇచ్చింది  తీసుకుని పోరా!!అని రెక్‌లెస్‌గా చెబుతాడు. దానికి ఆకూలివాడు నోర్ముయ్‌రా ముష్టినాయాల అని ఉరుముతాడు. రేయ్‌ కుభేరుడు బామ్మర్ది నిన్ను దేవుడు అప్‌లో పడేసాడు నన్ను డవున్‌లో పడేసాడా .అవున్రా గుడికెళ్తా? హరతి కర్పూరం కళ్లకద్దుకుంటావ్‌? మరి నీగుడి ఎత్తిపోతే  ఏమిరా కళ్లకద్దు కోవు అని ఆటపట్టిస్తాడు.రేయ్‌ జబ్బు నాయాళ రేపు మావీధిలో కన్పించు రా నిన్ను కప్పెడతాను.ఇలా హాస్యం తో నిండిఉంటుంది.కథ మాత్రం  సీరియస్‌గానే నడుస్తుంది.

నాగభూషణం ఈనాటకం ఐదారువేలసార్లు తెలుగు నేలంతా ప్రదర్శించారు.ఆయన సినిమాలతో క్షణం తీరికలేనప్పుడు కూడా నాటకానికి  డేట్ ఖరారు చేసేవారు.అలాగే అక్కడ ఎమ్‌ఆర్‌ రాధ కూడా నాటకాన్ని వేసేవారు.ఇన్నివేలసార్లు ప్రదర్శనకు కారణం ఈకథలో గొప్పతనం కాదు.ఈకథ పాతదే.చెడ్డతిరుగుళ్లు తిరిగినవాళ్లు పతనంకాక తప్పదని చెప్పే సినిమాలు కొన్ని వందలు వస్తుం డేవి.

అయితే ఆరక్తకన్నీరు నాటకాన్ని ఎక్కడవేస్తే అక్కడ లోకల్‌ పాలిటిక్సు నుంచి రాష్ట్ర,జాతీయ,అంతర్జాతీయ పాలి టిక్సును ఎమ్‌ ఆర్‌రాధ ఇక్కడ నాగభూషణం నోట్లోంచి వెలువడే మాటలు తూటల్లా పేలుతుండేవి.ఈవిధానంతో నాటకం రెండురాష్ట్రాలను కుదిపేసింది.

మిగిలిన భాషల్లో నటులు ట్రైచేసి ఫెయిల్‌ అయ్యారు. అయితే ఎమ్‌ఆర్‌రాధ తమిళనాట రాజకీయాలలో చురుగ్గా పాల్గొనేవారు.1967లో ఎన్నికలలో వ్యక్తిగత గొడవలతో ఎమ్‌.జి.రామ చంద్రన్‌ను పిస్తోలుతో కాల్చాడు..కోర్టులో ఎమ్‌.జి.ఆర్‌ రాధాను రక్షించే విధంగా సాక్ష్యం చెప్పినా కోర్టు శిక్షకు గురిచేసింది.

తమిళనాట రాయబడిన ఒక హాస్యవ్యంగ్య కన్నీటినాటకం రక్త కన్నీరు ఇద్దరునటులు ఎమ్‌ఆర్‌రాధ,నాగభూషణంకు లైఫ్‌ నిచ్చిం ది.దీన్ని ఉపేంద్ర కన్నడంలో తీసి పర్వాలేదనిపించు కున్నాడు.ఎమ్‌ఆర్‌రాధ ఈనాటకంపై పెంచుకున్న మోజు ఆయనకు  ఎనలేని పేరు తెచ్చింది. అన్నట్టు ప్రముఖ నటి రాధికా ఆయన కూతురే.  21-2-1907న  జన్మించిన ఆయన 17-9-1979లో ఆనాటకాన్ని, తనఅభిమానులను, ఈలోకాన్ని విడిచి వెళ్లిపోయారు.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!