త్రిమూర్తులు ఉన్నారా?

Sharing is Caring...

మన పురాణాలు, వేదాలు త్రిమూర్తులను ప్రతిపాదించాయి. ఖగోళశాస్త్రం ప్రకారం ఈ విశ్వం అంతా మూడు పదార్థాల సమాహారం .. సమన్వయం.

సనాతనధర్మం – శాస్త్రీయ వైశిష్ట్యత : 3

వేదాలు ముక్తకంఠంతో చెప్పినది పరమాత్మ ఒక్కటే అని. పరమాత్మకి రూపం లేదు, లింగభేదం లేదు. కానీ వారి వారి సౌలభ్యం కోసం కొందరు పరమేశ్వరుడు అన్నారు, కొందరు శక్తి లేదా దేవి అన్నారు. బహుశా మనకి జన్మనిచ్చే తల్లి స్త్రీ, మనకి జీవవనరులు సమకూర్చే ప్రకృతి స్త్రీ లింగం కాబట్టి అలా అనుకొని ఉండొచ్చు.

అసలు ఈ సృష్టి అంతా masculine & feminine అనే రెండు ధృవాల సమాహారం. వీటిని మగ, ఆడ అనే అనుకుంటాం, అదే దృష్టితో చూస్తాం. ఇది పొరబాటు, ఆ రెండు ధృవాలను పరాక్రమం – లాలిత్యం లేదా శక్తి – పోషణ అనే దృక్పథంతో చూడాలి. ఈ ధృవాలకు నిజానికి లింగబేధం లేదు.

ఒక పురుషుడు… స్త్రీ కన్నా ఎక్కువ feminine అయ్యే లేదా ఒక స్త్రీ… పురుషుడి కన్నా masculine అయ్యే అవకాశం ఖచ్ఛితంగా ఉందన్న సంగతి మనందరికీ తెలిసిందే. కానీ ఆ రెండూ  సమపాళ్ళలో మేళవింపబడ్డ పురుషుడు/ స్త్రీ ని మాత్రమే సంపూర్ణ మానవుడిగా మన శాస్త్రాలు పేర్కొంటున్నాయి. శివుని అర్థనారీ స్వరూపం పరమార్థం ఇదే. వీటిని పింగళ & ఈదా అంటారు. ప్రతి మనిషిలోని ఏడు చక్రాలను కలిపే పెనవేసుకుపోయిన రెండు శక్తులే ఇవి.

ఇదే సనాతన ధర్మం. ఈ ధర్మమే త్రిమూర్తి తత్వాన్ని కూడా ప్రతిపాదించింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులు. సృష్టి, స్థితి, లయలకు… సత్వ, తమో, రజో గుణాలకు ప్రతీకలు.

ఆధునిక ఆస్ట్రానమీ (ఖగోళశాస్త్రం) ప్రకారం ఈ విశ్వం అంతా Mass (భౌతిక పదార్థం), Dark matter (కృష్ణ పదార్థం),  Dark energy (కృష్ణ శక్తి) అనే మూడింటి సమాహారం. మనకి కనబడే నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఉల్కలు, తోకచుక్కలు మొదలైనవన్నీ Mass. వీటిని నియంత్రించేది Dark matter.

ఇది కనపడదు. కానీ ఇది Mass చూపే ప్రభావాన్ని అంచనా వేయడం ద్వారా మాత్రమే ఊహించగలం. ఇక ఈ Massని, Dark matterని విస్తరింపచేసేది, శక్తినిచ్చేది Dark energy. ఇది కూడా భౌతికంగా కనపడదు. మొత్తం విశ్వంలో సుమారుగా Dark energy 74%, Dark matter 22%, Mass 4% ఉన్నాయి.

ఎలా అయితే వేదాలలో త్రిమూర్తులు గురించి చెప్తూ…ముగ్గురూ పరస్పరం సమన్వయులు, అనువర్తనులు అని చెప్పారో… అదేవిధంగా Astronomy కూడా Mass,  Dark matter,  Dark energy ల గురించి అదే చెప్తోంది.

చెణుకులు :
* ప్రతి సెకనుకు సూర్యుడు సుమారుగా 70కోట్ల టన్నుల హైడ్రోజన్ ను 69.5కోట్ల టన్నుల హీలియంగా మారుస్తూ 38600కోట్ల , కోట్ల మెగావాట్ల శక్తిని ఉత్పత్తి చేస్తున్నాడు.
*  భూమి గంటకు సుమారుగా 1,07,350కి.మీ వేగంతో సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తోంది.

* ప్రతి 11సంవత్సరాలకూ సూర్యుని అయస్కాంత ధృవాలు పరస్పరం మారుతూ ఉంటాయి. దీనిని Solarmax అంటారు. అలా జరిగిన ప్రతిసారీ భూమిపై ఏదో ఒక ఉపద్రవం వస్తోంది. దీనికి శాస్త్రీయ వివరణ ఏదీ ప్రస్తుతానికి కనిపెట్టబడలేదు.

* సౌరమండలం పాలపుంత కేంద్రం చుట్టూ పరిభ్రమించేప్పుడు అది తన కక్ష్యలో సమతలంగా, నేరుగా ప్రయాణించదు. అది ఎగుడు దిగుడుగా ప్రయాణిస్తుంది. ఈ హెచ్చు, తగ్గులు భూమి పై మేజర్ ఎక్స్టిన్షన్ (అంతరించే) ఈవెంట్లకు సమకాలీనంగా ఉండటం ఇంకా పరిశోధించని ఆశ్చర్యకరమైన విషయం.

——–  పులి ఓబుల్ రెడ్డి

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!