పుణ్య సన్నాఫ్ కఠారి నరసింహమూర్తి …………………………
రెగ్గే_మ్యూజిక్ ఎందుకు అంత ప్రత్యేకం? ఈ సంగీత శైలిలో వాడే సంగీత పరికరాలు ఏంటి? ఎవరికృషి వల్ల #రెగ్గే పాశ్చాత్య దేశాలకు చేరువయ్యింది? అనే విషయాలు తెలుసుకుందాం.
జమైకాలో బానిసత్వ నిర్మూలన కోసం చేస్తున్న పోరాటానికి #రెగ్గే ఒక ఆలంబనగా నిలిచింది.. అప్పటి ప్రభుత్వాలపై పోరాడే ఉద్యమంలో ప్రజలను బాగా ఉత్తేజితం చేయడం కోసం, సాంఘిక సమస్యలపై ఉద్రేకపూరితమయిన పాటలు రాసి ఈ సంగీత శైలిలో పాడి ప్రజల్లో ఉద్యమ భావన కలిగించే వాళ్ళు.
ఆఫ్రికన్ మ్యూజిక్ లో డ్రమ్స్ చాలా ఎక్కువ వాడతారు… జమైకా కి బ్రిటిష్ వారి చేత తరలింపబడ్డ వాళ్ళలో ఎక్కువ మంది ఆఫ్రికా వాళ్లే కాబట్టి, అరవై దశకం చివరిలో అప్పుడప్పుడే రూపుదిద్దుకుంటోన్న ఈశైలి లో డ్రమ్స్ వాడకం చాలా ఎక్కువగా ఉండేది… అలా వృద్ధి చెందుతూ 1968 సంవత్సరం ప్రాంతంలో ఈ సంగీత శైలి ఒక స్థిర రూపు సంతరించుకుంది.
ఈ విధానంలో ప్రధానంగా ఉపయోగించే సంగీత పరికరాలు మూడు… డ్రమ్స్, సింబల్స్, గిటార్. సింబల్స్ అంటే డ్రమ్స్ వాయిస్తూ మధ్య మధ్యలో స్టీల్ ప్లేట్స్ ని కొడతారు కదా అవి… మనం ఏ పాట విన్నా కూడా రెగ్గే లో ముందుగా డ్రమ్ బీట్ తోనే సంగీతం మొదలవుతుంది… ఆతరవాత, హై బాస్ లో వచ్చే గిటార్ ధ్వని పాట కి చాలా అందం చేకూర్చుతుంది.. పాశ్చాత్య హిప్ హాప్, పాప్, ర్యాప్ పద్ధతులన్నింటికీ ఈ రెగ్గే విధానం మాతృక లాంటిది.
ఇక ప్రముఖ రెగ్గే గాయకుల విషయానికి వస్తే Jimmy Cliff, Peter Thosh, Ruth Brown ఇలా చాలామంది ఉన్నారు…కానీ ఈ రెగ్గే కు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన వారిలో అత్యంత ప్రముఖుడు #బాబ్_మార్లే (Bob Marley). తెలుగు సినిమాకి చిరంజీవి ఎలా అయితే మకుటం లేని మహారాజో, ఈ రెగ్గే మ్యూజిక్ కి Bob Marley కూడా అలాంటి వాడు.
అత్యద్భుతమైన అతని స్వరమాధుర్యం శ్రోతల్ని కట్టిపడేస్తుంది… సామాజిక సమస్యలు, జీవితాన్ని ఆనందంగా ఎలా గడపాలి అనే విషయాల మీద తనే సొంతంగా పాటలు రాసి పాడేవాడు… అతని పాటలన్నీ నర్మగర్భంగా సాగుతూ వుంటాయి..కానీ చాలా లోతైన అర్థాన్ని కలిగి వుంటాయి… అతని పాటలను విశ్లేషిస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క అర్థం స్ఫురిస్తుంది.
అతని తొలి స్టూడియో ఆల్బమ్ నాటీ డ్రేడ్ (1974) కి మంచి స్పందన లభించింది. ఆ తరువాత రాస్తామాన్ వైబ్రేషన్ (1976) విడుదల చేశారు . ఆల్బమ్ విడుదలైన కొన్ని నెలల కు జమైకాలోని ఇంటి వద్ద మార్లే పై హత్యాయత్నం జరిగింది. దీని నుంచి తప్పించుకున్న లండన్‌కు మకాం మార్చారు.
తన సంగీతంతో తిరుగులేని గాయకుడిగా ఎదిగిన బాబ్ మార్లే 36 ఏళ్ళ వయసులో అనారోగ్య కారణం గా మరణించారు. అభిమానులను వదిలి ఎవరికి అందని సుదూర తీరాలకువెళ్ళిపోయాడు.
తమాషా ఏమిటంటే మార్లే కు 70 మిలియన్ల ఫేస్బుక్ ఫ్యాన్స్ ఉన్నారు … ఆ ఖాతాను అభిమానులు నిర్వహిస్తున్నారు . బాబ్ మార్లే కుమారుడు జిగ్గీ మార్లే కూడా గాయకుడే. అతను కూడా సంగీత ప్రపంచం లో సంచలనాలు సృష్టించాడు. అతని గురించి మరోమారు తెలుసుకుందాం.
గుంటూరు శేషేంద్రశర్మ గారి రచనల్లో కనిపించే రూపకాలు (Metaphors) బాబ్ మార్లే పాటల్లోనూ కనిపిస్తాయి. శ్రోతలను అలరించే అతని పాటలు చాలానే వున్నాయి. కొన్ని ఇక్కడ ఇస్తున్నాం.; అందులో ఒకటి “I Shot the Sheriff” you tube link మిత్రుల కోసం…
https://m.youtube.com/watch?v=2XiYUYcpsT4