A socio fantasy drama………
చిరు నటిస్తున్న కొత్త సినిమా సైలెంటుగా ప్రారంభమైంది. ఈ సినిమా కు ‘విశ్వంభర’ టైటిల్ ఖరారు అయింది. డిసెంబర్ మొదటి వారంలో చిరంజీవి ఉండే సీన్స్ చిత్రీకరణ మొదలవుతుంది. అప్పటి వరకు ఆయన లేని సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. బడ్జెట్ కూడా 200 కోట్ల వరకు పెడుతున్నట్లు అంచనా.
సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు వశిష్ట. బింబిసార తర్వాత ఆయన చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు పెరిగాయి. చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో చిరంజీవి నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టాయి. ఒక్క వాల్తేరు వీరయ్య తప్ప మిగిలినవన్నీ దారుణంగా నిరాశపరిచాయి. దాంతో అభిమానులంతా ఒకింత నిరాశతో ఉన్నారు.
ఇక ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నారు చిరంజీవి. ఈ క్రమంలోనే ఆయన దర్శకుడు వశిష్ఠతో చేస్తున్నారు. దర్శకుడు వశిష్ఠ గతంలో కళ్యాణ్ రామ్ హీరోగా బింబిసార అనే సినిమా ను తెరకెక్కించాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. టైం ట్రావెల్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ డ్యూయల్ రోల్ లో నటించి మెప్పించాడు. హిస్టారికల్ నేపథ్యంలో ఆ సినిమా తెరకెక్కింది.
చిరంజీవి చేస్తున్న ఈ చిత్రం ఫాంటసీ డ్రామా. జగదేకవీరుడు అతిలోక సుందరి మాదిరిగా ఈ కూడా భారీ విజయాన్ని అందుకుంటుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. భోళా శంకర్ తర్వాత చిరు ఫ్యాన్స్ డీలా పడిపోయారు. ఓ వైపు ఒరిజినల్ స్టోరీస్‌తో రజనీ, కమల్, బాలయ్య లాంటి సీనియర్స్ వరస విజయాలు అందుకుంటుంటే.. చిరు మాత్రం రీమేక్స్ నమ్ముకుంటున్నారంటూ విమర్శలు వచ్చాయి. అందుకే చిరంజీవి కూడా స్ట్రైట్ మూవీస్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
కథల విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నారు.అందుకే కళ్యాణ్ కృష్ణతో ముందు ప్లాన్ చేసిన బ్రో డాడీ రీమేక్ కూడా పక్కన పెట్టారు.తాజా సినిమాలో హీరోయిన్స్ ఎవరనేది ఖరారు కాలేదు. అనుష్క, మృణాళ్ ఠాకూర్ అనుకుంటున్నారు.