కమ్యూనిస్ట్ తీసిన భక్తి రస చిత్రం !

Sharing is Caring...

Subramanyam Dogiparthi………………….     A movie that entertains the audience…………..

దర్శకుడు వి మధుసూధనరావు వామపక్ష భావజాలాలు కలిగిన వాడు . అక్కినేని నాస్తికుడు . వీళ్ళిద్దరూ కలిసి ఓ చక్కని భక్తి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించారు . భక్తితో పాటు కాస్త రక్తిని కూడా కాంచన పాత్ర ద్వారా అందించారు . శివాజీ మహారాజ్ పాత్రలో శివాజీ గణేశన్ కాసేపే కనిపించినా ప్రేక్షకులు ఆ పాత్రను , పాత్రధారినీ మరచిపోరు.

1973 లో రిలీజయిన ఈ భక్త తుకారాం సినిమా విజయవాడ , విశాఖపట్నం , హైదరాబాదులలో వంద రోజులు ఆడింది . అంజలీదేవి స్వంత బేనర్ అయిన అంజలీ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాకు ఆయువు ఆదినారాయణరావు అందించిన సంగీతమే. 

ఘనాఘన సుందరా , భలే భలే అందాలు సృష్టించావు , కరుణామయా దేవా , పాండురంగ నామం , నా పిలుపు వినగలేవా , శ్యామసుందరా , ఉన్నావా అసలున్నావా , పడవెళ్ళిపోతుందిరా పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి . బాగా హిట్టయ్యాయి కూడా. 

మరో రెండు పాటలు , ఆ పాటల్లో కాంచన నృత్యం , ఆమె అందచందాలు ఈ సినిమాలో మరచిపోలేనివి . పూజకు వేళాయెరా రంగ పూజకు వేళాయెరా , సరిసరి పాటల్లో రక్తి అధ్భుతం . పూజకు వేళాయెరా రక్తి పాట వెంటనే మానవ శరీరం ఎలా శుష్కించి , అందవిహీనంగా తయారవుతుందో కళ్ళకు కట్టినట్లు చూపించే వేదాంతం , జీవిత సారాంశం నాకు బాగా ఇష్టమయినవి.

ఈ పాటను అద్భుతంగా తెరకెక్కించారు. ఈ పాటలో భావాలు అందరికీ తెలిసినవే , అందరం మరచిపోయేవే . అక్కినేని నాస్తికుడయినా చక్రధారి , క్షేత్రయ్య , తుకారాం వంటి భక్తి పాత్రల్లో ఆయనకు ఆయనే సాటి అని రుజువు చేసారు. అక్కినేనికి ఈ తుకారాం మంచి పేరు తెచ్చిపెట్టింది.

అంజలీదేవి , కాంచన , శివాజీ గణేశన్ , నాగభూషణం , ధూళిపాళ , నాగరాజు ప్రభృతులు నటించారు . అతిలోకసుందరి శ్రీదేవి అక్కినేని అంజలీదేవిల కుమార్తెగా నటించింది . కాలేజీ రోజుల్లో మా నరసరావుపేటలో చూసా . టివిలో తరచూ వస్తూనే ఉంటుంది.  

మంచి సినిమా . యూట్యూబులో కూడా ఉంది . చూడనివారు తప్పక చూడవలసిన భక్తి రక్తి సినిమా . పాటల వీడియోలన్నీ యూట్యూబులో ఉన్నాయి . గొప్ప ప్రశాంతతను ఇస్తాయి . ఆస్వాదించండి .
పూజకు వేళయరా … పాట లింక్  

 

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!