This is a way of life………………………………………………..కుటుంబం పైన .. ప్రపంచం మీద విరక్తి పుట్టిన కొందరు వ్యక్తులు సన్యాసుల్లో కలుస్తుంటారు. భిక్షగాళ్లగా మారుతుంటారు. ఇలాంటి వాళ్ళు పుణ్యక్షేత్రాల్లో ఎక్కువగా కనిపిస్తుంటారు. ఇంకా రైల్వే స్టేషన్స్ .. బస్టాండుల్లో తిరుగుతుంటారు. కొందరు సన్యాసుల్లో కలవక కుండా నాగరిక సమాజానికి దూరంగా వెళ్తుంటారు. కొండల్లోకి .. గుహల్లోకి వెళ్లి ఉండే వాళ్ళు అరుదనే చెప్పుకోవాలి.
పై ఫొటోలో కనిపించే వ్యక్తి కూడా అలాంటి అరుదైన కోవకు చెందినవాడే. మనుష్యుల పట్ల విరక్తి పుట్టింది.అవినీతిని చూసి తట్టుకోలేకపోయాడు. సమాజంలో జరుగుతున్న దారుణాలను .. అరాచకాలను చూసి బాధ పడ్డాడు. మార్పు తేవడానికి కొన్ని ప్రయత్నాలు చేసాడు. దానికి తోడు వైవాహిక జీవితంలో కూడా విఫలమయ్యాడు. రెండు .. మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఈయన పద్ధతి భార్యలకు నచ్చలేదో … వారి పద్ధతి ఈయనకు నచ్చలేదో .. మొత్తానికి కుటుంబానికే దూరమయ్యాడు. కొంచెం గొప్పో సంపాదించిన ఆస్తులను చుట్టుపక్కలవారికి ..ఒక సంస్థ కు విరాళంగా ఇచ్చేసాడు.
సెర్బియా లోని పిరోట్ పట్టణానికి చెందిన ఈయన పేరు ఫాంటా పెట్రోవిక్.. వయసు 70 ఏళ్లు. వయసులో ఉండగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసాడు. ప్రపంచం పై విరక్తి కలగగానే సమాజానికి దూరంగా …స్టారా ప్లానినా పర్వతాల పైన ఉన్న గుహలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. గత 20 ఏళ్లుగా ఆ గుహలోనే ఒంటరిగా ఉంటున్నాడు. నిటారుగా ఉండే ఆ కొండలపైకి ఎక్కడం అందరికి సాధ్యమయ్యే పని కాదు.
అంత పెద్ద వయసులోనూ పెట్రోవిక్ చకచకా ఎక్కేస్తాడు. ఇక ఆహారం కోసం పెట్రోవిక్ అడవిలో అన్వేషిస్తాడు. దగ్గర్లో ఉన్న చెరువులో చేపలు పట్టుకుంటాడు. సహజంగా మొలచిన పుట్టగొడుగులను తెచ్చుకుని తింటాడు. గుహలో తనకు కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నాడు. దొరికింది తింటూ అడవిలో తిరుగుతూ స్వేచ్ఛగా జీవిస్తున్నాడు. ఒకరోజు ఏదో పనిమీద పిరోట్ పట్టణానికి వెళ్ళినపుడు కరోనా వైరస్ గురించి తెలుసుకున్నాడు. వెంటనే వెళ్లి వ్యాక్సిన్ కూడా చేయించుకున్నాడు.
ఆ సందర్భంగానే మీడియా కంట్లో పడ్డాడు. ఆసక్తి గల మీడియా ఇంటర్వ్యూలు చేసింది. దాంతో ఒక్కసారిగా అందరి దృష్టిలో పడ్డాడు. “ఇలా మనుష్యులకు దూరంగా .. గుహలో జీవించడం చాలా బాగుంది. నగరంలో ప్రశాంతంగా జీవించ లేకపోయాను. ఇక్కడ ఏ గొడవలు లేవు .. ప్రశాంతంగా ఉంది .. ఈ లైఫ్ ఎంతో తృప్తిగా ఉంది” అని చెప్పుకొచ్చాడు పెట్రోవిక్.ఇలా అడవుల్లో తిరుగుతూ.. గుహల్లో ఉండటం అందరివల్ల కాదు.
watch vedeo …………………….. Cave Man