ఈ బీజేపీ రాముడిని మీరట్ ఓటర్లు ఆదరిస్తారా ?

Sharing is Caring...

A tough competition for Rama……………………….

రామాయణం సీరియల్ లో రాముడిగా నటించిన అరుణ్ గోవిల్ … ఆరోజుల్లో అందరిని ఆకట్టుకున్నాడు. ఆ రాముడే ఇపుడు మీరట్ లో బీజేపీ తరపున పోటీ చేస్తున్నాడు. మీరట్ చారిత్రిక ప్రాధాన్యత ఉన్న నగరం. బీజేపీ కి మంచి పట్టు ఉన్న నియోజకవర్గం.. 

2014 లో ఇక్కడ నుంచి గ్లామర్ తార నగ్మా కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు.ఆమెకు కేవలం 42,911 ఓట్లు మాత్రమే వచ్చాయి. గత 25 ఏళ్ళ కాలంలో కాంగ్రెస్ ఈ స్థానం నుంచి ఒక్కసారి కూడా గెలవలేదు.. ఒక్కో ఎన్నిక కు ఆ పార్టీ బలం క్షీణిస్తూ వచ్చింది. 

ఇక అరుణ్ గోవిల్ గురించి చెప్పుకోవాలంటే … ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో 1952 జనవరి 12న జన్మించారు. ఆయన టీనేజ్ అంతా  ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో గడిపారు. షాజహాన్‌పూర్‌లోని ఆగ్రా విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలలో చదువుకున్నారు.

అరుణ్ కి చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి ఉండేది. మెల్లగా సినిమాలపై దృష్టి మళ్లించారు. 1977 లో పహేలీ  చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యాడు. సుమారు 25 సినిమాల్లో చిన్న చితకా పాత్రలు చేసాడు. కొంత గుర్తింపు సంపాదించాడు.

1987-88 సంవత్సరాలలో అరుణ్ గోవిల్ మలుపు తిరిగింది. రామాయణం సీరియల్ లో రాముడిగా నటించాడు. అంతకు ముందు ఒక  సీరియల్ విక్రమ్ ఔర్ భేతాళ్ లో కూడా నటించాడు. ఇక రామాయణం సంగతి చెప్పనక్కర్లేదు . ఆ సీరియల్ సూపర్ డూపర్ హిట్ అయింది. 

2021లో అరుణ్ గోవిల్ బీజేపీ లో చేరారు. అనూహ్యం గా మీరట్ టిక్కెట్ ఆయనకు వచ్చింది. దీంతో మళ్ళీ వార్తల్లో కెక్కారు.  ఇక అరుణ్ గోవిల్ మీరట్ లో అటు ఎస్పీ ..బీఎస్పీ అభ్యర్థుల తో తలపడనున్నారు.

2019 లోక సభ ఎన్నికల్లో BJP అభ్యర్థి రాజేంద్ర అగర్వాల్ కేవలం 4,729 ఓట్ల తేడాతో గెలుపొందారు. బీఎస్పీకి చెందిన హాజీ మహ్మద్ యాకూబ్‌ అగర్వాల్ కి గట్టి పోటీ ఇచ్చారు. కాబట్టి ఇక్కడ పోటీ తీవ్రంగా ఉండొచ్చు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!