జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా లో పర్యాటక స్థలాలు ఎన్నోఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది పాండవుల గుట్ట. జిల్లా కేంద్రానికి 22 కిమీ దూరంలో రేగొండ మండలం తిరుమలగిరి సమీపం లోని రావులపల్లి పరిసరాల్లో పాండవుల గుట్ట ఉంది. ఈ కొండల్లోనే కొన్ని గుహలు ఉన్నాయి. వీటిలో ప్రధాన ఆకర్షణ ఒకటి వుంది.ఇక్కడి గుహల్లో ప్రాచీన శిలాయుగపు వర్ణ చిత్రాలు వున్నాయి.ప్రాక్ చారిత్రిక యుగం నుంచి చారిత్రక మధ్యయుగం వరకు వివిధ దశల్లో చిత్రీకరించిన వర్ణచిత్రాలు వున్నాయి.కొన్ని చిత్రాలను పునఃచిత్రీకరణ చేసినట్లుగా పరిశోదనల్లో తేలింది.
ఇక్కడి గుహల పేర్లు కూడా చిత్రంగా వుంటాయి.ఎదురు పాండవులు,పంచ పాండవులు,కుంతీదేవి లేదా గొంతెమ్మ గుహ,పందిపర్వత గుహ, శక్తి పర్వత గుహ అని పలురకాల గుహలు ఉన్నాయి.వీటన్నింటిలోనూ వర్ణచిత్రాలు వున్నాయి. వీటిలో ఎదురు పాండవుల కొండగుహలో జింకలు,చేపలు,తాబేలు,కప్పు,చిలు క,సీతాకోక చిలుక,ఎలుగుబంటి,పెద్దపులి,ముళ్ ళపంది,నెమలి,బల్లి,కొండెంగ తదితర జంతువులతో పాటు,మానవాకృతుల రేఖాచిత్రాలు ఎరుపువర్ణంలో చిత్రీకరించి వున్నాయి.
ఇకపోతే పంచపాండవులు అనే కోడగుహ చాలా విశాలమైంది.ఇందులో పాండవుల వివాహ సన్నివేశాలు వున్నాయి. ఇక్కడ పంచపాండవులు,ద్రోపది,కుంతీ,ద్రు
దురదృ ష్టం ఏమిటీ అంటే ఇంతటి అమూల్యసంపదను పరిరక్షించే ప్రయత్నమేదీ జరగటం లేదు. కొందరు మూర్ఖులు ఆచిత్రాలమీద తమపేర్లు, ఇతర రాతలు రాస్తున్నారు. ప్రభుత్వం కొంచెం శ్రద్ధ తీసుకొని చుట్టూ గ్రిల్స్ వేసి వాటిని కాపాడితే భావితరాలకు ఉపయుక్తంగా ఉంటాయి.
ఇక ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే పర్యాటక కేంద్రంగా విరాజిల్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పాండవులు అరణ్య వాసం చేసిన సమయంలో ఇక్కడ విడిది చేయడంతో ఈ ప్రాంతానికి పాండవుల గుట్ట అనే పేరు వచ్చింది. ఈ పాండవుల గుట్ట వందల హెక్టార్లలో విస్తరించి ఉంది. గతంలో ఈ ప్రాంతాన్ని ఎమ్మెల్యేలు, అధికారులు సందర్శించి వెళ్లారు . ప్రభుత్వం కొంచెం శ్రద్ధ చూపితే ఈ గుట్ట చరిత్ర సుస్థిరంగా ఉండిపోతుంది. 90 వ దశకంలో ఈ గుట్టలను నక్సల్స్ స్థావరంగా మార్చుకున్నారు. తదనంతర కాలంలో పోలీసుల కూంబింగ్ , ఎన్కౌంటర్లు జరగడంతో నక్సల్స్ అక్కడనుంచి వెళ్లిపోయారు.
ఇప్పటికే భూపాల్ పల్లి జిల్లాలో లక్నవరం , రామప్ప , గణపురం సరస్సు ,బొగత జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. పాండవుల గుట్ట ప్రాంతాన్ని కూడా అభివృద్ధిపరిస్తే ఇదొక పెద్ద పర్యాటక కేంద్రం అవుతుంది.
—————— Sheik Sadiq Ali