Why didn’t she contest against PM Modi?………………………………
పై ఫొటోలో కనిపించే వ్యక్తి పేరు మహామండలేశ్వర్ హేమంగి సఖి మాత.. జనాల్లో కొంత గుర్తింపు పొందిన ట్రాన్స్‌జెండర్.. ఆమె ట్రాన్స్‌జెండర్ మాత్రమే కాకుండా శ్రీకృష్ణుడి భక్తురాలు.. గుజరాత్‌లోని వడోదర లో ఈ హేమాంగి సఖి మాత జన్మించారు. చిన్నప్పటి పేరు హేమంత్ .. తర్వాత కాలంలో పేరు మార్చుకున్నారు.హేమాంగి సఖి మాత తండ్రి ఒక సినిమా డిస్ట్రిబ్యూటర్.. నటుడు రాజకపూర్ తో ఉన్న పరిచయాల కారణంగా వారి కుటుంబం ముంబైకి వలస వెళ్లింది.
ఇక హేమాంగి సఖి మాత ముంబై లో ఉండగానే ట్రాన్స్‌జెండర్ గా మారారు. ముంబయిలోని తన ఇంటికి సమీపంలో ఉన్న ఇస్కాన్ ఆలయానికి రోజు వెళ్లేవారు.తర్వాత మధుర లోని బృందావనం లో కొన్నాళ్ళు కృష్ణుని సేవలో గడిపారు. భగవద్గీతను అనర్గళంగా బోధించగలిగే తొలి ట్రాన్స్‌జెండర్ కథకురాలిగా హేమాంగి సఖి మాత ఖ్యాతిని సంపాదించారు.
కొంత కాలంగా నాగ సాధువుల జీవన శైలి పట్ల ఆకర్షితులై హిజ్రాలు కూడా దీక్షలు చేపట్టి సాధువులుగా మారుతున్నారు, వీరంతా ఒక ప్రత్యేకంగా ఒక అకడా [సంఘం] ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. గుర్తింపు కోసం పోరాటం చేస్తున్నారు. అలాంటి ఒక సంఘంలో హేమాంగి సఖి చేరారు.. 2019 లో ఆ సంఘం ఆచార్య మహామండలేశ్వర్‌గా హేమాంగి సఖి ని నియమించారు. ఆమెను అఖిల భారతీయ సాధు సమాజ్ భగవత్భూషణ్ మహామండలేశ్వర్ బిరుదుతో సత్కరించింది. ఉత్తర గోదావరి ధామ్‌లోని ఆద్య శంకర్ కైలాష్ పీఠం ఆమెకు ఆచార్య మహామండలేశ్వర్ బిరుదును ప్రదానం చేసింది.
నిర్మోహి అకడా కు చెందిన కిన్నార్ మహామండలేశ్వర్ హేమాంగి సఖీ పేరు సడన్ గా వార్తల్లో కనిపించింది. వారణాసి నుంచి లోక్‌సభ ఎన్నికల్లో సఖీ పోటీ చేస్తుందని అఖిల భారత హిందూ మహాసభ యూపీ యూనిట్ ప్రకటించింది. దీంతో మీడియా ఆమెను బాగా హైలెట్ చేసింది. ప్రధాని మోడీపై ట్రాన్స్‌జెండర్ పై అంటూ కథనాలు వెలువడ్డాయి.
అఖిల భారత హిందూ మహాసభ బీజీపీ భావజాలానికి దగ్గరగా పనిచేసే సంస్థ. ఈ క్రమంలో తెర వెనుక ఏమి జరిగిందో ఏమో కానీ అఖిల భారత హిందూ మహాసభ హేమాంగి సఖీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించింది. అదే సమయంలో ట్రాన్స్‌జెండర్ అకడా లలో కూడా సఖీ పోటీ చేయడం పై వ్యతిరేకత వచ్చింది.. సఖీ కి కిన్నర సంఘానికి చెందిన సభ్యులు పెద్ద సంఖ్యలో జిల్లా కేంద్రం కొచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఆ విధంగా సఖీ ఎన్నికల్లో మోడీ పై పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయింది. ఇదంతా నామినేష్లల ప్రక్రియకు ముందే జరిగింది. కానీ ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున జరిగింది.
—–KNMURTHY