పుణ్య సన్నాఫ్ కఠారి నరసింహమూర్తి ……………………………………
పై ఫొటోలో కనబడేవారిని రాస్తాఫెరియన్లు అంటారు . చూడటానికి చిత్రంగా ఉన్నారు కదా . కానీ వీరు సామాన్యులు కాదు. అసలు ఎవరీ రాస్తాఫెరియన్లు ? ఎక్కడినుంచి వచ్చారు ? ఏం చేస్తుంటారు ? తెలుసుకోవాలంటే మొత్తం కథనం చదవాల్సిందే.
బ్రిటిష్ వాళ్ళ వలస పరిపాలనా కాలంలో వారి అధీనంలో ఉన్న అనేక ప్రాంతాలనుండి మనుష్యులను కరేబియన్ దీవులకు బానిసలుగా తరలించడం జరిగింది… కరీబియన్ దీవుల్లో ముఖ్యమైన దేశాలు ట్రినిడాడ్ అండ్ టొబాగో, బార్బడోస్, సెయింట్ లూసియా, అంటిగ్వా…బార్బుడా, జమైకా….వీటిని కరేబియన్ దీవులు అని ఎందుకు అంటారు అంటే ఈ దీవులన్నీ కూడా కరేబియన్ సముద్రం మధ్యలో ఉన్నాయి కాబట్టి…. మనకు తెలిసిన వెస్టిండీస్ జట్టు ఈ దీవుల సమాహారమే…..
ఆఫ్రికా దేశాల నుండి చాలామంది నల్లజాతి వారిని బానిసలుగా జమైకాకు తరలించడం జరిగింది…మిగిలిన దీవులకు ఆఫ్రికా నల్ల జాతి వారే కాకుండా భారతదేశానికి చెందినటువంటి మనుషులను కూడా బానిసలుగా అక్కడికి బ్రిటిష్ వాళ్ళు పంపించారు…అందుకే ఇప్పుడు మనం చూసినట్లయితే చాలా మంది భారత సంతతికి చెందిన వారు అక్కడ స్థిరపడడం జరిగింది.
ఇక జమైకా విషయానికొద్దాం. కాలక్రమంలో, జమైకాలో బానిసలుగా మగ్గిపోతున్న నల్లజాతి వారు తమ హక్కుల కోసం పోరాటం మొదలుపెట్టారు.. ఎన్నో ఉద్యమాలు చేశారు, ఎన్నో పోరాటాలు చేశారు… ఈ పోరాటాల పరంపరలో భాగంగా 1930వ దశకంలో #రాస్తాఫెరై అనే ఒక మతం రూపుదిద్దుకుంది…ఈ మతాన్ని అనుసరించే వాళ్ళని #రాస్తాఫెరియన్లు అంటారు.
అబ్రహమిక్ మత విశ్వాసాలను అనుసరించి ఏర్పడ్డ ముఖ్య మతాలు మూడు… ఇస్లాం, క్రైస్తవం, జుడాయిజం… #రాస్తాఫెరై మతాన్ని క్రైస్తవ మతానికి చెందినటువంటి ఒక ఉప మతంగా చెప్పుకోవచ్చు.ఈ రాస్తాఫెరియన్లు వాళ్ల మత విశ్వాసాల ప్రకారం తలమీద జుట్టు లేకుండా ఉండకూడదు. అందుకోసం వాళ్లు జుట్టుని బాగా ఎక్కువగా, అంటే జులపాలలాగా పెంచుకుంటారు… ఈ జులపాల జుట్టుని ఇంగ్లీషులో #Dreadlocks అని అంటారు.
#Dreadlock_Rasta అదే పదం అర్థం కావడం కోసం ఈ జుట్టు గురించి చెప్పాల్సి వచ్చింది…. తమ మత విశ్వాసాలను ప్రజల్లోకి చేరువుగా తీసుకువెళ్లడానికి, బానిసత్వ నిర్మూలనకు తాము సాగిస్తున్న పోరాటాలకు #రాస్తాఫెరియన్లు అభివృద్ధి చేసుకున్నటువంటి ఒక విధమైన సంగీత శైలే #రెగ్గే_మ్యూజిక్… ఈ సంగీతం గురించి పార్ట్ 2 లో తెలుసుకుందాం.