ఈ ప్రెగ్నెన్సీ టూరిజం ఏమిటో ?

Sharing is Caring...

కాలానుగుణంగా కొత్త విధానాలు పుట్టుకొస్తుంటాయి. కొన్నింటికి ఆమోదం ఉంటుంది. మరికొన్నింటికి ఉండదు . అలాంటిదే ఈ ప్రెగ్నెన్సీ టూరిజం కూడా. ఇప్పటివరకు మనం టెంపుల్ టూరిజం , మెడికల్ టూరిజం గురించే విన్నాం. ఈ ప్రెగ్నెన్సీ టూరిజం ఏమిటో చూద్దాం.

ప్రెగ్నెన్సి టూరిజం పేరే వింతగా ఉంది కదా..ఇది ఇపుడు  హిమాలయ పర్వత సానువుల్లోని లడాఖ్ లోవ్యాప్తిలోఉంది.అక్కడే ఎందుకు ఉందంటే అక్కడ బలమైన ఆర్యజాతి యువకులు ఉన్నారట. చరిత్రలో ఆర్యులకు  ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వారు అందం, ఆరోగ్యం, ధృడమైన శరీరం …. ఇలా అన్నింటిలో ఆర్యులు అగ్ర స్థానంలో ఉంటారు. అయితే కాలక్రమంలో ఇప్పుడా అసలైన ఆర్య సంతతి తగ్గిపోయింది.

కేవలం  బ్రోక్పా తెగలో మాత్రమే ఉన్నారని, వారు లడాఖ్ లోని ఓ నాలుగు గ్రామాలకు పరిమితమై ఉన్నారని పరిశోధకులు అంటున్నారు. దీంతో ఆ నాలుగు గ్రామాలలోని యువకులకు డిమాండ్ పెరిగింది. విదేశీ వనితలు వీరి ద్వారా సంతానం కోరుకుంటున్నారు. వచ్చి వెళుతున్నారు.

ల‌ఢాక్‌లోని దాహ్‌, హ‌నో, దార్చిక్‌, గార్కోన్ గ్రామాల్లో ఈ బ్రోక్పా తెగ వాసులు ఎక్కువగా నివ‌సిస్తున్నారు. ల‌ఢాక్‌లోని చాలా మంది టిబెటో-మంగోల్ లుక్‌తో క‌నిపిస్తారు. కానీ ఈ బ్రోక్పా పురుషుల్లోమాత్రం ఇండో-ఆర్య‌న్ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.  విదేశీ వనితలు ఇక్కడ కొచ్చి వారితో అగ్రిమెంట్ కుదుర్చుకుని వారి కోరిక నెరవేర్చుకుంటున్నారని అంటున్నారు.

అందువల్లనే  సింధు నదీ పరీవాహక ప్రాంతం లోని ఆ నాలుగు గ్రామాలు… ప్రస్తుతం విదేశీ వనితలతో కోలాహలంగా మారాయని చెబుతున్నారు. జ‌ర్మ‌నీ, ఫ్రాన్స్‌, స్పెయిన్‌లాంటి దేశాల నుంచి ప్ర‌తి ఏటా ల‌ఢాక్‌కు వ‌స్తున్న వాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.అయితే ఇది విపరీతధోరణి అనే విమర్శలు కూడా లేకపోలేదు. దీన్నే పెయిడ్ ప్రెగ్నన్సీ అంటారు. 

పెళ్లి చేసుకోవడం వేరు … పిల్లలను కనడం వేరు. ఇక్కడ మొదటిది లేకుండా రెండోది జరుగుతోందనే అంటున్నారు. ఇది భారతీయ సంప్రదాయాలకు విరుధ్ధం కూడా. ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలియాల్సి ఉంది. ప్రభుత్వం నిజంగా అక్కడ ఈ ప్రెగ్నెన్సీ టూరిజం ను ప్రోత్సహిస్తున్నదా ? లేదా అనేది కూడా ప్రపంచానికి తెలీదు.

కొంతమంది జర్నలిస్టులు అక్కడకు వెళ్ళినపుడు టూరిజం అంటూ ఏమిలేదని … అపుడపుడు విదేశివనితలు వస్తున్నారని అక్కడి కమ్యూనిటీ పెద్దలు చెప్పారట.  ఏదైనా పూర్తి వివరాలు బహిర్గతం కావాల్సి ఉంది.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!