There is a reason for every action…………………………
అమెరికాలోని కాలిఫోర్నియా కు దగ్గర్లో ఒక పెద్ద లోయ ఉంది. ఈ లోయలో ఒకప్పుడు విశాలమైన సరస్సు ఉండేది. కాలక్రమంలో అది ఎండిపోయింది. ఒట్టి లోయ మాత్రమే మిగిలింది. ఆత్మహత్యలు చేసుకోవాలనుకునే విఫల ప్రేమికులు ఆ లోయ వద్దకు వెళ్లి దూకి చనిపోయేవారు. దీంతో ఆ లోయకు ‘డెత్ వ్యాలీ’ అనే పేరు వచ్చింది.
ఈ ప్రాంతంలో మనుషుల, జంతువుల సంచారం బహు తక్కువ. ఈ లోయలో మిస్టరీ ఏమిటంటే బండ రాళ్లు వాటంతట అవే కదులుతూ ఉంటాయి. భూమిలోని ఒత్తిళ్ళ కారణంగానే ఇక్కడ బండ రాళ్ళు అలా కదులుతాయని అనుకుంటారు. కానీ ఇందులో నిజమెంతో ఎవరికి తెలీదు.
ఈ రాళ్ళ కదలికలపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ రాళ్ళ కదలికలపై శాస్త్రవేత్తలు ఎన్నో సిద్ధాంతాల ప్రకారం వివరణలు ఇచ్చారు.అయితే అవేవి నమ్మే విధంగా లేవు. ఏదో మిస్టరీ దాగి ఉందని అంటారే కానీ పరిశోధకులు ఎవరూ అసలు రహస్యాన్ని చేధించలేకపోయారు.
ఈ రాళ్ళు ఎవరూ చూడని సమయంలోనే కదులుతూ ఉంటాయని అంటారు. ఇలా రాళ్ళు కదిలే ప్రాంతాన్ని “రేస్ ట్రాక్ ప్లాయా” అని అంటారు..ఇది పొడిగా ఉండే ప్రాంతం.. రాళ్లు కదిలిన చారలు కూడా నేలపై కనిపిస్తాయి.ఈ ప్రదేశంలో ఉన్న అన్నీ రాళ్ళు కదలవు. కొన్ని రాళ్ళు మాత్రమే కదులుతుంటాయి.
అది కూడా రెండు మూడు ఏళ్ళకు ఓ సారి మాత్రమే ఆ రాళ్ళు కదులుతాయట. అయితే అన్నీ ఒకే దిశగా కదలడం లేదని… ఒక తెలియని శక్తి .. లేదా అయస్కాంత ప్రభావంతో ఈ రాళ్ళు కదులుతున్నాయని చెబుతుంటారు. ఈ నమ్మలేని నిజం గురించి పలు సిద్ధాంతాలు ప్రచారం లోకి వచ్చాయి.
ఈ మృత్యు లోయలో రాళ్ళు కదలడానికి కారణం..బలమైన గాలులు వీచడం అని కూడా అంటారు. అయితే అలా వీచిన గాలులకు అన్ని రాళ్లు కదలవు. అదే చిత్రం.. మిస్టరీ. ఈ రాళ్ళ కదలిక గాలి, ఉష్ణోగ్రతల చర్యల కారణంగా జరుగుతున్నదని భూగర్భశాస్త్ర పరిశోధకులు చెబుతున్నారు.
ఈ లోయలో రాళ్ళుకదిలే సందర్భంగా నేల మీద రాయి కదలిన గీతలు పడుతున్నాయి. కొన్ని పెద్ద బండ రాళ్ళు వందల అడుగులకు పైగా కదులుతున్నాయని కూడా గుర్తించారు. కొన్ని గాలులు ఉపరితలం మీదుగా వెళుతూ రాళ్ళను ముందుకు నెడతాయని… అవి కదలినపుడు గీతలు పడతాయని .. ఇంతకు మించి రహస్యం ఏమీ లేదని స్క్రిప్స్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఓషనోగ్రఫీ, నాసా పరిశోధకుల బృందం తేల్చిపడేసింది.