కల్కి కి అశ్వత్థామకు లింక్ ఏమిటి ?

Sharing is Caring...

Science fiction movie……………………

ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ అశ్వత్థామగా కనిపించనున్నట్లు వచ్చిన వార్తలు ఫోటోలు  పెద్ద సంచలనమే సృష్టించాయి. ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న  సైన్స్‌ ఫిక్షన్‌  ‘కల్కి 2898 ఏడీ మూవీకి విపరీతమైన పబ్లిసిటీ తెచ్చిపెట్టాయి. ఈ క్రమంలోనే  ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా ఏర్పడుతున్నాయి.

యంగ్ జనరేషన్ లో చాలామందికి అశ్వత్థామ గురించి అంతగా తెలియదు. దీంతో గూగుల్ సెర్చ్ చేస్తున్నారు. శ్రీకృష్ణుడు అశ్వత్థామ కు  ఇచ్చిన శాపం ఏంటి? ఎందుకు ఇచ్చాడు ? నిజంగా అశ్వత్థామ ఇంకా బతికే ఉన్నాడా ? యూపీ లో కొందరికి కనిపించిన అసాధారణ వ్యక్తి  అశ్వత్థామేనా ?  అన్న విషయాలు ఆసక్తికరంగా మారాయి. 

ఇవన్నీ చాలామందికి తెలియని విషయాలు.. కల్కి కి అశ్వత్థామ కు లింక్ ఏమిటి ?అసలు సినిమాలో ఏం చూపించబోతున్నారు అనేది పెద్ద సస్పెన్స్ గా మారింది.  మహాభారతంలో  కీలక పాత్ర అశ్వత్థామ. సప్త చిరంజీవుల్లో అశ్వత్థామ ఒకరని అంటారు. మిగిలిన వారిలో  బలిచక్రవర్తి, వ్యాస మహర్షి, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు ఉన్నారు.

వీరి గురించి పలు కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. వీరంతా కల్కి అవతారం కోసం ఎదురు చూస్తున్నారని చెబుతారు. కల్కి దర్శనంతో అశ్వత్థామ శాపవిమోచనుడిగా మారిపోతాడా ?బహుశా అదే లైన్ లో ఈ కథ నడవొచ్చు అనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇందులో సైన్స్ ఫిక్షన్ ను ఎలా జొప్పిస్తారు ? 

600 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను  వైజయంతీ మూవీస్‌ అశ్వనీదత్ తీస్తున్నారు.. కమల్ హాసన్  దీపికా పదుకొణె, దిశా పటానీ, రాజేంద్రప్రసాద్‌ వంటి నటులు  కీలక పాత్రలు పోషిస్తున్నారని సమాచారం. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నారంటే అంత ఆషామాషీ సినిమా కాదనే చెప్పుకోవాలి. తెరవెనుక ఆయనకు చాలామంది సహాయపడుతున్నారని టాక్ కూడా నడుస్తోంది. మొత్తం మీద చూస్తుంటే ప్రభాస్ కెరీర్ లో ఇదొక సెన్సషనల్ మూవీ అవుతుందేమో ??
 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!