ఆఇద్దరు ఇన్సులిన్ కనుగొనకపోతే ?

Sharing is Caring...

సుదర్శన్ టి………………….. 

అది .. జూలై 28, 1922…  ఇద్దరు వైద్య సైంటిస్టులు కెనడా టొరంటోలోని Hospital for Sick Children, డయాబెటిస్ వార్డుకు వచ్చారు.వారు కొత్తగా శాస్త్రీయ పద్ధతిలో తయారు చేసిన హార్మోన్ ను పేషంట్లకు సూదిమందుగా వెయ్యడానికి వచ్చారు. ఈ హార్మోన్ ను పేషెంట్లకు వెయ్యడం చరిత్రలో ఇదే మొదటిసారి.

పేషంట్లు అందరూ చిన్న పిల్లలే, శరీరంలో షుగర్ శాతం విపరీతంగా పెరిగి కోమాలో ఉన్నారు. ఏ వైద్యమూ పనిచేయడం లేదు. పిల్లల పేరెంట్స్ తమ పిల్లల్ని ఇక్కడ అడ్మిట్ చెయ్యడం తమ కళ్ల ముందే పిల్లలు చనిపోవడం వారి శవాలను మోసుకెళ్ళడం మాత్రమే జరుగుతోంది. పిల్లలు కోమా నుండి బయటకు రావడం లేదు.

ఈ ఇద్దరు సైంటిస్టులు సూది మందు వేయడం ప్రారంభించారు. అలా వేసుకుంటూ చివరి పేషంట్ వద్దకు వచ్చేటప్పటికి సూది మందు వేసిన మొదటి పాపలో చలనం వచ్చింది అలా ఒక్కో పాప/బాబు లో చలనం మొదలయ్యింది. అంతవరకూ నిరాశ, నిస్పృహ, మౌన రోదన మాత్రమే ఎరిగిన ఆ వార్డులో ఒక్కసారిగా ఆనందం, సంతోషం, కేరింతలతో వాతావరణం హోరెత్తింది.

ఆ ఇద్దరు సైంటిస్టులే Sir Fredrick Banting, Charles Best. వీరు తయారుచేసిన ఆ సూది మందు పేరే ఇన్సులిన్ హార్మోన్. ఇన్సులిన్ లేని ఈ ప్రపంచం ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకుంటే గుండె జల్లు మంటుంది. మానవాళి ఎన్నటికీ వీరిద్దరికీ రుణపడి ఉంటుంది

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!