ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (NATO) సభ్యత్వాన్ని కోరబోమని ప్రకటించి రష్యా డిమాండ్ కు తల ఒగ్గి ..చేతులెత్తేశారు. వార్ హీరోగా గుర్తింపు పొంది ఇపుడు జీరో గా మిగిలిపోయారా ?
కొద్ది రోజుల క్రితం, ఉక్రెయిన్ తనను తాను రక్షించుకునేంత సామర్థ్యాన్ని కలిగి ఉందని జెలెన్స్కీ ప్రకటించాడు. తుది శ్వాస వరకు రష్యా తో రాజీపడబోమని, వెనక్కి తగ్గబోమని, తలవంచమని బీరాలు పోయారు. మరి సడన్ గా ఏమైందో ఏమో రష్యా డిమాండ్ కు అనుకూలంగా ప్రకటన చేశాడు. ఇంత మార్పుకు కారణమేమిటి ?
నిజంగా యుద్ధం నేపథ్యంలో జరిగిన ప్రాణ నష్టానికి కలవరపడ్డారా ? శ్మశాన వైరాగ్యం కలిగిందా ? ఆయనకే ప్రాణ భయం ఏర్పడిందా ? అమెరికా, నాటో లు,ఇతర దేశాలు సహకరించవని లేటుగా తెలుసుకున్నారా ? తనను తాను శక్తికి మించి ఎక్కువగా అంచనా వేసుకున్నారా ? లేక ఇది మరో ఎత్తుగడా ? అసలు ఏమి సాధించాలనుకున్నారు ? ఏమి సాధించారు ??
అపార నష్టం జరిగాక.. వందలమంది ప్రాణాలు కోల్పోయాయక కానీ రష్యన్ దళాలను ఓడించడం కష్టమని … ఒంటరి పోరాటం చేయలేమని గ్రహించారా ? లక్షలమంది వలసలు పోయాక వాస్తవాలు తలకెక్కాయా ? సైనిక బలంలో లో రష్యాకు ఉక్రెయిన్ ఏ మాత్రం సరిపోదనే వాస్తవాన్ని లేటుగా తెలుసుకున్నారా ? ఇవన్నీ భేతాళ ప్రశ్నలు. వీటికి జవాబులు ఉండవు.
రష్యా రాజధాని నగరమైన కీవ్ ను నిర్బంధించిన క్రమంలో లొంగిపోవటం కంటే మించిన మార్గం లేదని జెలెన్స్కీ ఒక నిర్ణయానికి వచ్చేసారా ? చూడ బోతే అలానే ఉందని విశ్లేషకులు అంటున్నారు.
రష్యా అనుకూల ప్రాంతాల హోదాపై రాజీ పడేందుకు సిద్ధమేనని జెలెన్ స్కీ అంగీకరించడం మరో విశేషం.
ఒక నాయకుడిగా రష్యా బలాన్ని అంచనా వేయలేకపోవడం, ఎడా పెడా స్టేట్మెంట్ లు ఇవ్వడం, పుతిన్ ను రెచ్చగొట్టేలా మాట్లాడటం ఇవన్నీ దాడులకు కారణమయ్యాయి. ముందే తెలివైన నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేది.
ఇప్పటికైనా .. యుద్ధ కాంక్షను వీడటం మంచిదే. లొంగుబాటు ప్రజలకు మేలు చేసేదే. బంకర్లలో దాగిన మిగిలిన ప్రజలు హాయిగా ఊపిరి పీలుస్తారు. ఏది ఏమైనా తెలివి తక్కువ అధ్యక్షుడిగా ఆయన చరిత్ర కెక్కడం ఖాయమనే విమర్శలు వినబడుతున్నాయి.