ఒకే రైలు ప్రయాణంలో 3 దేశాలు చూడాలనుకుంటున్నారా ?

Sharing is Caring...


The Longest Journey……….

మీకు రైలు ప్రయాణం అంటే ఇష్టమా .. ముఖ్యంగా రైలులో వెళ్లేటపుడు ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకుంటున్నారా  ? అయితే ఈ స్పెషల్ ట్రైన్ నచ్చుతుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు ప్రయాణం. ప్రత్యేకత ఏమిటంటే ఈ రైలు మూడు దేశాలను కవర్ చేస్తుంది. ట్రాన్స్-సైబీరియన్ రైల్వే నెట్‌వర్క్‌గా పిలువబడే ఈ రైలు 3 దేశాలకు ప్రయాణిస్తుంది. మొత్తం 10,214 కి.మీ. ఈ రైలు రష్యా రాజధాని మాస్కో నుండి తూర్పు నగరమైన వ్లాడివోస్టాక్‌కు వెళుతుంది.

ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రైలు ప్రయాణంగా పేరుగాంచింది. ఎందుకంటే ఇంత సుదీర్ఘ ప్రయాణం ఏ దేశంలోనూ రైలులో చేయలేము. ఈ సుదీర్ఘ రైలు ప్రయాణానికి 7 రోజుల 20 గంటల 25 నిమిషాల సమయం పడుతుంది.. ఓపికగా కూర్చోవాలి మరి.

ఇక ఈ రైలు మాస్కో – వ్లాడివోస్టాక్, మాస్కో – ఉలాన్‌బాతర్, మాస్కో బీజింగ్‌తో సహా 3 దేశాల గుండా వెళుతుంది. దీని మార్గంలో 18 స్టేషన్లు ఉన్నాయి. అందులో ప్రయాణిస్తున్నప్పుడు ఎక్కడ దిగాలనేది ముందుగా నిర్ణయించుకోవాలి. తర్వాత రూట్ ప్రకారం వీసా తీసుకోవాలి.

మీరు రష్యా నుండి మీ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్టయితే.. మీరు చైనాకు వెళ్లాలనుకుంటే దీని కోసం మీరు రష్యా, చైనా కోసం వీసా  తీసుకోవాలి.   అలాగే, టిక్కెట్లను మాస్కో రైల్వే స్టేషన్‌లో లేదా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. మాస్కో నుండి వ్లాడివోస్టాక్ వరకు మూడు రకాల టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి.

ఫస్ట్ క్లాస్ రైలు ధర 175 డాలర్లు అంటే భారతీయులకు రూ. 13,982. దీని తరువాత, మరొక రూట్ టిక్కెట్ ధర $ 213 అంటే రూ. 17018. అలాగే, రైలులో మీరు ఎయిర్ కండిషనింగ్, రెస్టారెంట్, బెడ్, బార్, సీటులో సౌండ్ సిస్టమ్ మొదలైన సదుపాయాలు పొందుతారు. ఒక ప్రైవేట్ లగ్జరీ గది కూడా అందుబాటులో ఉంది.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!