Mani Bhushan …………………..
75 ఏళ్ల వయసు-50 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ .. రెండిటినీ balance చేసుకోవడం, ఇప్పటికీ Crowd pullerగా కొనసాగడం చిన్న విషయం కాదు! తన కొత్త ప్రాజెక్ట్ రావడానికి ముందు వార్తల్లో ఉండేలా చూసుకుంటాడు రజనీకాంత్.
గతంలో అభిమానులతో ఓ మూడ్రోజులపాటు ‘selfie mela’ జరిపేవాడు.ఈసారి ‘కూలీ’ రాబోతోంది. ఈ వారం పది రోజుల్లో ‘కూలీ’కి ఓటిటిలో 120 కోట్లు, తెలుగు డబ్బింగ్ థియేటర్ రైట్స్ 50 కోట్ల వరకు గిట్టుబాటయిందట!
సరే, కారణం ఏదయితేనేం రజనీకాంత్ ఎప్పుడో 30 ఏళ్ల నాటి -బాషా రోజులనాటి- వివాదాన్ని బయటకు తెచ్చి, socio political entertainment రిలీజ్ చేశారు.అదేమిటంటే …
తన నిర్మాత ఆర్.ఎం.వీరప్పన్ తన comment వల్ల మంత్రి పదవి పోగొట్టుకున్నాడని, తాను సిఎం జయలలితతో మాటాడి పోస్ట్ ఇప్పిస్తానన్నా.. ఆర్.ఎం.వి. వద్దన్నారని చెప్పుకొచ్చారు. ఈ మాటలు చాలు, రజనిలో వ్యాపారానికి!
రజనీ ప్రమోషన్ ఎత్తుగడలో భాగంగా అన్నారు. కానీ వాస్తవంలో వీరప్పనుకి మాట సాయం చేసే సత్తా రజనీకి లేదు.. అతని సిఫారసుతో జయలలితకు పని లేదు. ఆమెకు స్పష్టంగా వీరప్పన్ గురించి తెలుసు. ఆర్.ఎం.వీరప్పన్ ఆషామాషీ వ్యక్తి కాదు. అతణ్ణి తమిళ్ రాజకీయాల్లో, సినీ పరిశ్రమలో చాణక్యుడిగా గుర్తించేవారు.
మన దగ్గర నాగిరెడ్డి-–చక్రపాణి జంటని కలిపితే వీరప్పన్! రజనీకాంత్ ఎంట్రీకి, స్టార్ సూపర్ స్టార్ స్టేటసుకి వీరప్పన్ ప్రత్యక్ష పరోక్ష సహకారాలున్నాయి. ఆర్.ఎం.వీ. గొప్ప ఆర్గనైజర్. తమిళ రాజకీయవేత్త, కేవలం నాయకుడు కాదు, కింగ్ మేకర్.
@తందై పెరియార్ నీడలో ద్రవిడ సామాజిక రాజకీయాల్లో అవగాహనతో పెరిగారు ఆర్.ఏం.వీ.
పెరియార్ శిష్యులు అన్నాదురైతోపాటు ద్రవిడ కళగంలో పనిచేశారు.@ రజనీకాంత్‌కి వరుస హిట్లిచ్చిన ఎస్.పి.ముత్తురామన్ ఆయన శిష్యుడే. ముత్తు తండ్రి సుబ్బయ్యకి చెందిన నాటక సమాజం నిర్వహించేవారు ఆర్.ఏం.వీ.
@ స్వయంగా వీరప్పన్ కథా రచయిత, స్క్రిప్ట్ రైటర్. MGR అజెండాగా చెప్పుకునే నాడోడి మన్నన్, రిక్షాకారన్ సినిమాలకు ఆర్.ఎం.వీ.నే Story Script Screenplay అందించారు. @ అయినా కూడా టాలెంట్ ఎక్కడున్నా సినిమాల్లోకి తెచ్చేవారు.
@ఉద్యోగం చేసుకుంటూ నాటకాలు రాస్తున్న కె.బాలచందర్… వీరప్పన్ ప్రోత్సాహ సహకారాలతోనే సినీ రంగ ప్రవేశం చేశారు. బాలచందర్ శిష్యుల్లో ఒకడు రజనీకాంత్.@ తమిళ రాజకీయాల్లో DMK, ADMKల ఆవిర్భావం వెనుక వీరప్పన్ ఉన్నారు.
@పెరియారుతో విభేదించి అన్నాదురై DMK పెట్టినపుడు కరుణానిధి, ఎస్.ఎస్.రాజేంద్రన్, ఎం.జి.ఆర్ తదితరులను పార్టీలోకి లాక్కొచ్చారు వీరప్పన్.@కరుణానిధితో విభేదించి అన్నాడిఎంకె పెట్టేలా ఎం.జి.ఆర్.ని గట్టిగా ప్రోత్సహించిన ఇద్దరిలో వీరప్పన్ ఒకరు. రెండోవారు ఎస్.ఎస్.రాజేంద్రన్.
@ఆర్.ఎం.వీ గొప్ప ఆర్గనైజర్ కావడం వల్ల ఎంజీఆర్ తన సొంత సంస్థలు Em.Gee.Ar.films, Satya moviesలను అప్పగించారు.@తుదికంటా MGR అనుయాయిగానే ఉన్నారు. ఈగోయిస్టులను, యారోగెంట్లని, పెత్తందారీల్ని వీరప్పన్ Cut చేసేసేవారు. కరుణానిధితో విబేధానికి, జయను దూరం పెట్టడానికి అదే కారణం.
@భానుమతిని సైతం ఓ సినిమా సగంలో ఉండగా కాశీకో .. కాటికో పంపేసి ఆమె పాత్రని అర్ధాంతరం గా ముగించేశారు వీరప్పన్! ఎం.జి.ఆర్–-జయలలిత ను కాంబినేషన్ break చేసింది కూడా వీరప్పనే. రిక్షాకారన్ సినిమాకి జయను తీసుకోవాలని MGR పట్టుబడితే… ‘ఇప్పటికే మీ కాంబీ ఎక్కువైంది. జనానికి మొహం మొత్తేలా ఉంది. ఈసారి కొత్త మొహం చూపిస్తా’ అని మంజులని తీసుకున్నారు.
@ఉలగం సుట్రుమ్ వాలిబన్ (లోకం చుట్టిన వీరుడు)లో లత–-మంజుల–-చంద్రకళ నటించారు. వీళ్లు ముగ్గురూ అన్నాడిఎంకె propaganda secretaryలుగా పనిచేసి పార్టీని జనంలోకి తీసుకెళ్లారు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే …. ఎంజీఆర్ మరణం తర్వాత అన్నాడిఎంకెలో అంతర్గత పోరు తలెత్తితే జానకి పక్షంలో చేరి, 1988లో రోజుకి ₹70-80 వేలతో 5 star camps నడిపారు. జయలలితని ఒంటరి చేశారు.
@మూపనార్ హడావుడి మేళంవల్ల జయకు వ్యవధి దొరికింది. పార్టీలో పట్టు సాధించేశారు. విడి పోయి–పడిపోయాం అని గ్రహించి అన్నాడిఎంకె రెండు వర్గాలు ఒకటయ్యాయి. వీరప్పన్ మళ్లీ పార్టీ ఆర్గనైజర్ అయ్యారు.
@అలాగని, వీరప్పన్ని జయ క్షమించలేదు, నమ్మలేదు. పాత గాయాలు పచ్చిగానే ఉన్నాయి.
ఇంత జరిగినా వీరప్పన్ని ఎందుకు కంటిన్యూ చేశారంటే… ఎంజిఆర్ గల్లాపెట్టె వీరప్పన్.
ఎంజిఆర్ ఆర్థిక లావాదేవీలు, గుట్టుమట్లు, పార్టీ ఫండింగ్ వంటివన్నీ వీరప్పన్ మునివేళ్ల మీద ఉండేవి.
@జయ ఎందుకు తనను కంటిన్యూ చేస్తోందో వీరప్పన్కి స్పష్టంగా తెలుసు. ఎక్కడా జయను గురించి పల్లెత్తు మాట అనలేదు. ప్రభుత్వానికి వెన్నుపోటు పొడిచే పని పెట్టుకోలేదు.
@ రజనీకాంత్ ‘బాషా’ వంద రోజుల వేడుకలో చేసిన ఒక లూజ్ కామెంట్‌ని వంకగా తీసుకుని, జయ గట్టిగా క్లాస్ తీసుకునేసరికి, వీరప్పన్కి క్లైమాక్స్ అర్థమై బయటకు వచ్చేశారు.దాదాపు 12 ఏళ్లపాటు పాలిటిక్స్ జోలికి వెళ్లకుండా చివరలో ‘ఎంజిఆర్ కళగం’ అనే పార్టీ పెట్టి పాత మిత్రుడు కరుణానిధికి మద్దతు ఇచ్చారు.
@2004 లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాట మొత్తం 39 సీట్లను డిఎంకె స్వీప్ చేసేసింది. నూటికి నూరు శాతం విక్టరీ అది. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో కరుణానిధి గెలిచి, ప్రభుత్వం ఏర్పాటుకు వీరప్పన్ పరోక్ష సహాయం లభించింది.ఇదీ వీరప్పన్ గురించి క్లుప్తంగా చెప్పుకోవాలంటే..