ఇక దూసుకుపోనున్న మానవ రహిత విమానాలు !

Sharing is Caring...

Unmanned aerial vehicle……………………………………

మానవ రహిత యుద్ధ విమానం తయారీ దిశగా రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) గొప్ప విజయం సాధించింది. అటానమస్ ఫ్లయింగ్ వింగ్ టెక్నాలజీ డిమాన్‌స్ట్రేటర్‌ను  కర్ణాటక లోని చిత్రదుర్గ్ ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి విజయవంతంగా పరీక్షించింది. మానవ రహిత గగనతల వాహనానికి ప్రోగ్రాం సెట్ చేసి వదిలితే తన పని తాను చేసుకుపోతుంది.  

అటానమస్ ఫ్లయింగ్ వింగ్ టెక్నాలజీ డిమాన్‌స్ట్రేటర్‌ను పరీక్షించడం ఇదే తొలిసారి. ఈ విమానం పూర్తిగా తనంతట తాను పని చేస్తుంది. ఈ ట్రయిల్ రన్ లో  బయల్దేరడం దగ్గర నుంచి వే పాయింట్  నేవిగేషన్, తిరిగి క్రిందకు దిగడం వరకు కచ్చితమైన పనితీరును  ప్రదర్శించింది.

భవిష్యత్తులో మానవ రహిత విమానాల అభివృద్ధి దిశగా డీఆర్డీవో ఇక వేగంగా పనిచేయవచ్చు.  ముఖ్యమైన సాంకేతిక పరిజ్ఞానం పని తీరు విషయంలో ఈ పరీక్ష గొప్ప మైలురాయి.  ఇటువంటి వ్యూహాత్మక రక్షణ సాంకేతిక పరిజ్ఞానం విషయంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా ఓ ముఖ్యమైన ముందడుగు పడిందని భావించాలి. 

ఈ యూఏవీ (మానవ రహిత గగనతల వాహనం)ను బెంగళూరులోని డీఆర్‌డీవోకు చెందిన ప్రముఖ పరిశోధక ప్రయోగశాల ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఏడీఈ) డిజైన్ చేసి అభివృద్ధి చేసింది. దీనికి చిన్న, టర్బోఫ్యాన్ ఇంజిన్‌ను అమర్చారు.

దీనికి అమర్చిన ఎయిర్‌ఫ్రేమ్, అండర్ క్యారేజ్, ఫ్లయిట్ కంట్రోల్స్, ఏవియానిక్స్ సిస్టమ్‌లను మన దేశంలోనే  తయారు చేశారు.  గతంలో మానవరహిత విమానాలు  రూపొందించడం కష్టం గా ఉండేది.సాంకేతికత  వేగంగా అభివృద్ధి చెందిన నేపథ్యంలో ..  అవి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించబడుతున్నాయి ఈ విమానాల తయారీ బహుళ-బిలియన్ డాలర్ల పరిశ్రమ గా ఎదిగింది.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!