“ట్రంప్ మళ్ళీ గెలుస్తాడట” జ్యోతిష్యుల భవిష్యవాణి !

Sharing is Caring...
జ్యోతిష్య “శాస్త్రజ్ఞులు ” ట్రంప్ మళ్ళీ గెలుస్తాడని చెబుతున్నారు. భవిష్యవాణి వినిపిస్తున్నారు.కోట్లాది మంది అమెరికన్ల మదిలో ఏముందో వారు తేల్చి పడేసారు!ఈ “శాస్త్రజ్ఞుల”కు భూత,భవిష్యత్, వర్తమానాలు ఇట్టే తెలిసిపోతూ ఉంటాయి! ఏ ప్రపంచ పరిణామాన్నైనా ఊహించేయగలరు!యుద్ధాలు, విపత్తులు,ప్రకృతి వైపరీత్యాలనుదేశాది నేతల మదిలో ఏ ముందో! వారి తరువాతి అడుగు ఏమిటో ?
అది సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో! చిటికెలో గ్రహించేయగలరు! వారు.దాన్ని తాము ఎప్పుడో చెప్పేశామని ప్రకటించేస్తారు!కూడా.ఎంతైనా కాలజ్ఞానులు! కదా.తాము ప్రకటించిన భవిష్యత్ దర్శనాన్ని ప్రపంచమే గుర్తించలేదు! గ్రహించలేదు!అర్ధం చేసుకోలేదు! అని చెప్పి సమాజాన్ని భ్రమలో ముంచేస్తూ ఉంటారు. తమ ఊహల దుకాణాన్ని ఎల్లప్పుడూ తెరిచే ఉంచుతారు.
పాపం ఎన్నికల యంత్రాoగానికి వీరి ప్రతిభా విశేషాలు! తెలియవు. ఎన్నికల యంత్రాoగం, ప్రభుత్వ వ్యవస్థకు వీరి జ్ఞానాన్ని అర్ధం చేసుకొని ఉంటే వందల కోట్ల ప్రజాధనం ఎన్నికల కోసం ఖర్చు చేసే అవసరం ఉండేది కాదేమో కదా! ముందెన్నడూ లేనివిధంగా అబద్ధాలాడిన అధ్యక్షుల వారిని 230 సంవత్సరాల చరిత్రలోనే అమెరికన్లు చూసి ఉండరు.మూడున్నరేళ్ల కాలంలో 20 వేల అబడ్డాలాడిన ఉదాత్తమైన కారణ జన్ముడైనందుకు అమెరికన్లు ఎంతో గర్వించాలి కదా. 
ప్రతి మాటా వివాదమే కావాలి. ప్రపంచ పెద్దన్న కదా అందరికంటే అధికుడిగా ఉండాలి కాబోలు!అమెరికన్ జాతి గర్వించాలి!మురిసిపోవాలి! వారి తీరును చూసి ప్రపంచమంతా ముక్కున వేలేసుకోవాలి మరి!అందుకే మళ్లీ ఆయనే రావాలి మరి! అదే కదా జ్యోతిష్య శాస్త్రజ్ఞులు చెబుతున్నది. అదే అమెరికాకు,మొత్తం మానవ జాతికి గర్వకారణం మరి!
ఒక వైపు పైన చెప్పినట్టుగా ట్రంప్ అనుకూల వర్గాల జోస్యాలు అలా ఉంటే …… మరోవైపు డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ ప్రజాదరణలో ముందంజ లో ఉన్నారని పోల్ సర్వేలు చెబుతున్నాయి. కీలకమని భావిస్తున్న రాష్ట్రాల్లో బైడెన్ కు ప్రజల నుంచి మద్దతు లభిస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం బైడెన్ కి 87 శాతం ఓటర్ల మద్దతు  ఉందని అమెరికన్ వెబ్సైట్లు చెబుతున్నాయి. కాగా డెమొక్రాట్లు కూడా అంతర్గతంగా ఆందోళన పడుతున్నారు. నాలుగేళ్ళ కిందట హిల్లరీ క్లింటన్ కు కూడా ఇదే తరహాలో మద్దతు లభించింది . అంతా ఆమెదే విజయం అనుకున్నారు.
కానీ చివరిలో ఫలితం మారిపోయింది. మొత్తం మీద అమెరికా ఓటర్లు మనస్తత్వం ఎలా ఉంటుంది ? ఎవరి వైపు ఓటర్లు మొగ్గు చూపుతారో కొంత సస్పెన్సు గానే ఉంది.
చూద్దాం అమెరికా పండితుల జోస్యం ఎంతవరకు ఫలిస్తుందో ?
—————-   Goverdhan Gande
Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!