పై ఫొటోలో కనిపించే జంట చూడ ముచ్చటగా ఉంది కదా. కేవలం పొట్టిగా ఉన్నారు తప్పితే మరే లోపం ఆ ఇద్దరికీ లేదు. మొత్తం ప్రపంచంలోనే అతి పొట్టి వాళ్ళు ఈ ఇద్దరూ. బ్రెజిల్ కి చెందిన పాలో గాబ్రియేల్ వయసు 36 ఏళ్ళు. ఎత్తు 90.28 సెంటీమీటర్లు . కత్యుషియా లీషినో వయసు 33 ఏళ్ళు. ఎత్తు 91. 13 సెంటీమీటర్లు. 2006 లో వీరిద్దరూ ఒకరికొకరు సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యారు.ఇద్దరి ఎత్తులు దగ్గరగా ఉండటం .. అభిరుచులు కలవడంతో ముందు మంచి స్నేహితులయ్యారు. కొంతకాలం ఆన్లైన్ చాటింగ్ లో మాట్లాడుకునే వారు. అలా అలా ప్రేమలో పడిపోయారు.
2008 లో మొదటిసారిగా కల్సి ఒకరినొకరు చూసుకున్నారు. ఆ పై పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికొచ్చారు. కానీ అంత సులభంగా ఒకటి కాలేకపోయారు. తర్వాత పెద్ద వాళ్ళ అనుమతి తో 2016లో ముందడుగు వేశారు. లండన్ లోని గిన్నిస్ బుక్ రికార్డు హెడ్ ఆఫీస్ సమీపంలోని చర్చిలో పెళ్లిచేసుకున్నారు. తమ కలను సాకారం చేసుకున్నారు. కత్యుషియా లీషినో ఒక బ్యూటీ పార్లర్ నడుపుతున్నది. ప్రస్తుతానికి పిల్లలు వద్దనుకున్నారు. కిచెన్, ఫర్నిచర్ తదితరాలను వారికి అనుకూలంగా మార్చుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత పొట్టి జంటగా వీరు కొత్త రికార్డ్ నెలకొల్పారు. గిన్నిస్ బుక్ వారు ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఒక సర్టిఫికెట్ కూడా జారీ చేశారు. ప్రస్తుతం ఆ ఇద్దరు హ్యాపీగా కలసి జీవిస్తున్నారు. ఆ రికార్డు ను కూడా తర్వాత ఎవరూ అధిగమించలేదు.
VMRG on the path to success… now only in digital form ………………………….. మంచి ప్రయోజనాలకూ, మంచి ప్రయోగాలకూ మార్కెట్లో ఎప్పుడూ గుర్తింపు లభిస్తూనేవుంటుంది. ఆ కోవలోదే విఎమ్ఆర్జి ఇంటర్నేషనల్. … Read More
Ready for for election war.…………………… కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ముద్దుల కుమార్తె ప్రియాంక గాంధీ ఎన్నికల అరంగేట్రం పక్కా ప్రణాళిక ప్రకారం జరగబోతోంది. కొన్నాళ్ల క్రితమే ప్రియాంక రాజకీయాల్లోకి వచ్చినా … Read More
అవును నిజమే .. ఆ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. వయసుకు అతీతంగా స్నేహితులు. స్నేహానికి వయసు పరిమితులు లేవు కదా. ఇండియాలోనే అతి పెద్ద వ్యాపారవేత్త రతన్ టాటా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. … Read More