ఆ ముగ్గురి పోరాట ఫలితమే..సమాచార హక్కు !!

Sharing is Caring...

Madabhushi Sridhar…………………………….

ఈ క్రింద ఫొటోలో కనిపిస్తున్న వారెవరో  చాలా మందికి తెలియదు. ఈ  ముగ్గురి పోరాట ఫలితమే సమాచార హక్కు చట్టం – 2005 . వీరిలో మధ్యలో ఉన్న ఆవిడ శ్రీమతి అరుణారాయ్ IAS.  తను ఉధ్యోగ నిర్వహణలో పేదలకు, అణగారిన వర్గాలకు దక్కాల్సిన పథకాలు వారికి దక్కటల్లేదనే ఉద్ధేశ్యంతో తను ఉధ్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి, పేదల తరఫున తన గొంతు వినిపించడంలో ముందున్నారు.

ఎడమవైపు నుండి ఉన్న మొదటి వ్యక్తి శంకర్ సింగ్. వీరు దాదాపు 17 ఉధ్యోగాలను తృణ ప్రాయంగా వదిలేసిన వ్యక్తి.కుడివైపు నుండి ఉన్న మొదటి వ్యక్తి నిఖిల్ డే. వీరు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళి గ్రామీణులకు స్వదేశంలో జరుగుచున్న అన్యాయాలపై నినదించాలనే తపనతో విదేశీ విద్యకు స్వస్తిచెప్పి వచ్చిన వ్యక్తి.

పై ముగ్గురూ కలసి రాజస్థాన్ లోని దేవదుంగ్రి గ్రామంలో 1987 మేడే నాడు మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్  అనే సంస్థ ప్రారంభించి సాగించిన ఉధ్యమ పలితమే సమాచార హక్కు చట్టం.మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ సంస్థ ప్రజలహక్కుల కోసం పెద్ద ఎత్తున పోరాడింది హక్కుల కోసం పెద్ద ఎత్తున పోరాడింది.

ఆ సంస్థ పోరాటాలు ప్రజల సమాచార హక్కు చట్టం పుట్టుకకు బీజాలు వేశాయి . సన్నకారు రైతులు, భూమిలేని కార్మికులు, ప్రజలతో కలసి సామాజిక న్యాయం..  జవాబుదారీతనం కోరుతూ ఉద్యమం చేపట్టింది.మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ ప్రచారాలు. పార్టీ  నిబద్ధతను స్ఫూర్తిగా తీసుకుని దేశంలో.. ప్రపంచంలో  మరెన్నో ఉద్యమాలు పుట్టుకొచ్చాయి.   అందుకే వారిని మనం ఎప్పుడూ అభినందించాల్సిందే.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!