అత్యధిక మెజారిటీ తో గెలిచిన రికార్డు ఈ ‘లాల్వానీ’ దే !

Sharing is Caring...

New Record ……………………..

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లోకసభ  నియోజక వర్గం నుంచి  ఎన్నికైన  శంకర్ లాల్వానీ కి  అత్యధికంగా 12,26,751 ఓట్లు వచ్చాయి. లాల్వానీ 11,75,092 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీ తో గెలిచిన ఎంపీ లల్వానీ యే. ఇదొక రికార్డు. బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన సంజయ్‌ ఆయనతో పోటీ పడ్డారు. సంజయ్ కు  51,659 ఓట్లు మాత్రమే వచ్చాయి.

ఇక్కడ నోటా కు కూడా రికార్డు స్థాయిలో ఓట్లు పడ్డాయి. 2.18 లక్షల మంది ఓటర్లు నోటాను ఎంపిక చేసుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ వేసి ఉపసంహరించుకున్నారు. 9మంది ఇండిపెండెంట్లు .. ముగ్గురు లోకల్ పార్టీల అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరెవరికీ డిపాజిట్లు దక్కలేదు.

కాంగ్రెస్ బరిలో ఉంటే కొంత పోటీ ఉండేది. బీజేపీ కి చెందిన  లాల్వానీ 2019 ఎన్నికలో కూడా పోటీ చేశారు. అప్పట్లో  5,47,754  మెజారిటీ తో ఆయన గెలిచారు. నాటి ఎన్నికల్లో 10,68,569 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి  5,20,815 ఓట్లు వచ్చాయి. 

శంకర్ లాల్వానీ అక్టోబర్ 16, 1961న ఇండోర్‌లో జన్మించారు. ఆయన  తండ్రి జమ్నాదాస్ లాల్వానీ, RSS .. జన్ సంఘ్‌లో క్రియాశీలక  సభ్యుడు. తల్లి గోరీ దేవి లాల్వానీ గృహిణి. లాల్వానీ ముంబైలో బిటెక్ చేశారు. తర్వాత ఇండోర్‌కు తిరిగి వచ్చి బిజినెస్ అండ్ కన్సల్టెన్సీ కోర్సు చేశాడు. 1980 ప్రారంభంలో బాంబే విశ్వవిద్యాలయంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌  విశ్వవిద్యాలయ ప్రతినిధిగా చురుగ్గా పని చేశారు. 

అప్పటి నుంచే ఆయన రాజకీయ ప్రయాణం మొదలయింది.  1994 నుండి 1999 వరకు ఇండోర్ మునిసిపల్ కార్పొరేషన్‌లో కౌన్సిలర్‌గా, ఆపై 1999 నుండి 2004 వరకు ఛైర్మన్‌గా పనిచేసిన  లాల్వానీ క్రమంగా అంచెలంచెలుగా ఎదిగారు. ఇండోర్‌లోని వార్డు నంబర్ 49 అధ్యక్షుడి గా చేసిన ఆయన ఎంపీ స్థాయికి చేరుకోవడం గొప్ప విషయం.

2013లో శంకర్ లాల్వానీ ఇండోర్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. తాజా చారిత్రాత్మక విజయం తో ఎవరీ లాల్వానీ అంటూ  గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. లోక్‌సభ చరిత్రలో ఇప్పటివరకు బీజేపీ నాయకురాలు ప్రీతమ్‌ ముండే  అత్యధిక మెజార్టీ  సాధించిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు.

ప్రీతమ్‌ ముండే తండ్రి గోపీనాథ్ ముండే ..కేంద్ర మంత్రిగా చేశారు. రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని బీడ్ లోక్‌సభ స్థానానికి 2014లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా  ప్రీతమ్‌ ముండే గెలుపొందింది. నాటి ఎన్నికల్లో 6,96,321 ఓట్ల ఆధిక్యత  సాధించి, లోక్‌సభ ఎన్నికల్లో సరికొత్త రికార్డును నమోదు చేసింది.

దాన్ని శంకర్‌ లాల్వానీ అధిగమించారు.  2014  లో కూడా ప్రీతం బీడ్ నుంచి పోటీ చేసి గెలిచారు .. అయితే మెజారిటీ  1,68,368 .. కి పరిమితమైంది. ౨౦౨౪ లో ఆమెకు బీజేపీ కి టిక్కెట్ ఇవ్వలేదు. ఆమె సోదరి పంకజ్ ముండే కి టిక్కెట్ ఇచ్చారు ..కానీ ఆమె ఓటమి పాలయ్యారు.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!