ఆ దేశాల ప్రజలు దెయ్యాల ఉనికిని నమ్ముతున్నారట !!

Sharing is Caring...

Is that true?  …………………………

హారర్ మూవీస్ , సీరియల్స్ లో మనం దెయ్యాలను చూస్తుంటాం. గతంలో  ఇంట్లో అమ్మమ్మలు, తాతయ్యలు, బామ్మలు కూడా దెయ్యాల కథలు చెప్పేవారు. ఈ జనరేషన్ పిల్లలైతే టీవీల్లోనే హారర్ షోస్ చూస్తుంటారు. అయితే నిజ జీవితంలో దెయ్యాలను చూశామని చెప్పేవారు చాలా తక్కువే . దెయ్యాలు కేవలం వినోదానికి సంబంధించిన సబ్జెక్ట్ అని మాత్రమే అనుకుంటారు.

కానీ అది నమ్మకాలకు సంబంధించినది. దెయ్యాల గురించి 2019లో IPSOS పోల్ పేరుతో అమెరికా లో ఒక సర్వే జరిగింది. ఈ సర్వేలో జనాలను దెయ్యాలను నమ్ముతున్నారా ? అని ప్రశ్నించారు . అమెరికాలో 46% మంది ప్రజలు దెయ్యాలను నమ్ముతామని చెప్పారట. 7 శాతం మంది తాము రక్తపిశాచులను కూడా నమ్ముతామని తెలియజేశారట.

బీబీసీలో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం తైవాన్ లో 90 శాతం మంది జనం తాము దెయ్యాలను చూసిన అనుభవాలున్నాయి అని చెప్పారట. జపాన్, కొరియా, చైనా, వియత్నాంలోని ప్రజలు కూడా దెయ్యాలను చూశామని, భయంకర అనుభూతులను ఎదుర్కొన్నట్టు చెప్పారట. ప్రపంచంలోని కొన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాలు, కళాశాలలలో ఘోస్ట్ క్లబ్బులు ఏర్పడ్డాయని వార్తలు కూడా వచ్చాయి.

వీటిలో కేంబ్రిడ్జ్, ఆక్స్ ఫర్డ్ తదితర విశ్వవిద్యాలయాలు కూడా ఉన్నాయి. 1882లో దెయ్యాలు, ఆత్మల గురించి అధ్యయనం చేయడానికి సొసైటీ ఫర్ ఫిజికల్ రీసెర్చ్ అనే సంస్థ అమెరికాలో ఏర్పాటయ్యింది.ఈ సంస్థ అధ్యక్షురాలు ఎలియనోర్ సెడ్గిక్ అనే మహిళ. ఆమెను మహిళా ఘోస్ట్ బస్టర్ అని పిలుస్తారు.

మన దేశంలో కూడా దెయ్యాలను చూసినట్టు కొందరు చెబుతుంటారు. అవి తెల్ల చీర కట్టుకున్నాయనో లేదా ఎర్ర చీర కట్టుకున్నాయనో చెబుతుంటారు. కొందరు కొరివి దెయ్యాలను కూడా చూసినట్టు చెబుతుంటారు. గతంలో నమ్మేవారు కానీ .. ఇలాంటి మాటలు ఇప్పుడు ఎవరూ నమ్మడం లేదు.

తెలుగులో హారర్ సినిమాలు వచ్చినప్పటికీ అవన్నీ కేవలం వినోద ప్రధానంగానే ఉంటున్నాయి. దీంతో జనం కి దెయ్యాలంటే భయం తగ్గిపోయింది. అయితే ఇప్పటికి కొన్ని ప్రాంతాల్లో దెయ్యాల ఉనికిని నమ్ముతారు. మొత్తం మీద చూస్తే దెయ్యాల సబ్జెక్ట్  ఎటూ తేలని విషయంగానే మిగిలిపోయిందని చెప్పుకోవాలి. అందులో సందేహం లేదు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!