ఒకనాటి రాజాధిరాజ నగరం.. పెనుకొండ !!
మైనాస్వామి……………………………………. పెనుకొండ ఒకప్పుడు మహానగరం.ఎందరో రాజులకు,రాజకుటుంబాలకు,మఠాధిపతులకు,ఘటిక స్థానాధి పతులకు, శిల్పాచార్యులకు, కళాకారులకు ఆశ్రయం కల్పించిన రాజ్యకేంద్రం. రాజాధిరాజనగరం. మౌర్య సామ్రాజ్య కాలం నుంచి పెనుకొండకు చరిత్ర వుంది. పురాణాలు, ఇతిహాసాలు, చారిత్రక సంఘటనలు పెనుకొండ గొప్పతనాన్ని వివరిస్తున్నాయి. మౌర్యులు,శాతవాహనులు,పల్లవులు,పశ్చిమ గంగరాజులు, చాళుక్యులు, నోలంబపల్లవులు, హొయసలప్రభువులు, విజయనగర చక్రవర్తుల పాలనలో పెనుకొండ రాజ్యం ఎంతో అభివృద్ధి అయింది. సాంస్కృతిక …