ఎవరీ సహజ నటుడు ?
Bharadwaja Rangavajhala…….. రుద్రవీణ సినిమాలో ‘చుట్టూపక్కల చూడరా కుర్రవాడా’ అంటూ చిన్నప్పటి చిరంజీవికి దిశానిర్దేశం చేస్తాడు ఓ వృద్దనటుడు. ఆయన్ని చిరంజీవి అభిమానులు అంతకు ముందే చూశారు. రాక్షసుడు చిత్రంలో దీవిలో చిరంజీవి – నాగబాబులతో పారిపోవడానికి ప్రయత్నించేది ఈ వృద్దుడే. నిజానికి అంతకు ముందు తెలుగునాట విడుదలై అద్భుతమైన విజయం సాదించిన ‘అపరిచితులు’ అనే …