కేరళ అందాలు తిలకిద్దామా ?

Sharing is Caring...

Magic of Malabar IRCTC Tour………………………………..

కేరళ ప్రకృతి అందాలకు మారుపేరు.అలాంటి కేరళ అందాలను యాత్రీకులకు చూపేందుకు  IRCTC మ్యాజిక్‌ ఆఫ్‌ మలబార్‌ పేరిట ప్రత్యేక టూర్‌ ప్యాకేజీ తీసుకొచ్చింది. తక్కువ ధరలోనే హైదరాబాద్ నుంచి విమానంలో వెళ్లి కేరళను చుట్టేసి రావొచ్చు.

ఈ టూర్‌ ప్యాకేజీ రూ. 27,100 నుంచి ప్రారంభమవుతుంది.  ఐదు రాత్రులు, ఆరు పగళ్లు టూర్ సాగుతుంది. ప్రయాణ తేది: 2023, డిసెంబర్‌ 23.. కవరయ్యే ప్రాంతాలు: కన్నూర్, గురువాయూర్, వయనాడ్ పర్యటన ఇలా సాగుతుంది..
డే1 (హైదరాబాద్ నుంచి కన్నూర్): ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి కన్నూర్ చేరుకుంటారు. అక్కడ ఐఆర్‌సీటీసీ సిబ్బంది మిమ్మల్ని పికప్ చేసుకొని హోటల్‌కి తీసుకెళ్తారు. హోటల్‌లో అల్పాహారం తరువాత ఏంజెలో ఫోర్ట్, అరక్కల్ మ్యూజియం సందర్శిస్తారు. మధ్యాహ్నం ఎజిమల వ్యూ పాయింట్‌ని సందర్శిస్తారు. రాత్రి భోజనం చేసిన కన్నూర్‌లోనే బస చేస్తారు. 

డే 2 (కన్నూర్ – వాయనాడ్): హోటల్‌లో అల్పాహారం చేశాక వాయనాడ్ బయలుదేరుతారు. అక్కడ బాణాసుర సాగర్ డ్యామ్, అంబలవాయల్ హెరిటేజ్ మ్యూజియం సందర్శిస్తారు. అనంతరం రాత్రి భోజనం చేసి వయనాడ్‌లోనే రాత్రి బస చేస్తారు.

డే 3 (వాయనాడ్): హోటల్‌లో అల్పాహారం చేశాక కురువా ద్వీపం, తిరునెల్లి ఆలయాన్ని సందర్శిస్తారు. హోటల్‌కి తిరిగి వెళ్లి రాత్రికి వయనాడ్‌లోనే బస చేస్తారు. డే 4(వాయనాడ్ – కోజిక్డోడ్ – గురువాయూర్): హోటల్‌లో అల్పాహారం చేశాక పూకోడ్ సరస్సు, లక్కిడి వ్యూ పాయింట్‌ని సందర్శిస్తారు.అనంతరం కోజికోడ్‌కు బయలుదేరుతారు. అక్కడ బేపూర్ బీచ్ సందర్శించి. సాయంత్రం గురువాయూర్‌కు బయలుదేరుతారు. అనంతరం  రాత్రి భోజనం చేసి అక్కడే హోటల్లో  బస చేస్తారు.

డే 5(గురువాయూర్): హోటల్‌లో అల్పాహారం చేశాక గురువాయూర్ ఆలయాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం మెరైన్ వరల్డ్ అక్వేరియంను  చూస్తారు.   అనంతరం తిరిగి హోటల్‌కు చేరుకొని భోజనం చేసి రాత్రికి అక్కడే బస చేస్తారు. డే 6(గురువాయూర్ – కొచ్చి): హోటల్‌లో అల్పాహారం చేశాక అతిరపల్లి జలపాతాలను సందర్శిస్తారు. మధ్యాహ్నం కొచ్చికి (70 కి.మీ.) బయలుదేరతారు.  .మెరైన్ డ్రైవ్ కోసం వెళతారు. రాత్రి 9:30 గంటలకు కొచ్చిన్ ఎయిర్‌పోర్ట్‌ నుంచి తిరుగు ప్రయాణం. 

ప్యాకేజీ ధరలు… 
హైదరాబాద్‌ నుంచి విమానంలో వెళ్లి వచ్చే ఈ టూర్‌ ప్యాకేజీ ధరలు ఇలా ఉన్నాయి. హోటల్లో సింగిల్‌ రూం ప్రత్యేకంగా కావాలనుకుంటే రూ. 34,000 ఖర్చు అవుతుంది. అదే హోటల్‌ రూంలో డబుల్‌ షేరింగ్‌ అయితే ఒక్కొక్కరికీ రూ. 28150 అవుతుంది. అలాగే ట్రిపుల్‌ షేరింగ్‌ అయితే ఒక్కొక్కిరికీ రూ. 27100 తీసుకుంటారు. ఐదేళ్ల నుంచి పదకొండేళ్ల పిల్లలకు ప్రత్యేక బెడ్‌ అవసరం అయితే రూ. 25050, ప్రత్యేక బెడ్‌ అవసరం లేకపోతే రూ. 23500 చార్జ్‌ చేస్తారు. రెండేళ్ల నుంచి నాలుగేళ్ల పిల్లలకు రూ. 19950 తీసుకుంటారు.

ఈ టూర్‌ ప్యాకేజీలో విమాన టికెట్లు (హైదరాబాద్-కన్నూరు / కొచ్చి-హైదరాబాద్) కవర్‌ అవుతాయి. 6సార్లు అల్పాహారం, 2 రాత్రి భోజనాలు అందిస్తారు. అక్కడ స్థానిక ప్రయాణాల కోసం ఏసీ టెంపో ట్రావెలర్‌ సదుపాయం కల్పిస్తారు. ట్రావెల్‌ ఇన్సురెన్స్‌ ఉంటుంది. 

ఐఆర్‌సీటీసీ ఎస్కార్ట్‌సేవలు లభిస్తాయి. అయితే మధ్యాహ్న భోజనం, మిగిలిన రాత్రి భోజనాలతో పాటు విమానంలో ఆహారాన్ని పర్యాటకులే సమకూర్చుకోవాలి. స్థానిక ఆలయాల్లో దర్శన టికెట్లు కూడా ప్రయాణీకులే భరించాలి. వివరాలకు ఐఆర్‌సీటీసీ టూరిజమ్‌ అధికారిక వెబ్‌ సైట్ చూడండి. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!