యూట్యూబ్ లో ఆర్కే పై సెటైరికల్ షోలు !

Sharing is Caring...

యు ట్యూబ్ ఛానల్ లో స్ట్రీమింగ్ అవుతున్న దమ్మున్న ఛానల్ అధినేత ఆర్కే పై ” సెటైరికల్  షో ” లు  సంచలనం సృష్టిస్తున్నాయి. బీమవరానికి చెందిన దిలీప్ సుంకర ఈ  షోలు చేస్తున్నారు. ఈ షో లో ఆర్కే ని  పోలిన వ్యక్తిని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేస్తున్నారు. అతగాడు ఎవరో కానీ ఆర్కే మేనరిజం ను యధాతధంగా దించుతున్నాడు.ఏబీఎన్ ఛానల్ లో “ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే” అనే పేరిట ఇంటర్వ్యూ లు ప్రసారమయ్యే సంగతి తెలిసిందే. సుంకర దిలీప్ ఇంటర్వ్యూ లు  “ఓపెన్ అటాక్ విత్ రాకీ” పేరిట సాగుతున్నాయి.

ఆర్కే జ్యోతి లో రాసే  కొత్త పలుకు ఎడిటోరియల్ ను.,ఆర్కే ను టార్గెట్ చేస్తూ ఈ షో సాగుతుంది. ఆర్కే పాత్రధారి అచ్చం ఆర్కే మాదిరిగానే నటిస్తూ హావాభావాలు ప్రదర్శిస్తూ అనర్గళంగా మాట్లాడటం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ షో లో రాకీ పాత్రధారి తో సమానంగా దిలీప్ సుంకర మాట్లాడు తుంటారు. పూర్తి సెటైరికల్గా సాగుతున్న ఈ ఇంటర్వ్యూలలో ప్రధానంగా ఆర్కే, చంద్రబాబు, లోకేష్ లపై విమర్శలు ఉన్నాయి. వైసీపీ అధినేత జగన్ పై కూడా  కొన్ని విమర్శలు లేకపోలేదు. లీగల్ సమస్యలు రాకుండా దిలీప్ సుంకర ఈ వీడియోలు తయారు చేసి యు ట్యూబ్ లో అప్ లోడ్ చేస్తున్నారు.

“రాకీ అటాక్” ఇంటర్వ్యూలు ఆరు ఎపిసోడ్లకు పైగా యూట్యూబ్ లో ఉన్నాయి. ఈ ఇంటర్వ్యూ లకు ఆదరణ బాగుంది. సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.గతంలో చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం, పవన్ కళ్యాణ్ స్థాపించిన జన సేన పార్టీల తరపున దిలీప్ సుంకర అధికార ప్రతినిధిగా కొన్నాళ్ళు పనిచేశారు. ప్రస్తుతం హైకోర్టు లో అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్న దిలీప్ ఇటీవలే తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వీడియోలను అప్లోడ్ చేశారు. సమకాలీన రాజకీయాలపై స్పందిస్తున్నారు. 

రాకీ ఇంటర్వ్యూలతో పాటు  ఇతర అంశాలపై కూడా వీడియో లు తీస్తున్నారు. ప్రధానంగా ఆర్కే పై సెటైర్లు మాత్రం బాగా పేలుతున్నాయి. మరో విధంగా చెప్పాలంటే ఉతికి ఆరేస్తున్నారు. కాగా ఈయన పేస్ బుక్ పేజీలపై… ఛానల్ పై   కొంతమంది  ఫిర్యాదు చేశారు. దీంతో అవి కొన్నాళ్ళు ఆగిపోయాయి. తర్వాత యు ట్యూబ్ ఛానల్ పై  హ్యాకర్లు దాడి చేశారు. కొంత కంటెంట్ ను డిలీట్ చేశారు.  ఓపెన్ అటాక్ రాకీ ఇంటర్వ్యూలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల వారు చూడొచ్చు. 

watch here      https://www.youtube.com/watch?v=J_w0_44B_t0 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!