చైనాను కమ్మేసిన ఇసుక తుఫాన్ !

Sharing is Caring...

వాయువ్య చైనా ను ఇసుక తుఫాన్ బెంబేలెత్తిస్తోంది. ఇప్పటికే వానలు , వరదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఈ ఇసుక తుఫాన్ తో భీతిల్లిపోతున్నారు. చైనాలోని డన్ హువాంగ్ నగరాన్ని 300 అడుగుల ఎత్తులో ఇసుక తుఫాను ముంచెత్తింది. ఇసుక మేఘంలా కమ్ముకుంది. ఈ పరిణామంతో ప్రధాన రహదారులను మూసేసారు. ప్రజలు ఇంటి లోపల ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. డన్ హువాంగ్ మొనావో గుహలకు నిలయం. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఈ నగరం గోబీ ఎడారి కి దగ్గరలోఉంది.

ఈ ఇసుక .. దుమ్ము ధూళి గోబీ ఎడారి నుంచే వస్తుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. కేవలం నిమిషాల్లోనే  కార్యాలయాలు, ఇళ్ళు,ఆసుపత్రులు ఇసుకతో నిండిపోయాయి. దీంతో వృద్ధులు .. శ్వాస కోశ సమస్యలున్న రోగులు ఇబ్బంది పడుతున్నారు. గోబీ ఎడారి మూలంగా తరచుగా ఇలాంటి విపత్కర పరిస్థితులు ఇక్కడి వారు ఎదుర్కొంటున్నారు. ఇవాళ  మధ్యాహ్నం  యెల్లో హెచ్చరిక జారీ చేసారు. దీంతో పోలీసులు, అధికారులు అప్రమత్తమై ప్రజలు బయటికి రాకుండా చూస్తున్నారు.  ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో  వైరలవుతోంది. మీరు చూడండి. 

Watch vedeo    ………………………………. ఇసుక తుఫాన్

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!