అంగోలాలో ఇటీవల కనుగొన్న170 క్యారెట్ల అరుదైన గులాబీ వజ్రం గత 300 సంవత్సరాలలో బయటపడిన అతిపెద్ద డైమండ్ అని కంపెనీ చెబుతోంది. దీన్ని “లులో రోజ్” అని పిలుస్తారు, ఇది అంగోలాలోని లూలా నోర్టే ప్రాంతంలోని లులో ఒండ్రు డైమండ్ గనిలో త్రవ్వకాలలో దొరికింది. ఈ గని లుకాపా డైమండ్ కంపెనీకి చెందింది..10,000 వజ్రాలలో ఒకటి మాత్రమే గులాబీ రంగులో ఉంటుంది. కాబట్టి ఇది అరుదైన పెద్ద పింక్ డైమండ్ అంటున్నది కంపెనీ యాజమాన్యం.
ఈ పింక్ డైమండ్ వేలం పాటలో అధిక విలువను పొందుతుందని అంచనా వేస్తున్నారు. అయితే దాని రంగు కారణంగా ఎలాంటి ప్రీమియం వస్తుందో తెలియదని యాజమాన్యం అంటోంది. ఒండ్రు గని అంటే నదీగర్భం నుండి ఈ విలువైన రాళ్లను వెలికి తీస్తారు. లుకాపా భూగర్భ నిక్షేపాల కోసం నదీ గర్భంలో వెతుకుతోంది, దీనిని కింబర్‌లైట్ పైపులు అని పిలుస్తారు, ఇది వజ్రాల ప్రధాన వనరుగా ఉంటుంది.
ఈ గనిలో దాదాపు 400 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. అంగోలాలో ఇప్పటివరకు రెండు అతిపెద్ద వజ్రాలు లభించాయి.ఇందులో 404 క్యారెట్ల క్లియర్ డైమండ్ కూడా ఉంది. లుకాపా ప్రకారం గులాబీ వజ్రం గనిలో లభించిన ఐదవ అతిపెద్ద వజ్రం. పింక్ డైమండ్‌ను అంగోలాన్ స్టేట్ డైమండ్ మార్కెటింగ్ కంపెనీ అంతర్జాతీయ టెండర్ ద్వారా విక్రయించనుంది.అంగోలా గనులు ప్రపంచంలోని టాప్ 10 వజ్రాల ఉత్పత్తిదారులలో ఒకటిగా నిలిచాయి. .