కొత్త బిజినెస్ లోకి రజనీ కాంత్ !

Sharing is Caring...

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీ కాంత్ కొత్త వ్యాపారంలోకి ప్రవేశించారు.యువతరం కోసం హూటే'(HOOTE)  అనే యాప్ ను లాంచ్ చేశారు. రజనీ కుమార్తె ఈ ప్రాజెక్టు బాధ్యతలను చేపట్టారు. ఈ యాప్ ద్వారా యూజర్లు తమకు నచ్చిన ఏ భాషలోనైనా వారి ఆలోచనలను, అభిప్రాయాలను వారి వాయిస్ ద్వారానే వ్యక్తపరచడానికి.. పంపడానికి ఉపయోగపడుతుంది.

రజనీ తనే స్వయంగా యాప్ లాంచ్ చేయడంతో పాటు దాన్ని ప్రమోట్ చేస్తూ  సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టారు. ఇప్పుడు వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో కూడా వాయిస్ మెసేజ్ సదుపాయం ఉంది. చాలా తక్కువమందే వాటిని వినియోగిస్తారు. ప్రత్యేకంగా వాయిస్ మెసేజెస్ కోసం  ‘హూటే’ పేరిట యాప్‌ను తయారు చేశారు.

చదువు రాని వారు సైతం సులభం గా వాయిస్ మెసేజ్ రికార్డు చేసి పంపే విధంగా ఈ యాప్ ను తయారు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ యాప్ ను మార్కెట్ చేయబోతున్నారు.15 భారతీయ భాషల్లో..10 అంతర్జాతీయ భాషల్లో Hoote మొబైల్ అప్లికేషన్‌ అందుబాటులో ఉంటుంది.

ఈ ప్రాజెక్టు లో సన్నీ పోకల ఒక భాగస్వామి కాగా .. సౌందర్య  మరో భాగస్వామి. ప్రాజెక్టు ను వారే పర్యవేక్షిస్తారు.ఈ మేడ్ ఇన్ ఇండియా టెక్ యాప్ iOS .. ఆండ్రాయిడ్ ఫోన్లలో పనిచేస్తుంది. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, నిపుణులు, పారిశ్రామికవేత్తలు తమ వాయిస్ ద్వారా ఎక్కువ మంది ప్రజలతో కనెక్ట్ అవ్వడానికి ఇది ఒక సాధనంగా ఉపయోగపడుతుందని ప్రచారం చేస్తున్నారు.

యూజర్స్ వారి వాయిస్ క్లిప్‌లను మిత్రులకు పంపడంతో పాటు  ప్రైవేట్ .. పబ్లిక్ గ్రూప్‌లను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇమేజ్ లను..మ్యూజిక్ ను  షేర్ చేసుకోవచ్చు. ఇదే ఫీచర్లతో క్లబ్ హౌస్ యాస్ కొన్నాళ్ల క్రితం విడుదల అయింది. ఇంచుమించు అలాంటి ఫీచర్స్‌తో హూటే యాప్ మార్కెట్లోకి వచ్చింది. మరి కొద్దీ రోజులు పోతేగానీ ఈ యాప్ కు ఎలాంటి స్పందన లభిస్తున్నదో తెలీదు. 
 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!